BigTV English

Satyam Sundaram Collections: తిరుపతి లడ్డు వివాదమే సినిమాకు ప్లస్ .. మూడు రోజులకు ఎంత రాబట్టిందంటే?

Satyam Sundaram Collections: తిరుపతి లడ్డు వివాదమే సినిమాకు ప్లస్ .. మూడు రోజులకు ఎంత రాబట్టిందంటే?

Satyam Sundaram Collections:  తమిళ స్టార్ హీరో కార్తీకి పరిచయాలు అవసరం లేదు. ఆవారా లాంటి క్లాసికల్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. నాగార్జునతో ఊపిరి సినిమాలో స్క్రీన్ చేసుకొని అందరి మనసు దోచుకున్నాడు కార్తీ.. అతను తమిళ్లో చేసిన ప్రతి సినిమా తెలుగులో డబ్ అయిన సంగతి తెలిసిందే.. అయితే కార్తీ రీసెంట్ గా సత్యం సుందరం అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. స్టార్ హీరో అరవింద స్వామితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఎమోషనల్ డ్రామా, యాక్షన్ కథతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ను అందుకుంది. అలాగే భారీ కలెక్షన్స్ ను కూడా రాబడుతుందని తెలుస్తుంది. ఇక రెండు రోజులకు ఈ మూవీ ఎంత రాబట్టిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..


తెలుగులో దేవర హవా కొనసాగుతుంది. అలాంటి సమయంలో ఇలాంటి సినిమా అంటే కష్టం అని అందరు అనుకున్నారు. ఆ మాటలను కొట్టిపడేస్తూ అదిరిపోయే రికార్డులను సొంతం చేసుకుంది ఈ సత్యం సుందరం మూవీ. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తిరుపతి లడ్డు మీద అనుకోకుండా ఫన్ యాంగిల్ లో కార్తీ మాట్లాడడం, దానిపై ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో తప్పుబట్టి కార్తీని మందలించడంతో ఈ సినిమా వివాదాల నడుమ రిలీజ్ అయ్యి అందరి మనసు దోచుకుంది. ఒకరకంగా చెప్పాలంటే తిరుపతి లడ్డు ఇతనికి ఇంత క్రేజ్ ను అందించిందని చెప్పాలి. ఇక మొదటి నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటూ వస్తుంది.

ఇక కలెక్షన్స్ విషయానికొస్తే..సత్యం సుందరం మూవీ ఇండియాలో 1000 స్క్రీన్లు, ఓవర్సీస్‌లో 500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా 40 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలు పెట్టింది.. మూడు రోజులకు తమిళ్, తెలుగులో ఎంత వసూల్ చేసిందంటే.. తమిళ్ లో తొలి రోజు 3 కోట్ల రూపాయలు, రెండో రోజు 5 కోట్ల రూపాయలు రాబట్టింది. గత రెండు రోజుల్లో ఈ సినిమా తమిళంలో 8 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మూడో రోజు మరో మూడు కోట్లు రాబట్టిందని చెప్పాలి. ఇక తెలుగులో.. ఫస్ట్ డే 40 లక్షలు, సెకండ్ డే 40 లక్షలు వసూలు చేసింది. మూడో రోజు కూడా 40 లక్షలు వసూల్ చేసిందని టాక్.. దాంతో ఈ సినిమా తెలుగులో కోటికి పైగా కలెక్షన్స్ ను అందుకుంది. నికరంగా, 1.6 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. మొత్తంగా చూసుకుంటే 13 కోట్లకు పైగా వసూల్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.. ఈ కలెక్షన్స్ గురించి అధికారక ప్రకటన రావాల్సి ఉంది.. ఏది ఏమైనా కార్తీక అకౌంట్ లో భారీ హిట్ పడిందని చెప్పాలి.. మొత్తానికి చూసుకుంటే కార్తీకి తిరుపతి లడ్డు వివాదం బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి.. ఇక ఈ వారం కూడా సత్యం సుందరం సినిమాకు ప్లస్ అయ్యేలా కనిపిస్తుంది. ఈ సినిమాకు ఇంకా కలెక్షన్స్ పెరిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం..


Related News

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

Big Stories

×