Arjun Kalyan: అర్జున్ కళ్యాణ్ (Arjun Kalyan)పరిచయం అవసరం లేని పేరు. బిగ్ బాస్ సీజన్ 6(Bigg Boss Season 6) కంటెస్టెంట్ గా అందరికీ ఎంతో సుపరిచితమైన అర్జున్ కళ్యాణ్ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. చిన్నప్పటినుంచి సినిమాలంటే ఎంతో ఆసక్తి ఉన్న ఈయన యాక్టింగ్, స్క్రీన్ ప్లే రైటింగ్ లో న్యూయార్క్ హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి డిప్లొమా పూర్తీ చేశాడు. 2013లో ‘చిన్న సినిమా’ అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయ్యారు. ఈ సినిమా అనంతరం లవర్ ఫరెవర్, సూడోసైడ్, ఉప్మా తినేసింది, అన్ స్పోకెన్, పరిచయం, మిస్సమ్మ వంటి వెబ్ సిరీస్‌లతో మంచి సక్సెస్ అందుకున్నారు.
బిగ్ బాస్ 6 కంటెస్టెంట్ గా అర్జున్…
ఈ విధంగా ఇండస్ట్రీలో సినిమాలు, వెబ్ సిరీస్లలో నటిస్తూ బిజీగా ఉన్న ఇతనికి బిగ్ బాస్ అవకాశం వచ్చింది. ఇక బిగ్ బాస్ కార్యక్రమంలో కూడా తన ఆట తీరుతో అందరిని మెప్పించారు. ఇక ప్రస్తుతం అర్జున్ కళ్యాణ్ స్టార్ మా లో ప్రసారమవుతున్న” నువ్వుంటే నా జతగా”అనే సీరియల్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నా అర్జున్ కళ్యాణ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తనకు ఎవరైనా చేదు సంఘటన గురించి తెలియజేశారు.
బడా ప్రొడక్షన్ హౌస్ పేరు…
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో అమ్మాయిలకు కమిట్మెంట్స్ వేధింపులు ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే. అయితే అర్జున్ కళ్యాణ్ కి కూడా ఒక హీరోయిన్ నుంచి ఇలాంటి కమిట్మెంట్స్ వేధింపులు వచ్చాయి అంటూ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇంస్టాగ్రామ్ ద్వారా ఒక హీరోయిన్ తనకు వరుసగా మెసేజ్ లు చేసినట్టు ఈయన తెలిపారు. నాకు ఫలానా దర్శకుడు తెలుసు, పలానా వాళ్లు తెలుసు అంటూ వారికి సంబంధించిన కొన్ని స్క్రీన్ షాట్లను కూడా పంపించారని, అలాగే ఒక బడా ప్రొడక్షన్ హౌస్ పేరుకూడా చెప్పినట్లు అర్జున్ కళ్యాణ్ ఈ సందర్భంగా తెలిపారు. అయితే ఆమె చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే ఏ ప్రొడక్షన్ హౌస్ పేరైతే చెప్పిందో అప్పటికే నేను ఆ ప్రొడ్యూసర్ గారిని అవకాశాల కోసం కాంటాక్ట్ అయ్యానని ఈయన వెల్లడించారు.
క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు…
ఈ విధంగా ఇంస్టాగ్రామ్ ద్వారా తాను కూడా కమిట్మెంట్స్(commitment) ఇబ్బందులను ఎదుర్కొన్నానని నా విషయంలో రెండు సార్లు ఇలా జరిగింది అంటూ అర్జున్ కళ్యాణ్ చేసిన ఈ కామెంట్స్ సంచలనంగా మారాయి. ఒకప్పుడు కేవలం అమ్మాయిలకు మాత్రమే ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఉండేవి కానీ ఇటీవల కాలంలో అమ్మాయిలే ఏకంగా అబ్బాయిలను కమిట్మెంట్స్ అడుగుతున్నటువంటి సంఘటనలు బయటకు వస్తున్నాయి. ఇదివరకే ఎంతోమంది అబ్బాయిలు కూడా తాము క్యాస్టింగ్ కౌచ్(Casting Couch) ఇబ్బందులు ఎదుర్కొన్నాము అంటూ తెలియచేసిన సంగతి తెలిసిందే. తాజాగా అర్జున్ కళ్యాణ్ కూడా ఈ ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు తెలియజేయడంతో ఇది కాస్త సంచలనగా మారింది. అయితే ఆమె ఎవరు? ఆ ప్రొడక్షన్ హౌస్ ఏది? డైరెక్టర్ ఎవరు? అనే విషయాలను అర్జున్ కళ్యాణ్ బయట పెట్టలేదు.
Also Read: Anurag Kashyap: సెన్సార్ బోర్డుపై అనురాగ్ అసహనం… డిక్షనరీ తీసుకెళ్లా అంటూ?