BigTV English

Bigg Boss 8 Day 44 Promo1: నామినేషన్ రచ్చ.. తారస్థాయికి చేరిన గొడవ..!

Bigg Boss 8 Day 44 Promo1: నామినేషన్ రచ్చ.. తారస్థాయికి చేరిన గొడవ..!

Bigg Boss 8 Day 44 Promo1 : బిగ్ బాస్ (Bigg Boss) 8వ సీజన్ ప్రారంభమైన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఆరు వారాలు పూర్తి చేసుకుంది. ఈ షో ఆరు వారాలకు గానూ మొత్తం ఏడు మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. మొదటివారం బెజవాడ బేబక్క, రెండవ వారం ఆర్జే శేఖర్ బాషా , మూడవ వారం అభయ్ నవీన్, నాల్గవ వారం సోనియా, ఐదవ వారంలో మిడ్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా ఆదిత్య ఓం, ఐదవ వారం నైనిక, ఆరవ వారం స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకున్న కిర్రాక్ సీత ఎలిమినేట్ అయ్యారు. ఇక ప్రస్తుతం 14 మందిలో ఏడు మంది మాత్రమే హౌస్ లో కొనసాగుతుండగా మరొకవైపు వైల్డ్ కార్డు ద్వారా మొత్తం ఎనిమిది మంది హౌస్ లోకి అడుగుపెట్టారు. ఆ ఎనిమిది మందిని రాయల్ క్లాన్ గా, మిగిలిన ఏడు మంది ఇంటి సభ్యులను ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ గా విభజించారు. ఇకపోతే ఏడవ వారానికి సంబంధించి నామినేషన్ ప్రక్రియ మొదలైంది.


తార స్థాయికి చేరిన నామినేషన్ గొడవ..

నామినేషన్ రచ్చ ఎప్పటిలాగే మొదలైనా ఈసారి మాత్రం గొడవలు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. మరి 44వ రోజుకు సంబంధించి తాజా ప్రోమోను నిర్వాహకులు విడుదల చేయగా.. ఇప్పుడు ఈ ప్రోమోలో ఏముందో ఇప్పుడు చూద్దాం.


తాజాగా నామినేషన్ రచ్చ మొదలైంది. అందులో భాగంగానే కిల్లర్ గర్ల్స్ గా ప్రేరణ, హరితేజ కంటెస్టెంట్లు నామినేట్ చేసేటప్పుడు చెప్పే పాయింట్లు వాలిడా కాదా అనే విషయాన్ని తెలుస్తూ నామినేట్ చేయాలి. ఇక అలా అందులో భాగంగానే గౌతమ్, నబీల్ మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలోనే గౌతమ్ ను ఉద్దేశించి నబీల్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అంటూ కామెంట్లు చేయగా.. ఎక్కడ సేఫ్ గేమ్ ఆడుతున్నానో చెప్పు అంటూ ఫైర్ అయ్యాడు. ఆ తర్వాత నిఖిల్ , టేస్టీ తేజ ఇలా ఎవరికి వారు కామెంట్లు చేశారు.

మళ్లీ బూతులతో రెచ్చిపోయిన యష్మీ

ఇక్కడితో సరిపోకుండా ప్రేరణ తనకు పదేళ్ల ఫ్రెండ్షిప్ కాదని, హౌస్ లోకి వచ్చిన తర్వాతే ఫ్రెండ్ అయ్యింది అంటూ చెబుతూ యష్మి బూతులతో రెచ్చిపోయింది. ఫ్రెండ్స్ ని తీసుకొచ్చి నామినేషన్ లో వేయడం అనేది నాకు నచ్చలేదు అంటూ టేస్టీ తేజ కామెంట్ చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన యష్మి నా ఇష్టం ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి.. ఎలా గేమ్ ఆడాలి అంటూ బూతులతో రెచ్చిపోయి.. ఇది నా గేమ్ అంటూ ఫైర్ అయ్యింది యష్మి. దీంతో షో కాస్త మరింత రసవత్తరంగా మారింది. ఇక ఈ వారంలో నయని పావని గేమ్ చాలా బెటర్ గా ఉంది తేజ తో పోలిస్తే అంటూ హరితేజ చెబుతూ టేస్టీ తేజను నామినేట్ చేసింది. అలా ఈ వారం మొత్తం 9 మంది నామినేషన్ లోకి వచ్చేసారు. చూడాలి మరి ఈ వారం ఈ 9 మంది కెంటెస్టెంట్స్ నుంచి ఎవరు హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారో…

Related News

Monal Gajjar : బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గుర్తుందా.? ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Big Stories

×