Bigg Boss 8 Telugu Latest Episode Highlights: బిగ్ బాస్ 8లో కెప్టెన్స్ అనేవారు ఉండరని, చీఫ్స్ ఉంటారని సీజన్ మొదట్లోనే కంటెస్టెంట్స్‌కు క్లారిటీ వచ్చేసింది. అలా చీఫ్స్ అనేవారు పోయి మెగా చీఫ్స్ వచ్చారు. అప్పటినుండి ఇప్పటివరకు ప్రేరణకు చీఫ్ అవ్వడమే లక్ష్యం. ఎన్నోసార్లు చీఫ్ స్థానం తన చేతివరకు వచ్చి పోయింది. కానీ ఈసారి అలా జరగలేదు. తన ఫ్రెండ్స్ అంతా కలిసి ప్రేరణను మెగా చీఫ్ చేశారు. కానీ మెగా చీఫ్ అవ్వగానే ప్రేరణ ప్రవర్తన మొత్తం మారిపోయింది. తనకు నచ్చని హౌస్‌మేట్స్‌ను పర్సనల్‌గా టార్గెట్ చేసింది. అందులో ముందుగా విష్ణుప్రియా పేరే ఉంది. ఇక ఎవిక్షన్ షీల్డ్ కోసం జరిగిన పోటీలో కూడా మెగా చీఫ్ అవ్వడానికి తనకు సపోర్ట్ చేసినవారికే ముందుగా వెన్నుపోటు పొడిచింది ప్రేరణ.
ఎవిక్షన్ షీల్డ్ కావాలా
ఈసారి బిగ్ బాసే స్వయంగా కంటెస్టెంట్స్‌లో ఎవరో ఒకరికి ఎవిక్షన్ షీల్డ్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. కానీ ఆ షీల్డ్ ఎవరికి రావాలనే నిర్ణయం వారికే వదిలేశాడు. సమయానుసారం బిగ్ బాస్ పిలిచిన ఇద్దరు కంటెస్టెంట్స్ ఆయన ముందుకు వచ్చి.. ఎవరికి ఎవిక్షన్ షీల్డ్ దక్కకూడదు అనుకుంటున్నారో చెప్పాలి. చివరికి ఎవరి పేరు అయితే కంటెస్టెంట్స్ ఎవ్వరూ చెప్పకుండా ఉంటారో వారికే ఎవిక్షన్ షీల్డ్ దక్కుతుంది. కానీ ప్రేరణ మెగా చీఫ్ అవ్వడంతో తనే ముందుగా ఎవిక్షన్ షీల్డ్ రేసు నుండి అయిదుగురిని తొలగించే అవకాశం లభించింది.
Also Read: సీక్రెట్ గా బాయ్ ఫ్రెండ్ తో బిగ్ బాస్ బ్యూటీ రెండో పెళ్లి ..?
ప్లేట్ మార్చిన ప్రేరణ
ప్రేరణ చేతికి పవర్ ఇవ్వగానే ముందుగా విష్ణుప్రియాను ఎవిక్షన్ షీల్డ్ రేసు నుండి తొలగించింది. ఆ తర్వాత పృథ్వి, గౌతమ్, గంగవ్వను కూడా తొలగించింది. చివరికి ఎవరిని తొలగించాలా అని ఆలోచిస్తూ హరితేజ పేరు చెప్పింది. దీంతో ఎవిక్షన్ షీల్డ్ రేసు నుండి ప్రేరణ చేతుల మీదుగా తొలగిపోయినందుకు కంటెస్టెంట్స్ ఫీలయ్యారు. అందులో ముఖ్యంగా గంగవ్వ తప్పా అందరూ ప్రేరణ మెగా చీఫ్ అవ్వడానికి తనకు సపోర్ట్ చేసినవారే ఉన్నారు. దీంతో మెగా చీఫ్ అవ్వగానే ప్రేరణ పార్టీ మారిపోయిందా అనే డౌట్ కూడా ప్రేక్షకుల్లో స్టార్ట్ అయ్యింది. ప్రేరణ టర్న్ అయిపోగానే కంటెస్టెంట్స్ అంతా జంటగా వచ్చి అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ నుండి ఒక్కొక్కరిని ఈ రేసు నుండి తొలగించాలి.
రివెంజ్ షురూ
ముందుగా అవినాష్, నబీల్‌ను పిలవగా వారు యష్మీని తొలగించారు. నబీల్ మెగా చీఫ్ అవ్వడానికి యష్మీ సపోర్ట్ చేయకపోవడాన్ని మనసులో పెట్టుకొని వారు ఇలా చేశారు. ఆ తర్వాత వచ్చిన విష్ణుప్రియా, పృథ్వి కలిసికట్టుగా తమను ఎవిక్షన్ షీల్డ్ రేసు నుండి తప్పించిన ప్రేరణను పక్కకు తోశారు. నిఖిల్, గౌతమ్ వచ్చి సరైన కారణం లేకుండా టేస్టీ తేజను తొలగించారు. హరితేజ, రోహిణి కలిసొచ్చినా కూడా ఒకే మాట మీద నిలబడలేకపోయారు. అందుకే వేరే దారిలేక తానే కాంప్రమైజ్ అయ్యి తన ఫ్రెండ్ అవినాష్‌ను తొలగించింది రోహిణి. దానివల్ల ఇద్దరి మధ్య గొడవ కూడా జరిగింది. ఇక చివరిగా వచ్చిన యష్మీ, టేస్టీ తేజ ఒక మాట మీద నిలబడకుండా కొట్టుకొని నిఖిల్, రోహిణి ఇద్దరినీ తొలగించారు. చివరికి నబీల్ సేవ్ అయ్యాడు.