Xi Jinping: గ్లోబల్ పాలిటిక్స్‌పై ఆసక్తికర కామెంట్లు చేశారు చైనా ప్రెసిడెంట్ జిన్‌పింగ్. ట్రాఫిక్ సిగ్నల్స్ లేని రోడ్డు మీద ట్రాఫిక్ గందరగోళం ఉంటుందన్న ఆయన.. ఇప్పుడు మన గ్లోబల్ పాలిటిక్స్ కూడా అలాగే తయారయ్యాయన్నారు. రూల్స్ లేని ఈ ప్రపంచం ఎవరికీ సురక్షితం కాదంటూ బిగ్ వార్నింగ్ ఇచ్చారు. బలం ఉన్నోడిదే రాజ్యం అనే రూల్స్ ఇకపై చెల్లవంటూ బ్రిక్స్ సమ్మిట్‌లో ఆయన పవర్ ఫుల్ కామెంట్స్ చేశారు.
ఢిల్లీ వేదికగా జరిగిన బ్రిక్స్ సమ్మిట్ గ్లోబల్ పాలిటిక్స్‌లో ఇప్పుడు బిగ్ డిబేట్‌గా మారింది. సదస్సు ముగింపు కార్యక్రమంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మాట్లాడుతూ.. ప్రపంచ వ్యవస్థపై షాకింగ్ కామెంట్స్ చేశారు. రూల్స్ లేని ప్రపంచం.. ట్రాఫిక్ సిగ్నల్స్ లేని జంక్షన్ లాంటిదని.. అక్కడ కచ్చితంగా యాక్సిడెంట్స్, గందరగోళం పక్కా అని తేల్చిచెప్పేశారు. దేశాల సైజ్ ఎంత, వాళ్ల వెల్త్ ఏంటి అనేది ముఖ్యం కాదని.. గ్లోబల్ స్టేజ్‌పై ప్రతీ దేశం ఈక్వలేనని స్ట్రాంగ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు జిన్‌పింగ్.
Also read: తెలంగాణలో మారిన మున్సిపల్ రూల్స్.. ఆ తప్పు చేస్తే హోటళ్లు, షాపులు సీజ్!
ఇక గ్లోబల్ సౌత్ కంట్రీస్‌కు జిన్‌పింగ్ సాలిడ్ పిలుపునిచ్చారు. సప్లై చైన్‌ను కాపాడుకుంటూ, మార్కెట్‌ను పరుగులు పెట్టించేందుకు బ్రిక్స్ దేశాలన్నీ ఒక్కటవ్వాలని పిలుపునిచ్చారు. ట్రేడ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్వెస్ట్‌మెంట్స్, టెక్నాలజీ సపోర్ట్.. ఇలా అన్ని రంగాలను లెవెల్ అప్ చేయడానికి ఆయన ఏకంగా ఫైవ్ పాయింట్ యాక్షన్ ప్లాన్‌ను టేబుల్ మీద పెట్టారు. కేవలం జియో పొలిటికల్ పవర్స్ గుత్తాధిపత్యం నడవదని.. ఇంటర్నేషనల్ లాస్ అందరికీ ఈక్వల్‌గా అప్లై కావాల్సిందేనని తేల్చిచెప్పారు.
అంతర్జాతీయ వ్యవహారాల్లో యునైటెడ్ నేషన్స్ పవర్‌ను కాపాడుకోవాల్సిన టైమ్ వచ్చేసిందని జిన్‌పింగ్ గుర్తుచేశారు. ఏ ఒక్కరి చేతిలోనో పెత్తనం ఉండకూడదని.. అన్ని దేశాలకూ గ్లోబల్ డెసిషన్స్‌లో ఈక్వల్ పార్టిసిపేషన్ ఉండాలని డిమాండ్ చేశారు. బలవంతుడిదే రాజ్యం అనే పురాతన మైండ్‌సెట్‌ను వదిలేసి.. కొత్త అధ్యాయానికి తెరలేపాలని బ్రిక్స్ లీడర్స్‌కు పిలుపునిచ్చారు. మొత్తానికి ఢిల్లీ వేదికగా జిన్‌పింగ్ కొట్టిన ఈ పొలిటికల్ పొగరు దెబ్బకు.. రాబోయే రోజుల్లో గ్లోబల్ పాలిటిక్స్ ఊపు మారుతుందనడంలో ఎలాంటి డౌట్ లేదు.
Also read: నంద్యాలలో విద్యుత్ JE మిస్సింగ్ కలకలం.. తిరుపతి వెళ్తున్నానని చెప్పి ఎక్కడికెళ్లారు?