YS Sharmila vs YS Jagan: ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కకుండా పోయిన మాజీ ముఖ్యమంత్రి జగన్‌కి చెల్లెలి కష్టాలు మాత్రం తప్పడం లేదు. ఇష్యూ ఏదైనా పీసీసీ ప్రెసిడెంట్ షర్మిల ఆయన్ని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. తాజాగా విశాఖపట్నంలో ప్రధాని నరేంద్రమోడీ టూరుతో లింకుపెట్టి జగన్‌కు అక్రమ సంబంధం అంటగట్టేశారు. ఆమె ఆ స్థాయిలో విరుచుకుపడినా వైసీపీ అధ్యక్షుడిగా జగనే కాదు ఆ పార్టీ లీడర్లు కూడా కౌంటర్ ఇవ్వలేకపోతుండటం విశేషం.
సందర్భం మరేదైనా , ఇష్యూ ఎలాంటిదైన వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, తన సోదరుడు జగన్ పై నిప్పులు చెరగడంలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. జగన్‌ను కూటమి నేతల కంటే ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఎప్పటికప్పుడు డిఫెన్స్‌లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ప్రధానమంత్రి మోడీ ఆంధ్రప్రదేశ్ లో పర్యటించిన వెళ్లిన సందర్భంగా జగన్ మరోసారి ఆమెకు టార్గెట్ అయ్యారు. విశాఖ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోడీ శంకుస్థాపనలు చేశారు. అయితే.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై మాత్రం నోరు మెదపలేదు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం వైఖరి ఎందుకు చెప్పలేకపోయారని షర్మిల ప్రశ్నించారు. అలాంటి మోడీ చుట్టూ తిరుగుతూ అధికార, ప్రతిపక్షాలు ఆయన జపం చేస్తున్నాయని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసిన మోడీతో చంద్రబాబు సక్రమ సంబంధం పెట్టుకుంటే.. వైసీపీ అక్రమ సంబంధం పెట్టుకుందంటూ జగన్ పై విమర్శలు గుప్పించారు
వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ అయ్యి ఉండి జగన్ బీజేపీతో అంటకాగుతున్నారని విమర్శలు గుప్పించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై మోడీ మాట్లాడకపోయినా మౌనంగా ఉండటంపై అటు ఏపీ కూటమి ప్రభుత్వాన్ని, జగన్ ను ప్రశ్నించారు. ఏపీలో పీసీసీ చీఫ్‌గా షర్మిల బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే ఏపీలో అప్పటి ముఖ్యమంత్రి జగన్‌కు కష్టాలు షూరు అయ్యాయి. అప్పట్లో ప్రతిపక్ష హోదాలో ఉన్న చంద్రబాబు గానీ.. ఆ పార్టీ నాయకులు కానీ.. జనసేన అధినేత పవన్‌కళ్యాన్ కాని ఎన్ని విమర్శలు చేసినా జగన్ పెద్దగా సీన్‌లోకి వచ్చే వారు కాదు.. మంత్రులతోనో.. ఎమ్మెల్యేలతోనో కౌంటర్లు ఇప్పించేవారు. కానీ షర్మిల ఎంట్రీతో సీన్ మారింది. ఫ్రేమ్‌లోకి చెల్లి వచ్చి కూర్చోవడంతో జగనే స్వయంగా మాట్లాడాల్సి వచ్చేది. అంతలా అన్నకి సినిమా చూపించారామె.
వైఎస్ వివేకా హత్యను ఎన్నికల ప్రచారంలో షర్మిల ప్రచారాస్త్రంగా మార్చుకుని వైసీపీని ముప్పతిప్పలు పెట్టారు. జె బ్రాండ్ మద్యం, ఇసుక తవ్వకాలు.. ఇలా ఏ ఇష్యూని వదలకుండా జగన్‌కి చుక్కలు చూపించారు .. వైసీపీ ఓటమి తర్వాత కూడా పీసీసీ చీఫ్ ఆ పార్టీని వదిలిపెట్టడం లేదు.. జగన్ అసలు వైఎస్ఆర్ వారసుడే కాదని తేల్చిచెప్పిన ఆమె. తర్వాత కాదంబరి విషయంలోనూ జగన్‌పై నిప్పులు చెరిగారు.
Also Read: తిరుపతి తొక్కిసలాట ఘటన.. పవన్‌ను టార్గెట్ చేసిన వైసీపీ
వైఎస్ నిజమైన వారసురాల్ని తానే అంటున్న షర్మిల .. ఆ ఇమేజ్ సొంతం చేసుకోవడానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లు కనిపిస్తున్నారు. అన్న జగన్‌ని పర్సనల్‌గా తీసుకుని టార్గెట్ చేస్తూ ఆయన ఇమేజ్‌ని డ్యామేజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వాస్తవానికి 11 సీట్లకు పరిమితమైన వైసీపీని పీసీసీ ప్రెసిడెంట్ పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు.. అయినా సందర్భం వచ్చినప్పుడల్లా వైఎస్ఆర్‌సీపీకి వైఎస్ఆర్‌ను దూరం చేయడానికి ఆమె ప్రయత్నిస్తూ.. జగన్‌కి లిటరల్‌గా చుక్కటు చూపిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.