BigTV English

Bigg Boss 8 Day 27 promo 1: హీరో – జీరో.. ఏ మిస్ అంటూ పరువు తీసిన నాగ్..!

Bigg Boss 8 Day 27 promo 1: హీరో – జీరో.. ఏ మిస్ అంటూ పరువు తీసిన నాగ్..!

Bigg Boss 8 Day 27 Promo 1.. బిగ్ బాస్ సీజన్ 8. (bigg Boss 8) నాలుగవ వారం చివరి దశకు చేరుకుంది. ముఖ్యంగా నామినేషన్ లో ఆరుగురు ఉండగా.. ఆరుగురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ అటు కంటెస్టెంట్స్ లో ఇటు ఆడియన్స్ లో కూడా రేకెత్తుతోంది. ముఖ్యంగా లీస్ట్ ఓటింగ్లో పృథ్వీ రాజ్, ఆదిత్య ఓం నిలవగా వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆడవారు బలవుతారు అన్న నేపథ్యంలో సోనియా పేరు కూడా వినిపిస్తోంది. మరి వీరి ముగ్గురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియాలి అంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే.


హీరో – జీరో అంటూ కొత్త గేమ్..

ఇదిలా ఉండగా వీకెండ్స్ లో భాగంగా మళ్ళీ కంటెస్టెంట్స్ ను అలరించడానికి నాగార్జున వచ్చేశారు. తప్పొప్పులను సరిదిద్దుతూ.. తప్పు చేసిన వారికి క్లాస్ పీకుతూ మరొకసారి వారిని సరి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఛాలెంజ్ లో నిఖిల్ చేసిన పనికి మిస్ అయ్యావా? ఏ మిస్ వల్ల ఇలా చేశావు? అంటూ ఫైర్ అయ్యారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.


హీరోలుగా నిలిచిన నబీల్, సీత..

తాజాగా శనివారం ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు మేకర్స్. అందులో ఈవారం బాగా పర్ఫామెన్స్ చేసినవారికి క్రౌన్, అసలు పర్ఫార్మ్ చేయని వారికి జీరో ఇచ్చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. ప్రోమోలో భాగంగా నాగార్జున ఇప్పుడు మనం ఆడబోయే ఆట పేరు హీరో జీరో. హౌస్ లో హీరో ఎవరో ..వారికి క్రౌన్ పెట్టమని నాగార్జున సూచించగా.. మణికంఠ సీత మరియు నబీల్ న్ కి క్రౌన్ ఇచ్చారు. కరెక్ట్ గా పెట్టావ్ వీరిద్దరే ఈ వీక్ హీరోలు అంటూ తన మనసులో మాట చెప్పారు. ఆ తరువాత ఎవరు జీరో వారి ఫేస్ పై క్రాస్ మార్క్ వేయమని చెప్పాడు. అయితే హౌస్ లో చాలామంది మణికంఠ అబద్ధం అంటూ అతడి ఫేస్ పై క్రాస్ వేసేశారు.

సోనియాను ఇండైరెక్టుగా టార్గెట్ చేసిన నాగార్జున..

ఆ తర్వాత ప్రేరణ నిఖిల్ ముఖం పై క్రాస్ వేసి జీరో అంటూ.. నబీల్ విషయంలో నిఖిల్ చేసిన తప్పును ధైర్యంగా చెప్పింది. ఈ విషయంలో ప్రేరణకు సపోర్ట్ గా నిలిచారు నాగార్జున. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఛాలెంజ్ లో బిగ్ బాస్ కాంతారా క్లాన్ నుంచి ఒక సభ్యుడిని తొలగించాలంటూ కోరగా.. ఆ క్లాన్లో అత్యంత శక్తివంతమైన టాలెంటైన వ్యక్తి నబీల్ ను తొలగించి తప్పు చేశాడు నిఖిల్. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ నాగార్జున నిఖిల్ పై ఫైర్ అవ్వగా మిస్ ఫైర్ అయ్యింది అంటూ నిఖిల్ చెప్పాడు. మిస్ అయ్యిందా లేక ఏ మిస్ వల్ల తప్పు చేసావా అంటూ కామెంట్లు చేయగా, సోనియా వల్లే ఇదంతా అంటూ ఇన్ డైరెక్ట్ గా ఇచ్చి పడేశారు నాగార్జున.

Related News

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Mallika Sherawat: బిగ్ బాస్‌లోకి హాట్ బ్యూటి మల్లికా షెరావత్.. అబ్బాయిలు ఇక టీవీ వదలరేమో!

Big Stories

×