Kushitha Kallapu: సోషల్ మీడియా ద్వారా ఎంతో గుర్తింపు సంపాదించుకొని సినిమా అవకాశాలు అందుకుంటూ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ గా మారిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిలో నటి కుషిత కల్లపు(Kushitha Kallapu) కూడా ఒకరు. మోడల్ గా కెరియర్ ప్రారంభించిన ఈమె అనంతరం ఇంస్టాగ్రామ్, టిక్ టాక్ ద్వారా ఎంతో ఫేమస్ అయ్యారు. బజ్జీ పాపగా సోషల్ మీడియాలో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ఇప్పటికే పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను సందడి చేశారు. ఇక సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉండే కుషిత తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.
లిప్ లాక్ సీన్లు చెయ్యను..
తాజాగా కుషితకు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అయితే ఈ వీడియోలో భాగంగా ఈమె లిప్ కిస్ (Lip kiss) సన్నివేశాల గురించి బోల్డ్ సీన్స్(Bold Scenes) గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈమెకు బోల్డ్ సీన్స్, లిప్ లాక్ సన్నివేశాల గురించి ప్రశ్నలకు ఎదురు కావడంతో తాను లిప్ లాక్ సన్నివేశాలలో అస్సలు నటించనని తెలిపారు. నేను ఇలా నటించడం మా కుటుంబ సభ్యులకు ఇష్టం లేదని తెలిపారు. మా కుటుంబ సభ్యులకి ఇష్టం లేదంటే నాకిష్టమని కాదు, నాకు కూడా అలాంటి సీన్స్ చేయడం ఏమాత్రం ఇష్టం ఉండదని క్లారిటీ ఇచ్చారు.
మొదటి ముద్దు నా భర్తకే…
నేను ఈరోజు కాకపోయినా మరి కొద్ది రోజుల కైనా ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది అందుకే ఇలాంటి సన్నివేశాలలో నటించనని తెలియజేశారు. ఇక నేను ముద్దు పెడితే మొదటి ముద్దు నా భర్తకే (Future Husband)పెడతాను అంటూ ఈ సందర్భంగా కుషిత చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. నా మొదటి ముద్దు నా మొగుడికే అనుకుంటిని అంటూ పుష్ప సినిమాలో రష్మిక చెప్పిన డైలాగును ఇమిటేట్ చేస్తూ ఈమె చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఇలా సోషల్ మీడియా ద్వారా ఎంతో ఫేమస్ అయిన కుషిత వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె మాత్రం తన సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నారు.
వెండితెర హిట్ కోసం తాపత్రయం..
ఇకపోతే ఇటీవల మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన గుంటూరు కారం(Gunturu Kaaram) సినిమాలో కూడా తాను నటించానని అయితే కొన్ని కారణాల వల్ల తాను నటించిన సీన్స్ అన్నీ కూడా డిలీట్ చేశారు అంటూ ఈమె ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు. ఈ సినిమా తర్వాత కుషిత పెద్దగా సినిమా అవకాశాలను అందుకోలేదని తెలుస్తోంది. ఇటీవల వెండితెరకు దూరంగా ఉంటున్న ఈమెకు సోషల్ మీడియాలో మాత్రం విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి. ఇలా సోషల్ మీడియాలో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న కుషిత వెండితెరపై కూడా సక్సెస్ కోసం ఎంతో కష్టపడుతున్న సరైన హిట్ మాత్రం అందుకోలేకపోతున్నారు.
Also Read: Sri Devi : సాధ్యం కాని కోరిక బయట పెట్టిన కోర్టు బ్యూటీ.. ఆశకు హద్దు ఉండాలి అంటూ..