Helicopter Crash: వేగంగా వెళ్తున్న హెలికాఫ్టర్ గింగర్లు తిరుగుతూ ఒక్కసారిగా నదిలో కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. స్పెయిన్ లోని సీమెన్స్ కంపెనీ అధ్యక్షుడు, సీఈవో అగస్టిన్ ఎస్కోబార్, ఆయన భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ విషయాన్ని న్యూయార్క్ పోస్టు వెల్లడించింది.
అసలేం జరిగింది?
అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. భారత కాలమాన ప్రకారం.. న్యూయార్క్ సిటిలో హడ్సన్ నదిలో శుక్రవారం ఉదయం ఓ హెలికాప్టర్ కూలింది. ఆరుగురు స్పాట్‌లో మృతి చెందగా, మరో నలుగుర్ని బయటపడ్డారు. బయటపడినవారిని సమీపంలో ఆసుపత్రికి తరలించారు. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే ఎమర్జెన్సీ సర్వీస్ బృందాలు అక్కడికి చేరుకుని సేవలు అందించాయి.
ఘటన సమయంలో హెలికాప్టర్‌ని ఎవరు నడిపారు అనేది ఇంకా తెలియరాలేదు. హెలికాప్టర్ టేకాఫ్ అయిన 15 నిమిషాల్లో నదిలో కూలిపోయింది. ఈ ఘటనలో స్పెయిన్‌లో సీమెన్స్ కంపెనీ అధ్యక్షుడు, సీఈవో అగస్టిన్ ఎస్కోబార్, ఆయన భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. బయటపడిన ఆ నలుగురు ఎవరు అనేది తెలియాల్సివుంది. ఫ్యామిలీతో టూర్‌కు ఆగస్టిన్ అమెరికా వచ్చినట్టు తెలుస్తోంది.
నదిలో హెలికాప్టర్ శకలాలు తేలుతూ కనిపించాయి. పోలీసులు, రెస్క్యూ సిబ్బంది మొహరించారు. ఘటనకు చెందిన ఫోటోలు, వీడియోలు, నెట్టింట్లో చక్కర్లు కొడుకుతున్నాయి. ప్రస్తుత పరిస్థితిని బ్రిడ్జి నుంచి అధికారులు పర్యవేక్షిస్తున్నారు. హెలికాఫ్టర్ ట్రావెల్ చేసినప్పుడు అందులో ఎంతమంది ఉన్నారో తెలీదు.
ALSO READ: కూలిన నైట క్లబ్.. 218 మంది స్పాట్ డెడ్
ముగ్గురు చిన్నారులతోపాటు మరో ఇద్దరు మృతి చెందినట్టు అధికారుల మాట. ఎవరైనా మిగిలి ఉన్నారా? అనే కోణంలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. న్యూయార్క్ హెలికాప్టర్ టూర్స్ నిర్వహిస్తున్న బెల్ 206 డౌన్‌టౌన్ హెలికాప్టర్ ప్యాడ్ నుంచి గురువారం మధ్యాహ్నం 3 గంటలకు బయలు దేరింది. హడ్సన్ నది మీదుగా ఉత్తర వైపు వెళ్లిందని న్యూయార్క్ పోలీసు కమిషనర్ వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సివుంది.
పెరుగుతున్న ప్రమాదాలు
న్యూయార్‌లో జరిగిన ఈ హెలికాప్టర్ ప్రమాదాల్లో ఇది కూడా ఒకటి. కొద్దిరోజుల కిందట వాషింగ్టన్ డీసీ సమీపంలోని రోనాల్డ్ రీగన్ వాషింగ్టన్ ఎయిర్‌పోర్టు నుంచి ఆరుగురు సభ్యులతో వెళ్తున్న ప్యాసింజర్ జెట్‌ను మరో విమానం ఢీ కొట్టిన విషయం తెల్సిందే. 2009లో హడ్సన్ నదిపై విమానం టూరిస్టు హెలికాప్టర్ ను ఢీ కొట్టిన ఘటనలో తొమ్మిది మంది మరణించారు. 2018లో ఈస్ట్ నదిలోకి చార్టర్ హెలికాప్టర్ కూలింది. ఈ ఘటనలో ఐదుగురు చనిపోయారు.
Dear God
The rotor came off this helicopter
There was nothing the pilot could do after that
Maintenance history will be a key part of this investigation
A family was reportedly onboard doing an aerial tour
Just awful 😢
— Phil Holloway ✈️ (@PhilHollowayEsq) April 10, 2025