BigTV English

Bigg Boss 8 Telugu : నిఖిల్ బాగోతాన్ని బయటపెడుతూ ఊహించని ట్విస్ట్ ఇచ్చిన సోనియా.. రెచ్చిపోయిన యష్మీ..

Bigg Boss 8 Telugu : నిఖిల్ బాగోతాన్ని బయటపెడుతూ ఊహించని ట్విస్ట్ ఇచ్చిన సోనియా.. రెచ్చిపోయిన యష్మీ..

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 11 వ వారం నామినేషన్స్ ఆసక్తికరంగా మారింది. ఈ వారం ఎవరు హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారా అని ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూసారు. అయితే ఎలిమినేషన్ ఏమో కానీ ఈ వారం ఆడియన్స్ అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది.. పాత వాళ్ళను మరోసారి హౌస్ లోకి తీసుకొని వచ్చి ఫుల్ స్టఫ్ ఇచ్చారు.. హౌస్ లోకి వచ్చిన సోనియా ఆకుల నిఖిల్ కు ట్విస్ట్ ల మీద ట్విస్ట్లు ఇచ్చింది. గెలుపు ముంగిట నిఖిల్‌కి కోలుకోలేని దెబ్బ అంటే ఇదే. ఆడదానితో పెట్టుకుంటే రాజ్యాలే కూలిపోయాయి. ఇక బిగ్ బాస్ టైటిల్ ఓ లెక్కా. అటు నిఖిల్‌ని ప్రేమించి మోసపోయిన ప్రియురాలు కావ్య శ్రీ ఒకవైపు. ఇటు బిగ్ బాస్ హౌస్‌లో నిఖిల్‌తో క్లోజ్‌గా ఉండి.. దారుణంగా ట్రోల్ అయిన సోనియా ఆకుల మరోవైపు అతనికి వరుస షాకులు ఇచ్చారు. అసలు నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..


మొన్న హౌస్ లో నిఖిల్ కావ్య గురించి సంచలన విషయాలను బయట పెట్టాడు. తన లవ్ స్టోరీ విని అందరు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక బయట కూడా కావ్య వరుస పోస్టులు పెడుతూ షాకిస్తుంది. ఆమె పెట్టిన ప్రతి పోస్ట్ నిఖిల్ పై కోపంతోనే అని తెలుస్తుంది. సోనియా ఆకుల కూడా అదే విషయానికి రిలేటెడ్‌గా ఉంది. ఇద్దరూ కూడా.. నిఖిల్ నమ్మించి మోసం చేయడం గురించి, అతని అసలు బాగోతం గురించి ప్రేమ పేరుతో చేసిన మోసం గురించే ఉండటంతో.. టైం చూసి గట్టిగానే కొట్టినట్టుగా అనిపిస్తుంది.. తాజాగా 12 వ వారం హౌస్ లోకి వచ్చిన సోనియా నిఖిల్ ను నామినేట్ చేసింది.

ఈ వారం హౌస్ లోకి ఎలిమినేట్ అయిన ప్రతి ఒక్కరు మళ్లీ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ క్రమంలో 12 వ వారం నామినేషన్స్ లో సీసా థిమ్ ను బిగ్ బాస్ పెట్టినట్లు తెలుస్తుంది. హౌస్ నుంచి ఎలిమినేట్ కంటెస్టెంట్స్ ఒక్కొక్కరుగా హౌస్‌లోకి అడుగుపెట్టి.. ఒక్కొక్కరు ఇద్దరిద్దరి తలపై బాటిల్‌ని పగలకొట్టి నామినేట్ చేయాలి. ఈ నామినేషన్ ప్రక్రియను మొదటిగా శేఖర్ బాషాతో ప్రారంభించారు. ఆ తరువాత సోనియా నిఖిల్ ను నామినేట్ చేసింది . తలపై బాటిల్ పగలకొట్టింది. అంతేకాదు కౌంటర్ ఇచ్చింది. మధ్యలో యష్మీ కలుగ చేసుకోవడంతో ఈ గొడవ రచ్చగా మారింది. మొత్తానికి ఈ వారం హౌస్ లో రచ్చ మాములుగా ఉండదు అని తెలుస్తుంది.. నిఖిల్ ఫుల్ బ్యాడ్ అవుతోంది. సరిగ్గా విన్నర్‌ డిసైడ్ అయ్యే వీక్స్‌లో నిఖిల్ బాగోతాలు ఒక్కక్కటిగా బయటపడటం అతనికి ప్రతికూలంగా మారుతోంది.. ఇక ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి.. ఇక బిగ్ బాస్ లో నాలుగు వారాలే ఉండటంతో విన్నర్ ఎవరు అనేది డిసైడ్ చేస్తున్నారు.  మరి ఎవరు విన్నర్ అవుతారో తెలియాలంటే కొద్ది వారాలు వెయిట్ చెయ్యాల్సిందే..


Tags

Related News

Bigg Boss 9 Telugu: డబుల్ హౌస్.. డబుల్ డోస్..బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్

Monal Gajjar : బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గుర్తుందా.? ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Big Stories

×