IRCTC Warning: సైబర్ కేటుగాళ్లు రకరకాల పద్దతుల్లో ప్రజలను మోసం చేస్తున్నారు. ఇప్పటి వరకు బ్యాంకులు, డిజిటల్ అరెస్టుల పేరుతో మోసాలకు పాల్పడగా, ఇప్పుడు మరో రూపంలో అక్రమాలకు తెరలేపారు. రైల్వే యాప్ పేరుతో జనాల నుంచి అందినకాడికి దండుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో IRCTC తన కస్టమర్లను అలర్ట్ చేసింది. రైల్వే యాప్స్ పేరుతో సైబర్ నేరాలు జరుగుతున్నాయని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. IRCTCలా కనిపించే నకిలీ యాప్స్ ను అస్సలు ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకోకూడదని తేల్చి చెప్పింది. IRCTC నకిలీ యాప్స్ తో కస్టమర్లకు సంబంధించిన UPI, ఇతర ముఖ్యమైన బ్యాంకింగ్ సమాచారంతో పాటు వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే ప్రయత్నం చేస్తున్నారని వెల్లడించింది. ఇలాంటి యాప్స్ పట్ల అలర్ట్ గా ఉండాలని సూచించింది.
‘irctcconnect.apk.’ చాలా డేంజర్
ఒకవేళ మీరు రైలు టిక్కెట్ల బుకింగ్ కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) వెబ్‌సైట్ లేదంటే యాప్‌ని ఉపయోగిస్తుంటే.. కాస్ల జాగ్రత్తగా ఉండండి. IRCTC పేరుతో ‘irctcconnect.apk.’ అనే అనుమానాస్పద ఆండ్రాయిడ్ అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాలంటూ సామాజిక మాధ్యమాలలో సర్క్యులేట్ అవుతోంది. ఈ యాప్ ను ఎట్టిపరిస్థితుల్లోనూ ఇన్ స్టాల్ చేసుకోకూడదని IRCTC ప్రజలను హెచ్చరిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. వాట్సాప్, టెలిగ్రామ్ లాంటి ప్రముఖ మెసేజింగ్ యాప్‌ల ద్వారా ఈ డేంజరస్ యాప్ చెలామణి అవుతుందని వెల్లడించింది. ఈ apk ఫైల్ ఇన్ స్టాల్ చేస్తే మీ మొబైల్ ఫోన్ లోని సమాచారాన్ని ఆగంతకులు దోచుకునే అవకాశం ఉందని వెల్లడించింది. ఇలాంటి అనుమానాస్పద అప్లికేషన్ల పట్ల అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యమని తెలిపింది.
Read Also: భార్య మీద స్టేషన్ మాస్టర్ ఫ్రస్టేషన్, రూ. 3 కోట్లు ఫైన్ కట్టిన రైల్వే సంస్థ!
IRCTC ఏమని హెచ్చరించింది అంటే?
ఫిషింగ్ వెబ్ సైట్ (https://irctc.creditmobile.site)లో హోస్ట్ చేయబడిన ప్రమాదకరమైన ఆండ్రాయిడ్ యాప్ (irctcconnect.apk) క్లిక్ చేయగానే తమ మోబైలోని కాంటాక్ట్ లు అన్నింటికీ వెళ్లిపోతుంది. WhatsApp, టెలిగ్రామ్ సహా ఇతర యాప్స్ ద్వారా కాంటాక్ట్ నెంబర్స్ కు షేర్ అవుతుంది. సైబర్ నేరగాళ్లు భారీ స్థాయిలో ఫిషింగ్ లింక్‌ను పంపుతున్నారు. ఒకవేళ ఈ యాప్ ను క్లిక్ చేస్తే, మీ మోబైల్ లోని UPI వివరాలు, క్రెడిట్/డెబిట్ కార్డ్ సమాచారం లాంటి ముఖ్యమూన సమాచారాన్ని దొంగిలిస్తున్నారు. ఈ అప్లికేషన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇన్ స్టాల్ చేయకూడదని వార్నింగ్ ఇచ్చింది. Google Play Store, Apple Store నుంచి మాత్రమే IRCTC అఫీషియల్ ‘IRCTC రైల్ కనెక్ట్’ యాప్ ని డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది. IRCTC ఎప్పుడూ వినియోగదారులకు కాల్ చేసి పిన్, ఓటీపీ, పాస్ వర్డ్, క్రెడిట్, డెబిట్ కార్డ్ వివరాలు, నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్, UPI వివరాలు అడగదని వెల్లడించింది.
Read Also: రైలు సైడ్ లోయర్ బెర్త్ లో ఆ వైపు తిరిగి పడుకుంటున్నారా? చాలా తప్పు చేస్తున్నారు!