Udaya Bhanu: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో సీనియర్ యాంకర్ ఉదయభాను(Udaya Bhanu) ఒకరు. ఒకానొక సమయంలో ఇండస్ట్రీ కి సంబంధించి ఏదైనా ఒక కార్యక్రమం జరగాలన్న లేదా ఒక టీవీ షో జరగబోతోంది అంటే తప్పనిసరిగా అందరికీ ఉదయభాను గుర్తుకు వచ్చేవారు. ఇక ఈమె ఎన్నో అద్భుతమైన షోలకు యాంకర్ గా వ్యవహరించారు. ఇలా యాంకర్ గా, నటిగా ఎంతో బిజీ బిజీగా గడిపిన ఉదయభాను ఇటీవల కాలంలో పెద్దగా అవకాశాలను మాత్రం అందుకోలేకపోతున్నారు. ఇప్పుడిప్పుడే తిరిగి కెరియర్ పై ఫోకస్ చేసిన ఉదయభాను ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు నిర్మాతగా కూడా మారే ప్రయత్నాలు చేస్తున్నారు.
యాంకర్ గా గుర్తింపు పొందిన ఉదయభాను…
ఉదయభాను నటించిన త్రిభాణాదారి బార్బరిక్ (Tribanadhari Barbarik)సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆగస్టు 22వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రదర్శన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నటుడు సత్యరాజ్(Satya Raj) తో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె సినిమా ఇండస్ట్రీ గురించి అలాగే బుల్లితెర కార్యక్రమాల గురించి ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ తాను హోస్టుగా వ్యవహరించిన రేలారే రేలా.. ఢీ వంటి కార్యక్రమాలు ట్రెండ్ సృష్టించాయని నా తర్వాత ఈ కార్యక్రమాలకు యాంకర్ గా చేయడానికి ఎంతోమందిని ఆడిషన్స్ చేశారని, మనం యాంకర్ గా చేస్తున్నాము అంటే 100% ఆ కార్యక్రమానికి న్యాయం చేస్తానని ఉదయభాను తెలిపారు.
స్క్రిప్ట్ ప్రకారమే నడుచుకోవాలి…
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె రియాలిటీ షో ల(reality shows) గురించి కూడా ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు. పేరుకే రియాలిటీ షో తప్ప అందులో రియాలిటీ లేదని మొత్తం స్క్రిప్ట్ ప్రకారమే నడుచుకోవాలని తెలిపారు. ఇటీవల కాలంలో రియాలిటీ షోలలో యాంకర్లకు చిన్న మైక్ చెవి దగ్గర ఇస్తుంటారు. అయితే అందులో మనం ఎవరితో ఏం మాట్లాడాలి? ఎప్పుడు ఏం చెప్పాలి అనే విషయాలన్నీ కూడా చెబుతూ ఉంటారని, ప్రస్తుతం వస్తున్న రియాలిటీ షోలన్నీ కూడా స్క్రిప్ట్ అంటూ ఉదయభాను అసలు గుట్టు బయటపెట్టారు.
ఎంతో పశ్చాత్తాపడ్డాను…
అదృష్టవశాత్తు అలాంటి మైకులు రాకముందే నేను యాంకర్ గా చాలా మంచి మంచి కార్యక్రమాలు చేశాను. అలాంటి మైక్స్ వచ్చినప్పుడు కూడా ఒక రెండు మూడు షోలు చేశానని, ఆ షోలు చేసిన తర్వాత చాలా పశ్చాత్తాపడ్డాను అంటూ ఉదయభాను ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. త్రిభాణాదారి బార్బరిక్ సినిమా విషయానికొస్తే సరికొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. నటుడు సత్యరాజ్ ప్రధాన పాత్రలో నటించగా.. ఈ సినిమాను డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యులాయిడ్ బ్యానర్ పై విజయ్ పాల్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ చూస్తే మాత్రం సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి.
Also Read: Jr NTR : నమ్మలేకపోతున్నా… వార్ 2 కంబ్యాక్‌పై ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్