BigTV English

Devara Bookings : థియేటర్స్ అర్థరాత్రి నుంచే ఓపెన్… దేవర ఫ్యాన్స్ రెడీగా ఉండండమ్మా..!

Devara Bookings : థియేటర్స్ అర్థరాత్రి నుంచే ఓపెన్… దేవర ఫ్యాన్స్ రెడీగా ఉండండమ్మా..!

Devara..యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR ) ఆర్.ఆర్.ఆర్ సినిమా తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం దేవర (Devara). మిర్చి, జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బాస్టర్ హిట్స్ తర్వాత ఆచార్య సినిమాతో ఘోర పరాభవాన్ని చూసిన ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Shiva) ఎలాగైనా సరే ఈ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకోవాలనే కసితో ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, పాటలకు మంచి రెస్పాన్స్ లభిస్తున్న విషయం తెలిసిందే. అంతే కాదు ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు యూట్యూబ్లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి.


అర్ధరాత్రి నుంచే థియేటర్స్ ఓపెన్..

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక బిగ్ అప్డేట్ అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ 27వ తేదీన అర్ధరాత్రి 1:00 గంట నుంచే సినిమా షో ప్రారంభం కానుంది అని సమాచారం. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అర్ధరాత్రి నుంచే సినిమా షో పడగా, మల్టీప్లెక్స్ థియేటర్, సింగిల్ థియేటర్ కలిగిన థియేటర్లలో తెల్లవారుజామున 4:00 గంటల నుండి షో పడనుంది అని సమాచారం. రోజుకి 6 షోలు.. దీన్ని బట్టి చూస్తే దేవర కి డిమాండ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.


Devara Bookings : Theaters are open from late night... Devara fans should be ready..!
Devara Bookings : Theaters are open from late night… Devara fans should be ready..!

దేవర కోసం భారీ తారాగణం..

ఇకపోతే దేవర చిత్రం విషయానికి వస్తే.. తొలిసారి బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi kapoor) ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన జాన్వీ లుక్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. పల్లెటూరి అమ్మాయిగా ఆడియన్స్ ను అలరించడానికి ఈమె సిద్ధమవుతోందని చెప్పవచ్చు. ఇకపోతే ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు. ఇదివరకే ప్రభాస్ హీరోగా నటించిన ఆది పురుష్ సినిమాలో సైఫ్ అలీఖాన్ విలన్ గా నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది. మరి దేవర సినిమా ఈయనకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

ఎన్టీఆర్ కెరియర్..

ఎన్టీఆర్ స్వర్గీయ నందమూరి తారకరామారావు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. సింహాద్రి, ఆది, స్టూడెంట్ నెంబర్ వన్ ఇలా పలు చిత్రాలతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. ముఖ్యంగా సింహాద్రి, యమదొంగ లాంటి చిత్రాలను రాజమౌళి దర్శకత్వంలో చేసి మంచి విజయాన్ని అందుకున్న ఎన్టీఆర్ మళ్లీ ఆర్. ఆర్.ఆర్ చిత్రంతో ఏకంగా గ్లోబల్ స్థాయి ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ఒకవైపు సినిమాలు మరొకవైపు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పుడు దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఎన్టీఆర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×