Kerala: అమీబా ఒక రకమైన సూక్ష్మజీవి, ఇది ప్రపంచవ్యాప్తంగా మట్టిలో, వెచ్చని మంచినీటి వనరులలో ఉంటుంది. ఇది ఒక ఫ్రీ-లివింగ్ అమీబా, అంటే స్వతంత్రంగా జీవించే ఒక కణ జీవి. ఇది మానవులకు సంక్రమించినప్పుడు Primary Amebic Meningoencephalitis (PAM) అనే తీవ్రమైన వ్యాధిని కలిగిస్తుంది.
కేరళలో మెదడు తినే అమీబా
ఇది మెదడు టిష్యూను నాశనం చేస్తుంది, మెదడు వాపును తెస్తుంది. సాధారణంగా భూమి లేదా నీటిలో ఉండి, వెచ్చని ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు ఇది వృద్ధి చెందుతుంది. ఈ అమీబా మనుషులకు మాత్రమే కాకుండా ఇతర జంతువులకు కూడా సంక్రమించవచ్చు, కానీ మానవులలో ఇది అరుదైనది కానీ మరణకరమైనది.
మొత్తం 61 కేసులు గుర్తించిన అధికారులు.. రోగుల్లో 3 నెలల శిశువు నుంచి 91 ఏళ్ల వృద్ధుల వరకూ
కేరళలో 2025లో ఈ అమీబా సంక్రమణ ఒక పెద్ద సమస్యగా మారింది. ఈ సంవత్సరం సెప్టెంబర్ 18 నాటికి, కేరళలో 61 నుంచి 71 కన్ఫర్మ్డ్ కేసులు నమోదయ్యాయి, వీటిలో 19 మరణాలు సంభవించాయి. బాధితులు మూడు నెలల శిశువు నుంచి 91 ఏళ్ల వృద్ధుల వరకు ఉన్నారు.
ఇప్పటికే 19 మంది దుర్మరణం
కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ హై అలెర్ట్ ప్రకటించారు. ఈ కేసులు ముఖ్యంగా ఆగస్టు-సెప్టెంబర్ నెలల్లో పెరిగాయి.. రాష్ట్రంలోని 5.5 మిలియన్ బావులు, 55,000 చెరువులు ఈ సంక్రమణకు హాట్‌స్పాట్‌లుగా మారాయి. గత 9 నెలల్లో 19 మరణాలు జరగడంతో, ప్రభుత్వం, విపక్షాల మధ్య రాజకీయ వివాదం కూడా రేగింది.
నిల్వ నీరుగల చెరువులు, సరస్సుల్లో స్నానం చేస్తే చాలు.. ఖతమ్
ఈ అమీబా ముక్కు ద్వారా నీరు చేరినప్పుడు మెదడుకు వ్యాపిస్తుంది. శుద్ధి చేయని చెరువులు, సరస్సులు లేదా నిలిచిపోయిన నీటిలో ఈతకు దిగినప్పుడు లేదా ముక్కు శుభ్రం చేసుకునేటప్పుడు ఇది చేరుతుంది. నీటిని తాగినా ఇది సంక్రమించదు, మనుషుల మధ్య వ్యాపించదు. ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల కేరళలో ఈ కేసులు పెరిగాయి.
ఈ వ్యాధి లక్షణాలు..
మొదట్లో తలనొప్పి, జ్వరం, వాంతులు, వికారం వంటివి వస్తాయి. తర్వాత మెడ బిగుసుకుపోవడం, గందరగోళం, దృష్టి లోపం, హాలుసినేషన్స్, కోమా వంటివి జరుగుతాయి. సింప్టమ్స్ మొదలైన 1-18 రోజుల్లో మరణం సంభవిస్తుంది, సాధారణంగా 5 రోజుల్లో. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యం చేయించుకోవడం వల్ల మరణాల సంఖ్యను తగ్గించ్చవచ్చు..
Also Read: ప్రాణాలు తీసిన ఆన్ లైన్ గేమ్.. ఆత్మహత్య చేసుకున్న బీటెక్ విద్యార్థి
జాగ్రత్తలు..
ఈ సమస్యను నివారించడానికి ప్రజలు శుద్ధి చేయని నీటి వనరులలో స్నానం చేయకుండా జాగ్రత్త వహించాలి.. అంతేకాకుండా నిల్వ నీటిలో ఈతకు దిగరాదంటోన్న వైద్యులు.. దీని వల్ల ఈ వ్యాధిని అరికట్టవచ్చని చెబుతున్నారు..