BigTV English

Weight gain problems: ప్రసవం తర్వాత బరువు పెరిగా, అప్పటి నుంచి మా అత్త నన్ను అలా అంటుంటే పిచ్చెక్కిపోతోంది!

Weight gain problems: ప్రసవం తర్వాత బరువు పెరిగా, అప్పటి నుంచి మా అత్త నన్ను అలా అంటుంటే పిచ్చెక్కిపోతోంది!

ప్రశ్న: నాకు పెళ్లయి మూడేళ్లు అయింది. మొదటి సంవత్సరం పిల్లల కోసం ప్రయత్నించినా కూడా గర్భం ధరించలేకపోయాను. నా అదృష్టం కొద్ది రెండవ సంవత్సరంలో గర్భం ధరించాను. అయితే నాకు కవలలు కలిగారు. సన్నగా ఉండేదాన్ని బాగా లావుగా మారిపోయాను. పిల్లలు, వారి పనులతో బిజీ అయి వ్యాయామం చేయలేకపోతున్నాను. ప్రసవానంతరం కూడా బరువు ఎక్కువగానే ఉన్నాను. అప్పటి నుంచి మా అత్త నన్ను చూసి ఎగతాళి చేస్తోంది. ఒక మహిళ అయి ఉండి నా బాధను అర్థం చేసుకోకుండా ఆమె నా బరువును పదేపదే ఎత్తి చూపుతోంది. అదే కాదు ఎవరైనా మా ఇంటికి బంధువులు వస్తే వాళ్ల ముందు నా బరువు గురించే మాట్లాడుతుంది. జోకులు వేస్తోంది. ఇది నాకు చాలా బాధగా ఉంది. ఒక్కోసారి పిచ్చెక్కిపోతోంది.


పిల్లలను కన్న తర్వాత ఆమె కూడా నాలాగే బరువు పెరిగే ఉంటుంది. ఆ విషయాన్ని మర్చిపోయి ఇప్పుడు నన్ను గేలి చేయడం చాలా బాధగా ఉంది. ఈ విషయాన్ని నేను నా భర్తకు చెప్పాను. కానీ ఆయన దాన్ని చాలా తేలికగా తీసుకుంటున్నారు. నాకు ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు. అలాగని ప్రతిరోజు ఆ మాటలను భరించలేకపోతున్నాను. నాకు తోటి కోడలు ఉంది. ఆమె సన్నగా ఉంటుంది. ఆమె ముందు నా డ్రెస్సులు సైజు గురించి కూడా మాట్లాడుతోంది. ఆమె డ్రెస్ సైజు, నా డ్రెస్ సైజు మధ్య తేడాను చెబుతోంది. ఇది నాలో విపరీతమైన కోపాన్ని అలాగే డిప్రెషన్ కూడా పెంచుతుంది. ఈ పరిస్థితి నుండి ఎలా బయటపడాలో తెలియడం లేదు.

జవాబు: మీ సమస్య మీకు ఎంతో మానసిక వేదనను కలిగిస్తోందని అర్థమవుతుంది. కానీ మీ భర్తకు మీ మానసిక వేదన అర్థం కావడం లేదు. మీ అత్తయ్యకు మీరు అందమైన ఇద్దరు కవలలను అందించారు. ఆమె వారిని చూసి మురిసిపోకుండా మీ బాడీ షేమింగ్ పై దృష్టి పెట్టడం అనేది మంచి పద్ధతి కాదు. ఇది వారితో అందమైన సంబంధాన్ని చెడ్డగొట్టుకున్నట్టు అవుతుంది. ఆ విషయం మీ అత్తగారికి అర్థం కావడం లేదు. సాధారణంగానే అత్తకు, కోడలికు కొంత గొడవలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి వారి బంధం చాలా తేలికగా ఉంటుంది. అలాంటివారు తమ అనుబంధాన్ని మరింత జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటిది మీ అత్త కావాలనే మిమ్మల్ని బాధ పెట్టడం, మర్యాద లేకుండా ప్రవర్తించడం అనేది మీ మనసును ఇంకా వేదనకు గురి చేస్తుందని అర్థమవుతుంది. బాడీ షేమింగ్ అనేది ఎవరికైనా బాధ కలిగించేది.


ప్రసవం తర్వాత కొంతమంది ఏడాదిలోపు బరువు తగ్గుతారు. మరికొందరు బరువు తగ్గడం కష్టంగా మారుతుంది. అది అనేక పరిస్థితులపై వారి శరీర తత్వం పై ఆధారపడి ఉంటుంది. ఇలాంటి సమయంలో కుటుంబ సభ్యుల వారికి అండగా నిలవాలి. కానీ వారి మాటలతో బాధపడుతుంటే తట్టుకోవడం కొంత కష్టమే. మీరు మీ అత్తతో నేరుగా ఈ విషయాన్ని మాట్లాడాల్సిన అవసరం ఉంది. మీ ఆత్మగౌరవం మీకు ఎంత ముఖ్యమో వారికి తెలియజెప్పండి. ప్రసవానంతరం బరువు పెరగడం అనేది సాధారణమేనని గతాన్ని ఒకసారి గుర్తు చేయండి.

Also Read: నా భర్త.. నాతో కాకుండా వేరొకరితో ఉంటున్నాడు – అడిగితే.. అలాంటి లాజిక్కు సమాధానం చెబుతున్నాడు

ఈ విషయాన్ని మీరు, మీ భర్త ముందే మాట్లాడడం మంచిది. లేకుంటే ఆమె ఆ విషయాన్ని మీ భర్తతో వేరేలా చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ స్వరం సున్నితంగా ఉండేలా చూసుకోండి. పరుషమైన పదజాలాన్ని వాడకండి. మీ అత్తను మీ భర్తను, మీ మామయ్యని కూడా కూర్చోబెట్టి మీరు పడుతున్న బాధను చెప్పండి. బరువు పెరగడం అనేది ప్రసవంతో సంబంధం కలిగిందని, అది గర్భం ధరించాక వచ్చే ముఖ్యమైన మార్పని… ఒకసారి వారికి గుర్తు చేయండి. మీ భర్త చదువుకున్న వారే కనుక వారికి గూగుల్ లో కూడా గర్భం ధరించాక ఎందుకు బరువు పెరుగుతారో వైద్యులు చెప్పిన సమాధానాలను ఇచ్చి చదవమని చెప్పండి. బాడీ షేమింగ్ ను భరించాల్సిన అవసరం లేదు.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×