Rajamouli:సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రానున్న సినిమా SSMB29. సినిమా ఏదైనా హిట్టు కొట్టడం తెలిసిన ఏకైక దర్శకుడు రాజమౌళి. ఏ హీరోతో సినిమా చేసిన ఆ సినిమా హిట్ అవ్వాల్సిందే.. ఆయన మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్1 నుండి RRR వరకు అన్ని బ్లాక్ బాస్టర్ సినిమాలే. ఇప్పుడు మహేష్ తో సినిమా చేస్తూ మరో బ్లాక్ బాస్టర్ ని రెడీ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఒడిశాలో ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తిచేసుకున్నారు. డియోమాలిలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం ఇది. ఇక్కడ కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేయడానికి చిత్ర యూనిట్ వెళ్లినప్పుడు.. అక్కడ అందాలను పొగుడుతూ రాజమౌళి కొన్ని రోజులుగా క్రితం ఎక్స్ వేదికగా ఈ పర్వత ప్రాంతం పై అపరిశుభ్రత ఎక్కువగా ఉందని విచారం వ్యక్తం చేస్తూ ట్విట్ చేశారు. ఇప్పుడు మరలా ఈ ప్రాంతం గురించి రాజమౌళి మరోసారి ట్విట్ చేశారు..
గతంలో రాజమౌళి ట్వీట్ కి స్పందన ఇలా..
రాజమౌళి సినిమా షూటింగ్ కోసం కోరాపుట్ జిల్లాకి వెళ్లగా అక్కడ ఈ శిఖరం ఎంతో అద్భుతంగా ఉందని.. దానిపై నుంచి వ్యూ అందంగా అద్భుతంగా ఉందని.. ఇక్కడ టెక్కిలి చేయడం ద్వారా ఆనందాన్ని పొందామని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అయితే అపరిశుభ్రత ఎక్కువగా ఉందని ఇలా పర్వతంపై ప్లాస్టిక్ వ్యర్ధాలను చూస్తుంటే.. నాకు చాలా బాధ వేసిందని ఆ ట్విట్ లో రాజమౌళి పేర్కొన్నాడు.
అయితే ఎస్ఎస్ రాజమౌళి పిలుపుతో కొందరు డియోమాలి పర్వతంపై ఉన్న ప్లాస్టిక్ వ్యర్ధాలను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు అక్కడి అధికారులు. ఒడిశాకు చెందిన సోసీయో పోలిటికల్ లీడర్ ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా తెలియజేశారు. కోరాపుట్ నుండి వచ్చిన స్నేహితుడి ఫోటోలను మాతో పంచుకున్నారు. జరిగిన ఈ క్లీన్ నెస్ చాలా ప్రశంసనీయం. ఈసారి ఎస్ఎస్ రాజమౌళి లేదా మరి ఎవరైనా సరే ఈ ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఇక్కడ అపరిశుభ్రత కనిపించకుండా శుభ్రంగా ఉంటుందని ఆ లీడర్ పోస్ట్ పెట్టారు.
దర్శక ధీరుడు న్యూ ట్వీట్ ..
ఇలాంటి ప్రయత్నాలు ఫలించడం చూసి, కృతజ్ఞతగా ఉంది. మీరు దీన్ని హైలెట్ చేసినందుకు మీకు ధన్యవాదాలు సార్.. భవిష్యత్తు కోసం, రాబోయే తరాల కోసం, మన సహజ సంపదను కాపాడుకోవటానికి మనం అందరం కృషి చేదాం. అధికారులు ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. ప్రతి అడుగు బాధ్యతాయుత పర్యటన వైపు అడుగు వేయాలని రాజమౌళి తాజాగా పోస్ట్ చేసారు. రాజమౌళి ఒక్క ట్వీట్ తో ఆ ఏరియా అంతా ఇప్పుడు శుభ్రం చెయ్యడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి సమస్య ఎవ్వరికి రాకుండా చేస్తాం అని ట్వీట్ రావడం ప్రశంసనీయం. ఈ పోస్ట్ చూసిన అభిమానులు నువ్వు ఎక్కడ అడుగెడితే అక్కడ సంచలనమే స్వామి అని కామెంట్ చేస్తున్నారు.
Grateful to see efforts like these taking shape…🙏
Thank you sir for highlighting this. Let’s keep working to protect our natural treasures for the future. The authorities should take necessary steps to keep it clean, and every step towards responsible tourism counts! https://t.co/NEGUz9u7b8
— rajamouli ss (@ssrajamouli) April 10, 2025