E-Paper

Movies in Theater : ఈ వారం బాక్సాఫీస్ వార్.. థియేటర్లలో సందడి చెయ్యబోతున్న చిత్రాలు..

Movies in Theater : ఈ వారం బాక్సాఫీస్ వార్.. థియేటర్లలో సందడి చెయ్యబోతున్న చిత్రాలు..
Advertisement

Movies in Theater : ప్రతినెల సినిమాల సందడి థియేటర్ల వద్ద ఉండనే ఉంటుంది. చిన్న సినిమాలనుంచి పెద్ద సినిమాల వరకు ప్రతి ఒక్కటి కూడా థియేటర్లలోకి వచ్చేస్తూ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంటాయి.. ఈమధ్య సమ్మర్ సినిమాలపై ఫ్యాన్స్ నిరాశ పడ్డారు.. సమ్మర్లో అనుకున్న సినిమాలు ఏవి రిలీజ్ కాలేదు. దాంతో ఇప్పుడు జూన్ నెలలో రిలీజ్ కాబోతున్న సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఈ నెలలో ఆల్రెడీ రామ్ చరణ్ నటించిన పెద్ది మూవీ రిలీజ్ అయింది.. ప్రస్తుతం ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేస్తుంది. ఒకవైపు పాజిటివ్ టాక్ అందుకుంటున్న మరోవైపు కలెక్షన్ల వస్తున్నాయి సృష్టిస్తుంది.. ఇకపోతే జూన్ చివరి వారంలో ఏ సినిమాలు థియేటర్లలో రిలీజ్ కాబోతున్నాయో ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

జూన్ చివరివారం రిలీజ్ కాబోతున్న సినిమాలు..

జూన్ నెలలో స్టార్ హీరోల సినిమాలు పోటీ పడుతున్నాయి అన్న విషయం తెలిసిందే.. ఇప్పుడు రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా థియేటర్లలో సక్సెస్ఫుల్ టాక్ తో దూసుకుపోతుంది.. అంతేకాదు సినిమా టాక్ బాగుండడంతో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.. మరి ఈ నెలలో ఇంకా ఏ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయో ఇప్పుడు మనం ఓసారి చూసేద్దాం…

మా ఇంటి బంగారం..

Advertisement

టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత రెండవ పెళ్లి చేసుకున్న తర్వాత నటించినా మొదటి చిత్రం మా ఇంటి బంగారం. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రతి అప్డేట్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. దాంతో ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే పెరిగాయి.. ఎప్పుడు ఎప్పుడు సినిమాని థియేటర్లలో చూస్తామని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. భారీ అంచనాల నడుమ జూన్ 19న ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది..

వంద దేవుళ్లు..

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోని నటించిన బిచ్చగాడు మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ ప్రభంజనాన్ని సృష్టించింది.. ఈ సినిమాకు సీక్వల్గా మరో సినిమా కూడా వచ్చింది అది కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి టాక్ ని సొంతం చేస్తుంది. దర్శకుడు శశితో కలిసి విజయ్ ఆంటోనీ చేస్తున్న చిత్రం వంద దేవుళ్ళు.. ఈ మూవీ కూడా జూన్ 19న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది.

ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు..

Advertisement

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ క్రేజీ హీరోగా పేరు తెచ్చుకున్న వడ్డే నవీన్ చాలా కాలం తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఈయన నటిస్తున్న సినిమా ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు.. డిఫరెంట్ జానెర్ లో వచ్చిన ఈ సినిమా ఈనెల 19న థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది..

కాక్‌టెయిల్ 2..

బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న, కృతి సనన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం కాక్ టెయిల్.. ఈ మూవీ కూడా బాలీవుడ్ లో భారీ అంచనాలను క్రియేట్ చేసుకుంది. అయితే ఇటీవలే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం జనవరి 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..

Also Read :Podarillu Today Episode : కొట్టుకున్న కేశవ, చక్రీ.. మహా దెబ్బకు షాక్.. మాధవ్ ఫుల్ హ్యాపీ.. సర్ప్రైజ్ అదిరింది..

వీటితో పాటుగా, బాలన్: ది బాయ్, దీవానా వంటి చిన్న సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. మొత్తానికి ఈ వారం బాక్స్ ఆఫీస్ వద్ద ఆరు సినిమాలు పోటీ పడుతున్నాయి.. మరి ఈ సినిమాలలో ఏ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద విన్నర్ గా నిలిచి కలెక్షన్లను కొల్లగొట్టేస్తుందో చూడాలి.. ఇక వచ్చేవారం నాని నటించిన ప్యారడైజ్ సినిమా రిలీజ్ కాబోతుందని తెలుస్తుంది..

Related News

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. స్టార్ హీరో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు!

రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?.. అస్సలు ఊహించలేరు..

‘బ్లాస్ట్’ బ్యూటీని పట్టేసిన శ్రీను వైట్ల.. హీరోయిన్ సెలెక్షన్ ఓకే కానీ, ఆ రిలీజ్ డేట్ రిస్కేనా?

Maa Inti Bangaaram Twitter Review: ‘మా ఇంటి బంగారం ‘ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

అబ్బాయ్ కోసం తప్పుకున్న బాబాయ్.. ‘పెద్ది’ వల్ల ‘గబ్బర్ సింగ్’ రీ-రిలీజ్ వాయిదా!

Vanda Devullu : విజయ్ ఆంటోనీ ‘వంద దేవుళ్ళు’ రివ్యూ: బిచ్చగాడు రేంజ్ ఉందా?

నాగ్ ‘KING 100’ నుంచి మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్.. రంగంలోకి దిగిన కన్నడ రియల్ స్టార్

బాహుబలి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదుగా.. ఫ్రాన్స్‌లో ప్రభాస్ యానిమేషన్ సినిమా సెన్సేషన్!

Big Stories

×