Bigg Boss 8 Telugu Latest Episode Highlights: బిగ్ బాస్ సీజన్ 8లో మెగా చీఫ్ అవ్వడం కోసం పోటీ మొదలయ్యింది. రోహిణి, నబీల్, పృథ్వి, ప్రేరణ, యష్మీ మెగా చీఫ్ కంటెండర్లు కాగా.. మొదటి రెండు రౌండ్లు పూర్తయ్యే సమయానికి యష్మీ, నబీల్ ఆట నుండి తప్పుకున్నారు. అతి తక్కువమంది హౌస్‌మేట్స్ సపోర్ట్ ఉండడంతో వీరు మెగా చీఫ్ అయ్యే ఛాన్స్ కోల్పోయారు. ఇక మిగిలిన పృథ్వి, ప్రేరణ, రోహిణి మధ్య తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో పోటీ మొదలయ్యింది. అప్పటికే పృథ్వి చీటింగ్ చేసి గేమ్ గెలవాలనుకున్నాడు. అది నబీల్ కనిపెట్టడంతో పెద్ద గొడవే అయ్యింది. పైగా కంటెస్టెంట్స్ అందరికీ దీని గురించే డిస్కషన్ మొదలయ్యింది. తాజాగా ప్రసారమయిన ఎపిసోడ్‌లో నబీల్, పృథ్వి గొడవే హైలెట్‌గా నిలిచింది.
అమ్మాయిలంతా ఒకవైపు
పృథ్వి, ప్రేరణ, రోహిణి.. ఈ ముగ్గురూ చీఫ్స్ అవ్వలేదు. కానీ ముగ్గురికి సమానంగా సపోర్ట్ మాత్రం లేదు. అవినాష్, నబీల్, టేస్టీ తేజ మాత్రమే రోహిణికి సపోర్ట్ చేస్తుండగా.. మిగిలిన కంటెస్టెంట్స్ అంతా పృథ్వి, ప్రేరణకు సమానంగా సపోర్ట్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఇక ఎప్పుడూ ఏ ఆటలోనూ యాక్టివ్‌గా ఉండని గంగవ్వ సైతం రోహిణికి సపోర్ట్ చేయడానికి ముందుకొచ్చింది. యష్మీ, హరితేజ, విష్ణుప్రియా.. వీరంతా పృథ్వి ఓడిపోకుండా ఉండడానికి కష్టపడుతుంటే గంగవ్వ మాత్రం తన చీరలో మూటలు అన్నీ పట్టుకొచ్చి పృథ్వి బాక్స్‌లో వేయాలనుకుంది. కానీ ఆ ముగ్గురు అమ్మాయిలు కలిసి గంగవ్వపై దౌర్జన్యం చేశారు. తన చీరలోని మూటలన్నీ కింద పడేశారు.
Also Read: సీక్రెట్ గా బాయ్ ఫ్రెండ్ తో బిగ్ బాస్ బ్యూటీ రెండో పెళ్లి ..?
పాయింట్ ఏంటంటే
పృథ్వి బాక్స్‌లోనే ఎక్కువ మూటలు ఉండడంతో మూడో రౌండ్ నుండి తను ఓడిపోయాడు. తను ఓడిపోతున్నాననే ఫ్రస్ట్రేషన్‌తో ఆల్రెడీ ఒకసారి నబీల్‌పై అరిచాడు. ఇక తను ఓడిపోయి పక్కకు జరిగిన తర్వాత బాక్స్ పక్కకు జరిగిందని, దాని వెనుక మూటలు ఉన్నాయని నబీల్ గమనించాడు. కానీ అది సరిగ్గా ఎవ్వరికీ చెప్పలేక పృథ్విపై అరిచాడు. పృథ్వి కూడా తిరిగి అరవడంతో అసలు పాయింట్‌ను ఎవరూ పట్టించుకోలేదు. చివరికి ప్రేరణ, రోహిణి మాత్రమే ఆటలో మిగిలారు. ఎక్కువ సపోర్ట్ ప్రేరణకే ఉండడంతో తనే మెగా చీఫ్ అయ్యింది. రోహిణి మాత్రం తాను మెగా చీఫ్ అవ్వలేదు అనే విషయాన్ని తట్టుకోలేకపోయింది. వెంటనే పక్కకు వెళ్లి ఏడ్చేసింది.
బాధలో రోహిణి
మెగా చీఫ్ అవ్వడం కోసం గౌతమ్‌ను సపోర్ట్ అడిగింది రోహిణి. కానీ ఎందుకో తెలియదు కానీ తను ప్రేరణకే సపోర్ట్ చేస్తాను అన్నాడు. విష్ణుప్రియాను అడిగితే తనకే సపోర్ట్ చేస్తాను అని చెప్పింది. కానీ తను ఎంతవరకు సపోర్ట్ చేసిందో అందరూ చూశారు. ఏదో మాటవరసకు చేసినట్టుగా విష్ణుప్రియా చేసిన సాయం రోహిణికి నచ్చలేదు. అదే విషయం టేస్టీ తేజ, నిఖిల్‌తో చెప్పుకొని బాధపడింది. మొత్తానికి రోహిణి వల్లే ప్రేరణకు ఆరెంజ్ బాక్స్ వచ్చింది. తనే చివరికి మెగా చీఫ్ అయ్యింది. ప్రేరణ మెగా చీఫ్ అయినందుకు రోహిణి హ్యాపీగా ఫీలయిన తను అవ్వలేదని బాధపడింది. అందుకే మొదటిసారి అందరి ముందు ఏడ్చేసింది.