BigTV English
Advertisement

Bigg Boss 8 Telugu: ఆటలు ఆడదు కానీ గంగవ్వ ఓవరాక్షన్ మామూలుగా లేదుగా.! నబీల్ రాజకీయాల ముందు అందరూ దిగదుడుపే.!

Bigg Boss 8 Telugu: ఆటలు ఆడదు కానీ గంగవ్వ ఓవరాక్షన్ మామూలుగా లేదుగా.! నబీల్ రాజకీయాల ముందు అందరూ దిగదుడుపే.!

Bigg Boss 8 Telugu Latest Episode Highlights: బిగ్ బాస్ రియాలిటీ షోలో ఆ బిగ్ బాస్ అనేవాడు ఎప్పుడెప్పుడు ఎలాంటి ట్విస్టులు ఇస్తాడు అనే విషయం కంటెస్టెంట్స్‌కు ఏ మాత్రం క్లారిటీ ఉండదు. ఆ ట్విస్టులతోనే ఆటలో మజా వస్తుంది. ఇక తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో కూడా కంటెస్టెంట్స్‌కు ఊహించని ట్విస్టులు ఇచ్చాడు బిగ్ బాస్. ముందుగా గార్డెన్ ఏరియాలో మూడు సూట్‌కేసులు ఏర్పాటు చేశాడు. అవి ఎందుకు, ఏంటి అని ఏం చెప్పలేదు. నబీల్, పృథ్వి, రోహిణి మాత్రమే వాటిని ధైర్యంగా చేతిలోకి తీసుకున్నారు. దీంతో వారు మెగా చీఫ్ కంటెండర్స్‌గా నిలిచారు. కానీ ఆట అక్కడితో అయిపోలేదు. ఆ చీఫ్ కంటెండర్ స్థానాలకు వారు కాపాడుకోవడానికి పోటీ మొదలయ్యింది.


హరితేజకు అన్యాయం

ఇతర కంటెస్టెంట్స్‌తో పోటీపడి తమ మెగా చీఫ్ కంటెండర్ స్థానాలను కాపాడుకోవాలి నబీల్, పృథ్వి, రోహిణి. అలా ముందుగా ‘లక్డీ కా పూల్’ అనే టాస్కును రోహిణి ఆడాలని నిర్ణయించుకుంది. తన ప్రత్యర్థిగా హరితేజను సెలక్ట్ చేసుకుంది. హరితేజ కూడా రోహిణితో పోటీపడి బాగానే ఆడినా.. చివరికి రోహిణినే గెలిచింది. తన మెగా చీఫ్ కంటెండర్ స్థానాన్ని కాపాడుకోవడంతో పాటు ప్రైజ్ మనీలోకి రూ.1,80,000 యాడ్ కూడా చేసింది. ఇక తన తర్వాత ప్రేరణను మెగా చీఫ్ కంటెండర్ చేసింది రోహిణి. తనతో పోటీపడడానికి హరితేజను ఎంచుకున్న రోహిణి.. మెగా చీఫ్ కంటెండర్ చేయడానికి మాత్రం ప్రేరణ పేరు చెప్పింది. దీంతో హరితేజకు మరోసారి అన్యాయం జరిగింది.


Also Read: అప్పుడే మొదలెట్టేశారా?.. ఈ వారం ఆమె అవుట్..?

నబీల్‌కు బిగ్ షాక్

ఇక రేసులో నిరూపించుకోవడానికి పృథ్వి, నబీల్ మాత్రమే మిగిలారు. అందుకే నబీల్ తన రాజకీయాలు మొదలుపెట్టాడు. ముందుగా యష్మీని పిలిచి తనతో పోటీపడతామని, తనను ఓడిపోమ్మని అడిగాడు. దానికి యష్మీ పూర్తిగా అంగీకారం ఇవ్వలేదు. వెంటనే వెళ్లి టేస్టీ తేజతో డీల్ మాట్లాడుకోవాలి అనుకున్నాడు. కానీ తేజ కొంచెం కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఆ తర్వాత గౌతమ్ దగ్గరకు వెళ్లాడు. అలా టాస్కులు ప్రారంభం కాకముందే రాజకీయాలతోనే గెలిచేయాలని నబీల్ ఫిక్స్ అయ్యాడు. కానీ అప్పుడే బిగ్ బాస్ ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. ఈసారి మెగా చీఫ్ కంటెండర్స్ కానివారే టాస్క్ గురించి డిసైడ్ చేయాలని చెప్పడంతో నబీల్‌కు షాక్ తగిలింది.

గౌతమ్‌కు సపోర్ట్ కావాలి

గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన గంటను ముందుగా ఎవరైతే కొడతారో వారే.. నబీల్ లేదా పృథ్విలో ఒకరిని సెలక్ట్ చేసుకొని వారితో టాస్క్ ఆడాలి. అలా ముందుగా గౌతమ్ గంట కొట్టి నబీల్‌ను సెలక్ట్ చేసుకున్నాడు. గౌతమ్, నబీల్ ఇద్దరూ పోటాపోటీగా టాస్క్ మొదలుపెట్టారు. అయితే చాలామంది కంటెస్టెంట్స్ సపోర్ట్ అంతా నబీల్‌కే ఉంది. అది గంగవ్వకు నచ్చలేదు. గౌతమ్‌కు కూడా సపోర్ట్ చేయండి అంటూ ఎక్కువ మాట్లాడింది. అయినా చివరికి నబీలే గెలిచాడు. గౌతమ్ గెలవలేదని గంగవ్వ చాలా ఫీల్ అయిపోయింది. నబీల్ గెలవడంతో తను ప్రైజ్ మనీకి రూ.1,20,00 యాడ్ చేయడంతో పాటు యష్మీని చీఫ్ కంటెండర్‌గా నిలబెట్టాడు.

Related News

Bigg Boss 9 : ఎంత నటిస్తావమ్మా? అప్పుడు పురుగుల చూసావు ఇప్పుడు ఉన్నాను అంటున్నావ్

Bigg Boss 9: అది సుమన్ శెట్టి అంటే, అందుకే ఇంత మంది ఇష్టపడుతున్నారు

Bigg Boss 9: మరోసారి తన సెల్ఫిష్ బిహేవర్ బయట పెట్టిన ఇమ్మానియేల్

Bigg Boss 9 Telugu : ముద్దుబిడ్డ తనూజాకు బిగ్ బాస్ స్పెషల్ ఆఫర్… కళ్యాణ్ బలి… ఇదేం తుప్పాస్ గేమ్ బాసూ ?

Bigg Boss 9 Telugu Day 62 : ఇమ్మూ, రీతూ ఇంత సెల్ఫిషా ? కంటెస్టెంట్స్ ఎమోషన్స్ తో ఆటాడుకున్న నాగ్… రామూ షాకింగ్ ఎలిమినేషన్

Bigg Boss Tamil: ప్రాంక్‌ పేరుతో కొట్టుకున్న కంటెస్టెంట్స్‌.. ఫైర్‌ అయిన హోస్ట్‌!

Bigg Boss 9 Elimination: డబుల్‌ ట్విస్ట్‌, డబుల్‌ ఎలిమినేషన్‌.. రాము రాథోడ్‌ అవుట్‌!

Bigg Boss 9 Promo : బిగ్ బాస్ హౌస్ లో ఆర్జీవి, అందరూ అమ్మాయిలే కావాలి అంటూ..

Big Stories

×