Bigg Boss 8 Telugu Latest Episode Highlights: బిగ్ బాస్ 8లో ఉన్న టాప్ 10 కంటెస్టెంట్స్‌ను చూడడానికి వారి కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా హౌస్‌లోకి ఎంటర్ అవుతున్నారు. లోపల కంటెస్టెంట్స్‌గా ఆడేవారికి బయట ప్రేక్షకులు తమ గురించి ఏమనుకుంటున్నారో తెలియదు. కానీ వారి కుటుంబ సభ్యులు మాత్రం అన్నీ ఫాలో అవుతూనే ఉంటారు. అందుకే అవన్నీ నోట్ చేసుకొని తమవారికి సలహాలు, సూచనలు ఇచ్చారు కుటుంబ సభ్యులు. తాజాగా ప్రసారమయిన ఎపిసోడ్‌లో నిఖిల్ మధర్ బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటర్ అయ్యారు. నిఖిల్ గురించి ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో.. అదే విషయాన్ని ఆమె కూడా చెప్పి తన గేమ్‌ను మెరుగుపరిచే ప్రయత్నం చేశారు.
నామినేషన్స్‌లో జాగ్రత్త
ముందుగా తన తల్లి హౌస్‌లోకి ఎంటర్ అవ్వడం చూసి నిఖిల్ చాలా ఎమోషనల్ అయ్యారు. రాగానే కాసేపు అందరితో కూర్చొని కబుర్లు చెప్పారు. తర్వాత నిఖిల్ ఆట గురించి తనకు చెప్పడం కోసం తనను బయటికి తీసుకెళ్లారు. డైరెక్ట్‌గా పేర్లు చెప్పకుండా కంటెస్టెంట్స్ గురించి చెప్తూ.. వారితో ఎలా ఉండాలి అని సూచనలు ఇచ్చారు. ముందుగా గౌతమ్‌తో ఎక్కువగా వాదించకు, డిఫెండ్ చేసుకునే క్రమంలో తనతో ఎక్కువగా గొడవపడుతున్నావని అన్నారు. అయితే తను తప్పు చేస్తేనే నేను వాదిస్తున్నానని నిఖిల్ అన్నాడు. నీకు కారణం ఉంటేనే వారిని నామినేట్ చెయ్యి, వేరే వారి కారణంతో నామినేట్ చేయకు అని సూటిగా చెప్పేశారు.
Also Read: జెడ్ స్పీడ్ లో దూసుకొస్తున్న టేస్టీ తేజ.. సింపథీ వర్కౌట్ అయ్యిందా..?
కంట్రోల్‌లో ఉండు
యష్మీ గురించి మాట్లాడుతూ.. యష్మీతో కాస్త కంట్రోల్‌లో ఉండు అని వార్నింగ్ ఇచ్చారు. గత కొన్నిరోజులుగా యష్మీ, నిఖిల్ మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని ప్రేక్షకులు మాత్రమే కాదు.. కంటెస్టెంట్స్ కూడా ఫీలవుతున్నారు. దీంతో నిఖిల్, యష్మీ అలా ఉండడం కరెక్ట్ కాదని తన తల్లి చెప్పకనే చెప్పారు. ఆ తర్వాత ప్రేరణతో కూడా కాస్త జాగ్రత్తగా ఉండమన్నారు. మొత్తానికి నిఖిల్ గురించి బయట ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో, తను ఎలా ఉండాలో అంతా క్లియర్‌గా చెప్పారు తన మధర్. దీంతో ఇప్పటినుండి అయినా నిఖిల్ ఆటతీరు మెరుగు అవుతుందేమో అని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. తన తల్లి చెప్పిన సూచనలు కరెక్ట్ అని చాలామంది ప్రేక్షకులు ఫీలవుతున్నారు.
ఉన్నది ఉన్నట్టుగా
నిఖిల్ మధర్ వెళ్లిపోయే ముందు ఒక గేమ్ ఆడి కంటెస్టెంట్స్ అందరికీ మటన్ వచ్చేలా చేశారు. దీంతో కంటెస్టెంట్స్ అంతా చాలా హ్యాపీగా ఫీలయ్యారు. అంతే కాకుండా మైసూర్ పాక్ పంచి అందరినీ సంతోషపెట్టారు. అలా ఇప్పటివరకు జరిగిన ఫ్యామిలీ వీక్‌లో బయట ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో ఉన్నది ఉన్నట్టుగా చెప్పి తన కొడుకు ఆటను ఇంప్రూవ్ చేయాలనుకున్న వారిలో నిఖిల్ మధరే ఫస్ట్‌లో ఉంటారు. బిగ్ బాస్ 8 స్టార్ట్ అయిన కొన్నిరోజులకు నిఖిల్‌లో విన్నర్ అయ్యే లక్షణాలు ఉన్నాయని చాలామంది ప్రేక్షకులు ఫీలయ్యారు. కానీ తను ఎక్కువగా అమ్మాయిలతో ఉండడం వల్ల తనపై నెగిటివ్ అభిప్రాయం వచ్చేసింది. ఇప్పటికైనా తన తప్పు తాను తెలుసుకుంటాడని ఆడియన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.