BB Telugu 8 Promo :తాజాగా బిగ్ బాస్ సీజన్ 8 లో భాగంగా 12 వ వారం ముగిసిపోయింది. ఇక స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకున్న యష్మీ గౌడ ఎలిమినేట్ అయింది. ఓట్లు తక్కువ రావడంతో ఆమె ఎలిమినేట్ అయినట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించారు. ఇక మరొకవైపు ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తి కావడంతో 13వ వారం నామినేషన్స్ లో ఎవరు ఉండబోతున్నారు అనే విషయం ఉత్కంఠ గా మారింది. 12వ వారం నామినేషన్స్ లో భాగంగా యష్మీ , పృథ్వీ, నిఖిల్ , ప్రేరణ తో పాటు నబీల్ కూడా నామినేషన్స్లోకి వచ్చారు. ఇక చివరిగా యష్మీ , పృథ్వీ మిగలగా ఈ ఇద్దరిలో యష్మీ ఎలిమినేట్ అయింది.
ఇకపోతే తాజాగా 13వ వారానికి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు. ఈ ప్రోమోలో నామినేషన్ రచ్చ రసవత్తరంగా సాగింది. ఎవరైతే ఫైనలిస్టులుగా ఉండకూడదని అనుకుంటున్నారో.. వారిపై రంగు పోసి నామినేట్ చేయాలని తెలిపారు బిగ్ బాస్. ఇక ఒక్కో కంటెస్టెంట్ ఇద్దరు ఇంటి సభ్యులను నామినేట్ చేయవచ్చని, మెగా చీఫ్ అయినందువల్ల రోహిణిను ఎవరు నామినేట్ చేయకూడదు అని కూడా తెలిపారు. ఇక నామినేషన్స్ సందర్భంగా గౌతమ్ – నబీల్, అవినాష్ – పృథ్వీ మధ్య వాడి వేడి ఆర్గ్యుమెంట్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇకపోతే మరొకసారి తనను నామినేట్ చేయడంతో అవినాష్ తొడగొట్టడం ఇక్కడ హాట్ టాపిక్ గా మారింది.
కావాలని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు పృథ్వీ అన్నట్టుగా తెలుస్తోంది. నబీల్ కష్టపడి సంపాదించుకున్న ఎవిక్షన్ ఫ్రీ పాస్ ను నీకోసం ఉపయోగించాడు కాబట్టే నువ్వు ఇంకా హౌస్ లో ఉన్నావు అంటూ రెచ్చగొట్టేలా మాట్లాడాడు పృథ్వి. దీంతో అవినాష్ ఫైర్ అవుతూ నేను కావాలని అడిగానా.. నబీల్ నిన్ను అడిగానా అంటూ అడిగాడు అవినాష్ . దీంతో అడగలేదని తలూపాడు నబీల్. ఆ తర్వాత తొడకొట్టి మరీ నేనేంటో నిరూపిస్తానని తెలిపాడు అవినాష్. ఇలా ఇద్దరి మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి. మరొకవైపు గౌతమ్ – నబీల్ మధ్య గొడవలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఫైర్ నాలో ఉందంటే నాలో ఉందంటూ కామెంట్లు చేయడం కొంతమంది అభిమానులకు నచ్చలేదని చెప్పవచ్చు.
ఇకపోతే మొత్తానికైతే ఈ వారం నామినేషన్ రచ్చ చాలా రసవత్తరంగా సాగనుంది అని, ఇక సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం 13వ వారం ఏడుగురు నామినేట్ అయినట్లు తెలుస్తోంది. నామినేట్ అయిన వారిలో నిఖిల్, పృథ్వి, ప్రేరణ, అవినాష్, విష్ణు ప్రియ టేస్టీ తేజ , గౌతమ్ ఉన్నట్లు సమాచారం. మరి వీరంతా నిజంగానే నామినేషన్స్ లోకి వచ్చారా? అనే విషయం తెలియాలి అంటే నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎదురు చూడాల్సిందే. ఇక ప్రస్తుతం రోహిణి నామినేషన్స్ నుంచి ఈవారం తప్పించుకుంది. మెగా చీఫ్ గా మారి తన కలను నెరవేర్చుకుంది.ఇకపోతే ఎనిమిదవ సీజన్ కూడా పూర్తి కావడానికి కేవలం రెండు మూడు వారాలు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో కంటెస్టెంట్స్ కూడా గట్టిగానే పోటీ పడుతున్నారు.