BigTV English

Alekhya Chitti : ‘బిగ్ బాస్’కు వెళ్లాలని ఉంది, కానీ.. అలేఖ్య చిట్టి అక్క సుమ‌ క్లారిటీ

Alekhya Chitti : ‘బిగ్ బాస్’కు వెళ్లాలని ఉంది, కానీ.. అలేఖ్య చిట్టి అక్క సుమ‌ క్లారిటీ

Alekhya Chitti : తెలుగు రాష్ట్రాల్లో అలేఖ్య చిట్టి పీకేల్స్ వివాదం హాట్ టాపిక్ అవుతుంది. పీకేల్స్ గురించి చాలా మందికి తెలియదు కానీ ఇప్పుడు జరుగుతున్న వాటితో ట్రెండింగ్ లోకి వచ్చేసారు. సోషల్ మీడియాలో వీరిపై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది. ఇన్ ఫ్లూయెన్సర్లు అయిన ఈ ముగ్గురు అక్కా చెల్లెళ్లకు మిలియన్ల కొద్ది వారికి ఫాలోవర్లు ఉన్నారు. అందుకే పచ్చళ్ళ వ్యాపారం మొదలు పెట్టారు. వారి బిజినెస్ బాగా సాగుతున్న సమయంలో కస్టమర్స్ తో బూతులు మాట్లాడి అందరితో వార్తల్లో నిలిచారు. గత కొన్ని రోజులుగా నెట్టింట ట్రోల్స్ వేయించుకుంటున్నారు. అయితే ఈ క్రేజ్ తో బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేశారని ఓ వార్త వినిపిస్తుంది. అయితే తాజాగా ఈ వార్తల ఫై అలేఖ్య సిస్టర్ క్లారిటీ ఇచ్చారు.. ఆమె ఏమి అన్నారో తెలుసుకుందాం..


బిగ్ బాస్ లోకి అలేఖ్య చిట్టి.. 

సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన అలేఖ్య చిట్టి పీకేల్స్ లో ఒకరు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని వార్తలు వినిపించాయి. ఈ పికిల్స్ బిజినెస్ కు మెయిన్ బ్రాండ్ అంబాసిడర్ ఈ అమ్మాయే. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో గ్లామర్ గా కనిపిస్తూ తమ పికిల్స్ ను బాగా సేల్ చేయడంలో హెల్ప్ చేస్తుంది రమ్య. అయితే రేట్ల ఇష్యు తో ఒక్కసారిగా పాపులర్ అయిన ఈ ముగ్గురు సిస్టర్స్ లో రమ్య ను బిగ్ బాస్ నిర్వాహకులు సెలెక్ట్ చేశారని నిన్నటి నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ లోకి రావాలంటే పెద్దగా క్వాలిఫికేషన్ ఏమీ అవసరం లేదు సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయితే చాలు. ఈ లెక్కన అలేఖ్య చిట్టి పికిల్స్ పాపులర్ కాదు దానికి నెక్స్ట్ లెవెల్ వెళ్లిపోయారు. ఇలాంటి సమయంలో వీళ్ళలో ఎవరో ఒకరిని బిగ్ బాస్ హౌస్ కు తీసుకుంటే కావలసినంత పబ్లిసిటీ వస్తుంది అనేది నిర్వాహకుల ఆలోచన అని వార్త చక్కర్లు కొట్టింది. తాజాగా ఈ వార్తలకు అలేఖ్య సిస్టర్స్ లో ఒకరైన సుమ తాజాగా ఈ వార్తలకు క్లారిటీ ఇస్తూ ఒక వీడియోను రిలీజ్ చేసింది.. అందులో ఆమె ఏమి చెప్పిందంటే..


Also Read : దేవుళ్ళ ఫై చిల్లర స్కిట్స్.. కొంచెం కూడా సిగ్గులేదా..?

బిగ్ బాస్ ఛాన్స్ ఫై క్లారిటీ.. 

అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్ లో ఒకరైన సుమ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తన సుమీ టాకీస్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక విషయాలు షేర్ చేసుకుంటుంది. ఈమధ్య పికిల్స్ వివాదంపై ఆమె యూట్యూబ్ ద్వారానే వీడియోలను చేసి క్లారిటీస్ తో వస్తుంది. తాజాగా మరో వీడియోను రిలీజ్ చేసింది.. ఆ వీడియోలో మాట్లాడుతూ అలేఖ్య సిస్టర్స్ లో ఒకరు బిగ్ బాస్ లోకి ఎంటర్ అయిపోతున్నారు,  భారీగా రెమ్యూనరేషన్ తీసుకుపోతున్నారంటూ.. వస్తున్న వార్తల్లో నిజం లేదని కొట్టి పడేశారు. ఆ మధ్య నేను యూట్యూబ్ లో ఒక వీడియోను పోస్ట్ చేశాను. అందులో నేను బిగ్ బాస్ కి వెళ్లాలని కోరిక ఉంది. ఛాన్స్ వస్తే కచ్చితంగా వెళ్తాను అని చెప్పాను దాన్ని పట్టుకొని ఇప్పుడు బిగ్ బాస్ లో ఛాన్స్ వచ్చిందంటూ వార్తలు పుట్టిస్తున్నారు. మాకు బిగ్ బాస్ నుంచి ఎటువంటి ఫోన్లు రాలేదు ఈ వార్తల్లో నిజం లేవు అని సుమా అన్నారు.. అయితే ఈ వీడియో వైర్లు ఇవ్వడంతో నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. బిగ్ బాస్ లో ఛాన్స్ రాలేదని చెప్తున్నట్లు లేదు.. నాకు ఛాన్స్ ఇస్తారా అని ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చినట్లు ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×