BigTV English

Bigg Boss 8 Telugu: బిగ్‌బాస్ హౌజ్‌లోకి ఇవాళే 14 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ.. ఎవరెవరంటే..?

Bigg Boss 8 Telugu: బిగ్‌బాస్ హౌజ్‌లోకి ఇవాళే 14 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ.. ఎవరెవరంటే..?

Bigg Boss 8 Telugu: బుల్లితెరపై ఉర్రూతలూగించిన రియాలిటీ షో ఏదన్నా ఉంది అని అంటే అది ‘బిగ్ బాస్’ అనే చెప్పాలి. ప్రముఖ సెలబ్రిటీలను ఒక హౌజ్‌లో పెట్టి వారి రియల్ లైఫ్‌ను ఆడియన్స్‌కు చూపించే ఈ రియాలిటీ షోకి విపరీతమైన క్రేజ్ ఉంది. అదే క్రమంలో ఎంతో మంది ఈ షోపై విమర్శలు చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. కానీ కొంచెం కూడా షోకి ఆదరణ తగ్గలేదు. మొదటి సీజన్ నుంచి కూడా ఆదరణ పెరుగుతూ వచ్చింది. ఆ ప్రేక్షకాదరణతోనే ఇప్పటికి 7 సీజన్లు దిగ్విజయంగా ఈ షో పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు 8వ సీజన్ వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ సీజన్ 8 కోసం ఆడియన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.


ఎప్పుడు స్టార్ట్, ఎందులో చూడొచ్చు

బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు సెప్టెంబర్ 1 నుంచి గ్రాండ్ లెవెల్లో ప్రారంభం కానుంది. అంటే రేపటి నుంచి ఆడియన్స్‌ ముందుకు అధికారికంగా రాబోతుంది. ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి ఈ షో తెలుగు ప్రేక్షకులను అలరించనుంది. అయితే ఈ షోను ఎందులో చూడాలి అని అనుకుంటున్నారా? అదే విషయానికొస్తే.. బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు షోను ప్రముఖ టీవీ ఛానెల్ స్టార్ మా అండ్ ఓటీటీ సంస్థ డస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో వీక్షించవచ్చు. అయితే రేపు అధికారికంగా స్టార్ట్ కాబోతున్న ఈ షోకి సంబంధించి తాజాగా ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది.


ఈ సీజన్ 8 ప్రారంభం రోజు బిగ్ బాగ్ హౌజ్‌లోకి దాదాపు 14 మంది కంటెస్టెంట్లు అడుగుపెట్టబోతున్నట్లు టాక్ గట్టిగా వినిపిస్తోంది. అయితే ఫస్ట్ డే ఈ 14 మందిని హౌజ్‌లోకి పంపించి.. ఆ తర్వాత సెకండ్ డే మిగతా వారిని పంపించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వైల్డ్ కార్డుతో కూడా కొందరు కంటెస్టెంట్లు ఎంట్రీ ఇస్తారని.. అయితే వారు నాలుగు లేదా ఐదో వారంలో హౌజ్‌లోకి వస్తారని సమాచారం.

Also Read:  ‘బిగ్ బాస్’ 8 ట్విస్ట్.. ఏంటీ, ఈ కంటెస్టెంట్స్ హ్యాండిచ్చారా? మరి వెళ్తోంది ఎవరు?

ఒక్కరోజు ముందుగానే హౌజ్‌లోకి

ఈ షో అఫీషియల్‌గా సెప్టెంబర్ 1న రిలీజ్ కానుంది. అయితే ఈ షో సెప్టెంబర్ 1న రిలీజ్ కానుంది అంటే ఒక రోజు ముందుగానే షూటింగ్ జరుగుతుందన్నమాట. దీని ప్రకారం.. ఇవాళ అంటే ఆగస్టు 31న బిగ్ బాస్ 8 తెలుగు కంటెస్టెంట్స్ ఎంట్రీని హౌజ్‌లో షూట్ చేస్తారు. అందువల్ల ఇవాళే కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇస్తారన్న మాట. ఈ షో ఆదివారం ఆడియన్స్ ముందుకు వచ్చినా.. షూటింగ్‌లో భాగంగా ఇవాళే కంటెస్టెంట్ హౌజ్‌లోకి వెళ్లబోతున్నారు.

అయితే ఈ సీజన్ 8కి సంబంధించిన రూమర్డ్ కంటెస్టెంట్లలో యాంకర్ విష్ణుప్రియ, ఆర్జే శేఖర్ బాషా, ఆదిత్య ఓం, యష్మీ గౌడ, నాగ మణికంఠ, నైనిక అనరుసు, అభయ్ నవీన్, నిఖిల్ మలియక్కల్, బెజవాడ బేబక్క, ప్రేరణ కంబం, కిర్రాక్ సీత, పరమేశ్వర్ హివ్రాలే, సోనియా ఆకుల వంటి వారు ఉన్నారు. ఈ 13 మందితో పాటు న్యూస్ రీడర్ కల్యాణ్, దొరసాని సీరియల్ యాక్టర్ పృథ్వీరాజ్‌, జబర్దస్త్ రాకింగ్ రాకేష్, మోడల్ రవితేజలో ఒకరు హౌజ్‌లోకి ఫస్ట్ డే అడుగుపెట్టనున్నారు. మిగతా వారిని తర్వాత హౌజ్‌లోకి పంపిస్తారని తెలుస్తోంది. ఇది మాత్రమే కాకుండా వైల్డ్ కార్డ్ ద్వారా మిగతా వారిని హౌజ్‌లోకి పంపిస్తారని సమాచారం.

Related News

Monal Gajjar : బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గుర్తుందా.? ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Big Stories

×