BigTV English

Bigg Boss 8 Day 31 Promo 2: చీఫ్ కోసం గొడవ.. కొట్టుకు చచ్చేలా ఉన్నారే..?

Bigg Boss 8 Day 31 Promo 2: చీఫ్ కోసం గొడవ.. కొట్టుకు చచ్చేలా ఉన్నారే..?

Bigg Boss 8 Day 31 Promo 2 : బిగ్ బాస్ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో.. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఛాలెంజ్ లో ఏకంగా 12 వైల్డ్ కార్డు ఎంట్రీస్ ఉంటాయని, ఒక్కొక్క వైల్డ్ కార్డు కోసం ఒక్కొక్క ఛాలెంజ్ అలా మొత్తం 12 ఛాలెంజ్ లను గెలవగలిగితే, ఆ 12 వైల్డ్ కార్డు ఎంట్రీస్ ఆపవచ్చు అంటూ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో చెప్పారు. ఇక కంటెస్టెంట్స్ కూడా బాగానే కష్టపడ్డారు కానీ ఆరు ఛాలెంజ్‌లలో మాత్రమే గెలిచారు. మరొకవైపు ఈ ఆదివారం అనగా అక్టోబర్ ఆరవ తేదీన సాయంత్రం ఏడు గంటలకు ప్రసారమయ్యే ఈ బిగ్ బాస్ సీజన్ 8 రీ లాంచ్ ఈవెంట్లో వైల్డ్ కార్డు ఎంట్రీస్ ఉంటాయని ప్రోమోతో సహా బిగ్ బాస్ నిర్వాహకులు నిన్న విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తానికైతే ఆడియన్స్ కు వినోదాన్ని పంచడానికి ఛాలెంజ్ ల పేరిట కంటెస్టెంట్లను ఇబ్బంది పెట్టేశారు బిగ్ బాస్. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఎంత మంది రాబోతున్నారు అనే విషయం ఆదివారం తెలియనుంది.


చీఫ్ కోసం గొడవ..

ఇదిలా ఉండగా తాజాగా ఈ వారం ఇంటికి చీఫ్ గా ఎవరు ఉండబోతున్నారు అనే విషయంపై కంటెస్టెంట్స్ మధ్య గొడవ తారా స్థాయికి చేరింది. అందులో భాగంగానే తాజాగా బిగ్ బాస్ నిర్వాహకులు విడుదల చేసిన 31వ రోజుకి సంబంధించిన రెండవ ప్రోమో ఆసక్తికరంగా మారింది. ప్రోమో విషయానికి వస్తే.. మేము మీకు ఇచ్చిన ఛాలెంజ్లు అన్నింటిని పూర్తి చేయలేకపోయినందు వల్ల 8 వైల్డ్ కార్డు ఎంట్రీస్ మీ మీదకు తుఫానుల దూసుకు రాబోతున్నాయి. తుఫానును ఆపాల్సిన సమయం వచ్చేసింది. అంటూ తెలిపారు. ఎదురుగా కంటెస్టెంట్ ల పేర్లతో ఉన్న కుక్క పిల్లల బొమ్మలను వాటి హౌస్ లోకి చేర్చాలని అలా చేర్చలేని సభ్యుడు, అలాగే ఆ పప్పీ పైన ఉన్న పేరు గల సభ్యుడు ఇద్దరు డేంజర్ జోన్ లో ఉంటారు అని బిగ్ బాస్ తెలిపారు.


దీంతో యష్మి డేంజర్ జోన్ లోకి వెళ్ళిపోతుంది. అంతేకాదు ఆమె తీసుకొచ్చిన కుక్క పిల్ల పైన ప్రేరణ పేరు ఉండడంతో ఆమె కూడా కూడా డేంజర్ జోన్లోకి వచ్చేసింది. ఇక చీఫ్ గా నాకు మళ్ళీ అవకాశం వస్తే నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను అని యష్మి అడగగా. మణికంఠ నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోలేవు ఎందుకంటే లాస్ట్ టైం నువ్వు చీఫ్ గా ఓడిపోయావు అంటూ కామెంట్ చేశారు. మరొకవైపు ప్రేరణ నేను ఇప్పటివరకు చీఫ్ గా ఒక్కసారి కూడా కాలేదు అని చెబుతుంది. కానీ యశ్మీ మాత్రం ప్రతి వారం చీఫ్ అయ్యావు, ఫెయిల్ అయ్యావు అంటూ అదొకటి యాడ్ చేసి రేస్ నుంచి బయటకి తోయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ తెలిపింది యష్మి.

యష్మీ వర్సెస్ మణికంఠ..

మరొకవైపు యష్మి రేస్ నుంచి తప్పుకుంటుంది బిగ్ బాస్ అంటూ మణికంఠ తెలిపారు. ఆ తర్వాత మరోసారి యష్మి మణికంఠ పప్పిని తీసుకొచ్చింది. ఇక తర్వాత మణికంఠ యష్మి లలో ఎవరు చీఫ్ గా ఉండాలి అని కుటుంబ సభ్యులు నిర్ణయించాల్సిన సమయం రాగా పృధ్వి యష్మీ పేరు చెబుతాడు. మరొకవైపు మణికంఠ కుటుంబ సభ్యులతో గొడవ పడుతుంటే సీత తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. మొత్తానికైతే ఈ ప్రోమో చాలా ఆసక్తికరంగా సాగిందని చెప్పవచ్చు.

Related News

Bigg Boss season 9: బిగ్ బాస్ హౌస్ కి ఆ స్టార్ డైరెక్టర్, ఇదేమి ఖర్మ సామీ?

Bigg Boss season 9 : బిగ్ బాస్ అగ్నిపరీక్షలో నవదీప్ ఆవేశం, జడ్జ్ గా స్టార్ డైరెక్టర్ లీకైన వీడియో

Bigg Boss 9 Agnipariksha: బిగ్ బాస్ షూటింగ్‌కి బ్రేక్… అగ్ని పరీక్షలో ఏం జరుగుతుందటే ?

Bigg Boss 9 : బిగ్ బాస్ 9 అగ్నిపరీక్షలో అభిజీత్ రచ్చ రచ్చ.. వామ్మో, ఇంత జరుగుతోందా?

Big Boss: బిగ్ బాస్ హౌస్‌లోకి పహల్గాం ఉగ్రదాడి బాధితులు!

Bigg Boss 9 Telugu: డబుల్ హౌస్.. డబుల్ డోస్..బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్

Big Stories

×