Heart touching best romantic movies : ఓటిటిలో ఎన్నో సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటిలో ఎవర్ గ్రీన్ సినిమాలు కొన్ని మాత్రమే ఉంటాయి. హృదయాన్ని హత్తుకునే సినిమాలను మూవీ లవర్స్ ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. ప్రతి సినిమాలో ఒక్కొక్క కథ ఒకలా ఉంటుంది. ప్రేమ కాన్సెప్ట్ తో ఎన్ని సినిమాలు వచ్చినా కొత్తగానే ఉంటాయి. ప్రస్తుతం ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న బెస్ట్ రొమాంటిక్ మూవీస్ గురించి తెలుసుకుందాం.
96 (ninety six)
విజయ్ సేతుపతి, త్రిష హీరో హీరోయిన్లు గా నటించిన ఈ మూవీకి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించారు. హై స్కూల్లో చదువుకునేటప్పుడు హీరో లవ్ లో పడతాడు. ఆ అమ్మాయికి మాత్రం ప్రేమించిన విషయం చెప్పకుండా తనలోనే దాచుకుంటాడు. అప్పుడు విడిపోయిన వీళ్లు 20 సంవత్సరాల తర్వాత మళ్లీ కలుస్తారు. ఆ సమయంలో హీరో ఆమెను చూసి ఎంతగా ఫీల్ అవుతాడో మాటల్లో వర్ణించలేనిది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి నటించాడు అనేకంటే, జీవించాడు అని చెప్పడమే ఉత్తమం. ఈ మూవీ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది. లవ్ బర్డ్స్ ఈ మూవీపై ఓ లుక్ వేయండి.
ఫిదా (Fidaa)
సాయి పల్లవి, వరున్ హీరో హీరోయిన్లు నటించిన ఈ మూవీకి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించాడు. డాక్టర్ అయిన వరున్ పల్లెటూరి అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వచ్చి ,ఆమె ప్రేమలో మునిగిపోతాడు. కొన్ని కారణాలవల్ల వారి ప్రేమకు తాత్కాలిక బ్రేకులు పడతాయి. ఆ తర్వాత ఒకరి కోసం ఒకరు నిరీక్షించడం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతుంది.
మజిలీ (Majili)
నాగచైతన్య , సమంత జంటగా నటించిన ఈ మూవీకి శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఒక బెస్ట్ ఫీల్ గుడ్ మూవీ గా చెప్పుకోవచ్చు. క్రికెటర్ గా ఫెయిల్యూర్ అయిన హీరో ను హీరోయిన్ ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. వీరిద్దరి రిలేషన్ చూస్తే ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందో తెలుస్తుంది. ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (Disney + Hotstar) లో స్ట్రీమింగ్ అవుతోంది.
నిన్ను కోరి (ninnu kori)
నాని, నివేద థామస్ జంటగా నటించిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ప్రేమకు నిర్వచనం చెప్తుంది. ఒక ఫీల్ గుడ్ మూవీ గా చెప్పుకోవచ్చు. హీరో తన ప్రేమతో అమ్మాయి మనసును ఎలా గెలుచుకున్నాడో ఈ చిత్రం చెప్తుంది. ఈ సినిమాని మిస్ చేయకుండా చూడండి.
ఉప్పెన (uppena)
వైష్ణవ తేజ్, కృతి సనన్, విజయ్ సేతుపతి నటించిన ఈ సినిమా (Netflix ) లో స్ట్రీమింగ్ అవుతుంది. ఒక మత్స్యకారుడు గ్రామ పెద్ద అయినటువంటి పెద్దమనిషి తో కూతుర్ని ప్రేమిస్తే ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటాడు మూవీలో చూడొచ్చు. ఈ మూవీ థియేటర్లలో సంచలనం సృష్టించింది. ప్రేమకు ఏమి కావాలో చెప్పే ఒక లెజెండ్ స్టోరీ. ఈ మూవీని మాత్రం మిస్ చేయకుండా చూడండి.