EX Mla Kethireddy: వైసీపీ నేతలకు కష్టాలు మొదలయ్యాయి. అధికారంలో ఉన్నప్పుడు నేతలు చేసిన పనులపై కూటమి సర్కార్ దృష్టి సారించింది. లేటెస్ట్ గా ధర్మవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి నోటీసులు ఇచ్చారు నీటి పారుదల, రెవిన్యూ అధికారులు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి బ్రదర్ సాగించిన భూ కబ్జాలపై ఫోకస్ చేసింది కూటమి ప్రభుత్వం. ఇందులోభాగంగా చిక్కవడియార్ చెరువును ఆక్రమించి ఓ గెస్ట్ హౌస్‌ని ఏర్పాటు చేశారు. దీనిపై దృష్టి పెట్టిన రెవిన్యూ, నీటిపారుదల అధికారులు కేతిరెడ్డి సోదరుడి భార్యకి నోటీసులు ఇచ్చారు.
కబ్జా చేసిన స్థలాన్ని వారం రోజుల్లో ఖాళీ చేయకుంటే స్వాధీనం చేసుకుంటామని అందులో పేర్కొన్నారు. ఆయనతోపాటు ధర్మవరం ఎమ్మార్వోకూ ఆయా నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వ భూమితోపాటు చెరువును సైతం కబ్జా చేశారు. ఓవరాల్‌గా చూస్తే మొత్తం 30 ఎకరాలన్న మాట.
భూ కబ్జాల లోతుల్లోకి వెళ్తే.. 2019-24 మధ్యకాలంలో ధర్మవరం రెవిన్యూ గ్రామం పరిధిలో వివిధ సర్వే నెంబర్లలో కేతిరెడ్డి సోదరుడు భార్య వసుమతి పేరుతో రైతుల నుంచి 25 ఎకరాలు కొనుగోలు చేశారు. అయితే ఆ ల్యాండ్‌కు ఆనుకుని ఉన్న చెరువు స్థలం మరో 20 ఎకరాలు ఆక్రమించారు.
ALSO READ: అఘోరీ కారుకు ఘోర ప్రమాదం.. నుజ్జు నుజ్జైన కారు.. ప్రస్తుతం ఎలా ఉందంటే?
మొత్తం 45 ఎకరాల్లో పండ్ల తోటల సాగు చేశారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన భూములను పిత్రార్జితంగా వచ్చినట్టు రికార్డుల్లో ప్రస్తావించారు. చెరువు కబ్జా చేసిన ప్రాంతంలో గుర్రాల కోసం షెడ్లు, బోటింగ్ సదుపాయాలు ఏర్పాటు చేసుకున్నారు. సింపుల్‌గా చెప్పాలంటే అదొక లేక్ వ్యూ గెస్ట్‌హౌస్ అన్నమాట.
ఈనెల 6న నోటీసులు అందుకున్నారు కేతిరెడ్డి పీఏ. ప్రస్తుతం హిమాలయాల టూర్‌కి వెళ్లారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. నోటీసుల వ్యవహారంపై రియాక్ట్ అయ్యారు. అవి చుక్కల భూములని అప్పటి టీడీపీ ప్రభుత్వం జీవో ప్రకారమే వాటిని రెగ్యులరైజ్ చేశారన్నారు. ఆ నోటీసును హైకోర్టులో ఛాలెంజ్ చేశామన్నారు. నోటీసును న్యాయస్థానం కొట్టివేసిందన్నారు.
న్యాయస్థానం ఆదేశాలను ఉల్లంఘిస్తూ అధికారులు నోటీసులు ఇచ్చారని, ఇది ముమ్మాటికీ కోర్టు ధిక్కరణగా వర్ణించారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి. దీనిపై సివిల్ కోర్టులో పిటిషన్ వేశామన్నారు. అధికారులు, ప్రభుత్వంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని చెప్పుకొచ్చారు. అన్నట్లు కేతిరెడ్డి బ్రదర్ భార్యది కర్నూలు జిల్లా. ఆమెకి ధర్మవరంలో భూములు ఎలా వచ్చాయనే దానిపై లోతుగా విచారణ మొదలుపెట్టేశారు అధికారులు. మొత్తానికి ఈ వ్యవహారంలో తీగ లాగితే డొంక కదలడం ఖాయమన్నమాట.
ఈనాడు న్యూస్ పేపర్ లో వచ్చిన కథనం పై pic.twitter.com/JPUksNi8io
— Kethireddy Venkatarami Reddy (@KethireddyMla) November 8, 2024