E-Paper
Advertisement

Bigg Boss 8 Telugu: కంటెస్టెంట్స్‌కు ప్రేమకథ వినిపించిన ప్రేరణ.. చిన్నపిల్లలు వింటే బాగుండదమ్మా!

Bigg Boss 8 Telugu: కంటెస్టెంట్స్‌కు ప్రేమకథ వినిపించిన ప్రేరణ.. చిన్నపిల్లలు వింటే బాగుండదమ్మా!
Advertisement

Bigg Boss 8 Telugu Latest Episode Highlights: బిగ్ బాస్ సీజన్ 8లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది ప్రేరణ. అంతకు ముందు పలు సీరియల్స్‌లో హీరోయిన్‌గా కూడా నటించి మెప్పించింది. కానీ సీరియల్స్ చూడని ప్రేక్షకులకు మాత్రం బిగ్ బాస్ ద్వారానే దగ్గరయ్యింది. ప్రేరణకు కొన్నాళ్ల క్రితమే పెళ్లయ్యింది అనే విషయం చాలామందికి తెలియదు. బిగ్ బాస్ హౌస్‌లో కూడా ఈ టాపిక్ ఎక్కువసార్లు రాలేదు. కానీ ఇటీవల ప్రసారమయిన ఎపిసోడ్‌లో గౌతమ్, టేస్టీ తేజ, నబీల్, అవినాష్ కలిసి ప్రేరణను తన ప్రేమకథ చెప్పమన్నారు. తను చెప్తున్నప్పుడు మధ్యమధ్యలో జోకులు వేశారు. ప్రేరణ లవ్ స్టోరీని నాగార్జున కూడా విని దానిపై సెటైర్లు వేసి తనను నవ్వించారు.

ప్రేరణ సిగ్గుపడింది

Advertisement

ప్రేరణను తన లవ్ స్టోరీ గురించి అడిగి ముందుగా ఎవరు ప్రపోజ్ చేశారో చెప్పమన్నాడు అవినాష్. అది విన్న ప్రేరణ సిగ్గుపడింది. అయితే వారిది ఏడేళ్ల ఫ్రెండ్‌షిప్ అని చెప్పుకొచ్చింది. తాము ఏడేళ్ల నుండి ఫ్రెండ్స్ అని, పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వచ్చినప్పుడు డేటింగ్ మొదలుపెట్టామని తెలిపింది. అయితే డేటింగ్ అంటే ఏంటో తెలియనట్టుగా ఓవరాక్షన్ చేశారు అబ్బాయిలు. డేటింగ్ అంటే ముద్దులు పెట్టేసుకోవడం, తిరగడం అని ఓపెన్‌గా చెప్పేసింది ప్రేరణ. పార్కుల్లో తిరిగారా అంటే మా ప్రేమకథ అంతా పార్కుల్లోని నడిచింది అని బయటపెట్టింది. అంతే కాకుండా తన భర్త తనకంటే వయసులో 7 నెలలు చిన్న అనే విషయాన్ని కూడా రివీల్ చేసింది ప్రేరణ.

Also Read: బిగ్ బాస్ లో మరో లేడీ కంటెస్టెంట్ బలి.. ఊహించిన వారే ఎలిమినేట్..?

Advertisement

ప్రేమకథను గుర్తుచేసుకున్నారు

ప్రేరణ ప్రేమకథను నాగార్జున కూడా విన్నారు. ఎపిసోడ్ పూర్తయ్యే సమయానికి తను డల్‌గా ఉంటే మరోసారి తన ప్రేమకథను గుర్తుచేసి నవ్వించారు. ఇక మెగా చీఫ్‌గా అవినాష్ బాధ్యతలు తీసుకున్నాడు. మెగా చీఫ్ అయిన వెంటనే ఇంట్లో చేయాల్సిన పనులను సమానంగా విభజించాడు. ఆ విషయం క్లియర్ అయిపోయింది. అయితే డే టైమ్‌లో పడుకోకూడదనే రూల్ ఉన్నా కూడా యష్మీ, నిఖిల్, పృథ్వి, నబీల్ పడుకున్నారు. మామూలుగా అలా పడుకున్నప్పుడు కుక్కలు అరిచిన సౌండ్ వస్తుంది. అప్పుడు వారు లేవాలి. కానీ ఈసారి అలా జరగలేదు. వారు పడుకున్న విషయాన్ని అవినాష్ గమనించి వెళ్లి లేపాడు. ఆపై అందరికీ పనిష్మెంట్ ఇచ్చాడు.

పడుకున్నందుకు పనిష్మెంట్

పడుకున్నందుకు నిఖిల్, పృథ్వి, నబీల్‌కు ఒక పనిష్మెంట్ ఇచ్చాడు అవినాష్. తమకు వచ్చిన వంటకాలను నవరసాలలో చెప్పమన్నాడు. నబీల్ తనకు ఏ వంట రాదని చెప్పగా.. ఛాయ్ పెట్టడం వచ్చు కాబట్టి దాని గురించి చెప్పమన్నాడు. నవరసాల్లో ఛాయ్ ఎలా పెట్టాలో చెప్పి అందరినీ ఎంటర్‌టైన్ చేశాడు నబీల్. నిఖిల్, పృథ్వి కూడా అలా చెప్పడానికి ప్రయత్నించారు కానీ అది చూస్తుంటే తమకు పనిష్మెంట్ లాగా ఉందని ఫీలయ్యాడు అవినాష్. ఇక యష్మీని బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న ప్రతీ కెమెరా దగ్గరకు వెళ్లి డే టైమ్‌లో ఇంకెప్పుడూ పడుకోను అని చెప్పమని పనిష్మెంట్ ఇచ్చాడు. అలా అవినాష్ మెగా చీఫ్ వెంటనే హౌస్ అంతా సందడిగా మారిపోయింది.

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×