BigTV English

Devara Movie Overall collections: దేవర మొత్తం కలెక్షన్స్.. లాభమా..? నష్టమా..?

Devara Movie Overall collections: దేవర మొత్తం కలెక్షన్స్.. లాభమా..? నష్టమా..?

Devara Movie Overall collections: దిగ్గజ దర్శకుడు రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో ఎన్టీఆర్ (NTR), రామ్ చరణ్ (Ram Charan) తో కలిసి నటించిన చిత్రం ఆర్. ఆర్. ఆర్. (RRR ) భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఏకంగా ఆస్కార్ అవార్డులను సైతం దక్కించుకుంది. ఈ సినిమాతో రాజమౌళి తోపాటు ఎన్టీఆర్ , రామ్ చరణ్ కి కూడా గ్లోబల్ స్థాయి లభించింది. ఇకపోతే సోలో హీరోగా ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర (Devara ). ఆచార్య (Acharya) సినిమాతో డిజాస్టర్ మూటగట్టుకుని విమర్శల పాలైన కొరటాల శివ (Koratala shiva) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది.


ముగిసిన దేవర థియేట్రికల్ రన్..

ఇదిలా ఉండగా దీపావళికి దాదాపు అరడజనుకు పైగా కొత్త సినిమాలు విడుదల కావడంతో దేవర థియేట్రికల్ రన్ దాదాపు ముగిసినట్లే అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.కొత్త సినిమాల కారణంగా థియేటర్ల సంఖ్య తగ్గిపోవడంతోనే ఈ విషయాన్ని వారు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే సెప్టెంబర్ 27వ తేదీన భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా 34 రోజులపాటు థియేటర్లలో దిగ్విజయంగా రన్ అయ్యి అటు ఆడియన్స్ ను ఇటు నిర్మాతలను సంతోషపరిచింది. మరి ఈ సినిమా ఇప్పుడు ఎన్ని కోట్లు రాబట్టింది ..? అసలు మేకర్స్ కి ఎన్ని కోట్లు లాభం మిగిలింది..? అసలు లాభం వచ్చిందా? లేక నష్టమా? అనే విషయాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.


రూ.400 కోట్ల బడ్జెట్ తో దేవర..

కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా నటించిన చిత్రం ఇది. అంతేకాదు జాన్వీ కపూర్ తొలిసారి ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. సాంకేతిక నిపుణులు నటీనటుల రెమ్యునరేషన్ ప్రమోషన్స్ తో పాటు ఇతర ఖర్చులు కలుపుకొని మొత్తం రూ.400 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాను నిర్మించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ , యువ సుధా ఆర్ట్స్ బ్యానర్లపై నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా తెరకెక్కించగా సైఫ్ అలీ ఖాన్, ప్రకాష్ రాజ్ , మురళీ శర్మ, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

ఫుల్ రన్ ముగిసేసరికి..

34 రోజుల ఫుల్ రన్ ముగిసేసరికి.. ఈ సినిమా ఏ రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టింది అనే విషయానికి వస్తే..అంచనాలకు తగ్గట్టుగానే ప్రీ రిలీజ్ బిజినెస్ ఒక రేంజ్ లో జరుపుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో రూ.112.55 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ.182.55 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. దీంతో రూ.200 కోట్ల షేర్ రూ.400 కోట్ల గ్రాస్ వసూళ్లను బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా విలువ కట్టారు.

థియేట్రికల్ లెక్కల విషయానికి వస్తే..

నైజాం – రూ.62.82 కోట్లు

సీడెడ్ – రూ.31.71 కోట్లు

ఉత్తరాంధ్ర – రూ.18.50 కోట్లు

ఈస్ట్ గోదావరి – రూ.10.69 కోట్లు

వెస్ట్ గోదావరి – రూ.8.42 కోట్లు

గుంటూరు రూ.13.65 కోట్లు

కృష్ణ – రూ.9.32 కోట్లు

నెల్లూరు – రూ.6.97 కోట్లు

ఇలా మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాలలో.. రూ.162.08 కోట్ల షేర్, రూ.236.35 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. తమిళనాడు రూ.4.16 కోట్లు కేరళ రూ.97 లక్షలు హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా రూ.34.53 కోట్లు ఓవర్సీస్ లో రూ.36.11కోట్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా 256.05 కోట్ల షేర్ , రూ.447.45 కోట్ల గ్రాస్ రాబట్టింది ఈ సినిమా. ఇక మొత్తంగా చూసుకుంటే రూ.72 కోట్లకు పైగా లాభాలను అందించి బ్లాక్ బాస్టర్ గా నిలిచింది.

Tags

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×