Best Top Romantic Movies to Watch on OTT : రొమాంటిక్ సినిమాలు చూస్తున్నంత సేపు మనసుకు హాయిగా అన్పిస్తుంది. అలాగే కొన్ని సినిమాలను పార్టనర్ తో కలిసి చూస్తేనే అర్థవంతంగా అన్పిస్తుంది. సింగిల్ గా చూస్తే కష్టంగా అన్పిస్తుంది. అయితే పార్టనర్ తో కలిసి సినిమాలు చూడడానికి ఇప్పుడు థియేటర్లకు వెళ్లాల్సిన అవసరం లేదు. హ్యాపిగా ఇంట్లోనే కూర్చుని పార్టనర్ తో కలసి చూడవచ్చు. అలాంటి రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాలను ఇష్టపడే వారి కోసం ఈ మూవీస్. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలు మాత్రం హిందీ ఎవర్ గ్రీన్ రొమాంటిక్ మూవీస్. కాబట్టి లైఫ్ పార్టనర్ తో కలిసి ఈ సినిమాలను మిస్ అవ్వకుండా చూడండి.
దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే (Dilwale Dulhania Le Jayenge)
బాలీవుడ్ రొమాంటిక్ మూవీస్ గురించి మాట్లాడినా, రొమాన్స్ గురించి ప్రస్తావన వచ్చినా షారుక్ ఖాన్ సినిమాలే ముందుగా గుర్తు వస్తాయి. షారుక్ ఖాన్‌ను రొమాన్స్ కింగ్ అని కూడా పిలుస్తారు. ఆయన సినిమాలు రొమాంటిక్ మూవీ అభిమానులకు చాలా ఇష్టం. ఆ లిస్ట్ లో ‘దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే’ చిత్రం ఒక ఐకానిక్ చిత్రం. ఈ చిత్రం 1995లో విడుదలైంది. అప్పట్లో కాజోల్‌తో షారూక్ రొమాంటిక్ కెమిస్ట్రీ సంచలనం సృష్టించింది. ఆదిత్య చోప్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్‌లో చూడవచ్చు.
వీర్ జారా (Veer Zaara)
‘వీర్ జారా’ మూవీ 2004 లో రిలీజ్ అయ్యింది. ఇందులో అప్పటి స్టార్ హీరోయిన్ ప్రీతి జింటాతో షారుఖ్ ఖాన్ జోడీ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. ఈ చిత్రాన్ని యష్ చోప్రా రూపొందించారు. అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమాను చూడవచ్చు.
ఆషికి (Aashiqui)
రొమాంటిక్ చిత్రాల గురించి మాట్లాడటం, ప్రేమ గురించి ప్రస్తావించడం వంటివి జరిగినప్పుడు గుర్తొచ్చే హిందీ సినిమాల్లో ‘ఆషికి’. ఈ సినిమా 1990లో వచ్చింది. రాహుల్ రాయ్, అను అగర్వాల్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఇద్దరు స్టార్స్ రాత్రికి రాత్రే ఈ సినిమాతో ఓవర్ నైట్ పాపులారిటీని సంపాదించుకున్నారు. ఈ చిత్రాన్ని మహేష్ భట్ రూపొందించారు. ఈ సినిమా పాటలు అప్పట్లో బాగా పాపులర్ అయ్యాయి. ఈ మూవీని యూట్యూబ్‌లో చూడవచ్చు. కానీ రెంట్ బేసిస్ లోనే ఈ మూవీ యూట్యూబ్ లో అందుబాటులో ఉంది.
దేవదాస్ (Devdas)
షారుక్ ఖాన్ హీరోగా నటించిన ఈ రొమాంటిక్ మ్యూజిక్ డ్రామా 2002లో వచ్చింది. ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్, షారుక్ ఖాన్ ల ప్రేమకథ ఇప్పటికీ జనాల గుండెల్లో పదిలంగా ఉందని చెప్పాలి. సంజయ్ లీలా బన్సాలీ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో మాధురీ దీక్షిత్ కూడా కీలక పాత్రలో కనిపించింది. మీరు ఈ చిత్రాన్ని జియో సినిమాలో చూడవచ్చు.
పరిణయం (Parinayam)
2006లో విడుదలైన షాహిద్ కపూర్, అమృత రావుల చిత్రం ‘పరిణయం’. ఈ చిత్రాన్ని Zee5, Amazon Primeలో చూడవచ్చు. అరేంజ్డ్ మ్యారేజ్, లవ్ స్టోరీని సినిమాలో చూపించారు. షాహిద్, అమృతల జోడీ కెమిస్ట్రీ తెరపై అద్భుతంగా పండింది. ఈ చిత్రానికి సూరజ్ బర్జాత్యా దర్శకత్వం వహించారు.