Bigg Boss Soniya Marriage : బుల్లితెర టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఇటీవలే పూర్తి చేసుకుంది.. ఈ షోలో విన్నర్ గా నిఖిల్ నిలిచాడు. రన్నర్ గా గౌతమ్ కృష్ణ నిలిచాడు. ఈ షో ద్వారా బిగ్ బాస్ బ్యూటీ సోనియా ఆకుల ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. హౌస్ లో ఫైర్ బ్రాండ్ అనే ట్యాగ్ ను అందుకుంది. హౌస్ లో ఉన్నది కొన్ని వారాలే అయిన తన నోటి దూలతో బాగా పాపులారిటిని సొంతం చేసుకుంది. గతంలో డైరెక్టర్ ఆర్జీవీ తెరకెక్కించిన ఒకటి రెండు చిత్రాల్లో నటించింది.. ఆ సినిమాలు అంతగా పేరును ఇవ్వలేదు. కానీ బిగ్ బాస్ మాత్రం భారీ క్రేజ్ ను ఫ్యాన్ ఫాలోయింగ్ ను అందించింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. తాజాగా ఈ అమ్మడు తను ప్రేమించి వ్యక్తితో పెళ్లి పీటలు ఎక్కింది. ఆమె పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
సినీ ఇండస్ట్రీలో రామ్ గోపాల్ వర్మ లాగే హౌస్ లో వివాదాలకు కేరాఫ్ గా నిలిచింది సోనియా.. ఆటలో పెద్ద సత్తాను చూపించలేదు కానీ నోటి వల్ల టాప్ 5 లోకి వస్తుందని అనుకున్నారు. కానీ నాలుగో వారానికే హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. నిఖిల్, పృథ్వీలతో స్నేహం చేయడంతో ఆమెపై విపరీతమైన నెగిటివిటీ వచ్చేసింది.. హౌస్లో ఉన్నప్పుడు తన ప్రియుడు యష్ గురించి బయటపెట్టింది. తాజాగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది సోనియా ఆకుల. తన ప్రియుడు యష్ వీరగోనితో కలిసి ఏడుగులు వేసింది.. వీరిద్దరి పెళ్లి నిన్న గ్రాండ్ గా జరిగింది. ఆమె పెళ్లి సంగీత్ నుంచి పెళ్లి వరకు అన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి..
ఈ వేడుకకు బిగ్‌బాస్ కంటెస్టెంట్స్, మాజీ కంటెస్టెంట్స్ హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోలను జబర్దస్త్ రోహిణి తన ఇన్ స్టాలో షేర్ చేసింది. అందులో జెస్సీ, అమర్ దీప్, తేజస్విని, బేబక్క, రోహిణి, టేస్టీ తేజ, కిర్రాక్ సీత కనిపించారు. అయితే సోనియా ఆకుల పెళ్లి వేడుకలో మాత్రం నిఖిల్, పృథ్వీ మాత్రం కనిపించలేదు. దాంతో ఆ ఇద్దరు ఎందుకు రాలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.. కన్నడ బ్యాచ్ అయిన ప్రేరణ వచ్చింది. మిగిలిన అందరు పెళ్లికి వచ్చారు. కానీ పెద్దోడు చిన్నోడు మాత్రం పెళ్లికి రాలేదు. అసలు ఏమైంది ఈ ముగ్గురు బాగా క్లోజ్ కదా మరి ఎందుకు రాలేదు అంటూ సోషల్ మీడియాలో విచిత్రమైన కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై సోనియా రెస్పాండ్ అయ్యి క్లారిటీ ఇస్తేనే అసలు విషయం బయటకు వస్తుంది. బిగ్‌బాస్ రియాల్టీ షో ద్వారా సోషల్ మీడియాలో తెగ ఫేమస్ అయ్యింది సోనియా ఆకుల. హౌస్ లో ఉన్నప్పుడు తనపై వచ్చిన నెగిటివిటీపై గట్టిగానే రియాక్ట్ అయ్యింది సోనియా. అంతేకాదు.. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పలు ఇంటర్వ్యూలలో బిగ్‌బాస్ షో హోస్ట్ నాగార్జునపై సంచలన వ్యాఖ్యలు చేసింది.. దాంతో బయటకు వచ్చిన తర్వాత కూడా ట్రెండింగ్ లో ఉంది.. సోనియా ఆకుల యష్ పెళ్లి ఫోటోలను ఒకసారి చూసేయ్యండి..
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">