BigTV English

Bigg Boss 8 Telugu: టేస్టీ తేజకు దెబ్బ మీద దెబ్బ.. బిగ్ బాస్‌లోకి వచ్చిన కల పోయినట్టేగా..

Bigg Boss 8 Telugu: టేస్టీ తేజకు దెబ్బ మీద దెబ్బ.. బిగ్ బాస్‌లోకి వచ్చిన కల పోయినట్టేగా..

Bigg Boss 8 Telugu Latest Episode Highlights: బిగ్ బాస్ సీజన్ 8లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా వచ్చిన వారిలో టేస్టీ తేజ కూడా ఒకడు. ఈ కంటెస్టెంట్ బిగ్ బాస్ 7లోకి వచ్చి అలరించాడు. కానీ టాప్ 5కు చేరుకునే ముందే ఎలిమినేట్ అయ్యాడు. అప్పట్లో కూడా తన తల్లిని బిగ్ బాస్ హౌస్‌లోకి తీసుకురావడమే కల అని అంటూ ఉండేవాడు. ఇప్పుడు కూడా బిగ్ బాస్ 8 హౌస్‌లోకి కచ్చితంగా తన తల్లిని తీసుకొస్తానని మొదట్లోనే ఛాలెంజ్ చేశాడు. కానీ ఆ కలను కంటెస్టెంట్స్ అంతా కలిసి దూరం చేశారు. కన్ఫెషన్ రూమ్‌లో కంటెస్టెంట్స్ అందరికీ సెపరేట్‌గా ఒక టాస్క్‌ను ఏర్పాటు చేశారు నాగార్జున. అందులో అందరినీ వరస్ట్ ప్లేయర్ ఎవరు అని అడిగారు. అంతరాత్మ సాక్షిగా వారు చెప్పిన సమాధానం తేజపై దెబ్బపడేలా చేసింది.


వరస్ట్ ప్లేయర్ ఎవరు

అంతరాత్మ సాక్షిగా కంటెస్టెంట్స్‌లో వరస్ట్ ప్లేయర్ ఎవరు అని ఒక్కొక్కరిని అడిగారు నాగార్జున. ముందుగా వచ్చిన నబీల్.. విష్ణుప్రియాను వరస్ట్ ప్లేయర్ అన్నాడు. మొదటి వారాల్లో తనలో కనిపించిన ఫైర్ ఇప్పుడు కనిపించలేదని కారణం చెప్పాడు. ఇప్పుడు కేవలం కొందరితోనే క్లోజ్‌గా ఉంటూ ఎంటర్‌టైన్మెంట్ ఇవ్వడం కూడా ఆపేసిందని అన్నాడు. హరితేజ వచ్చి రోహిణి పేరు చెప్పి తను స్వాతంత్ర్యంగా ఆడడం లేదని, ఎప్పుడూ ఎవరో ఒకరి సాయంతోనే ముందుకెళ్తుందని చెప్పింది. గౌతమ్ వచ్చి పృథ్వి పేరు చెప్పాడు. వేరే కంటెస్టెంట్స్‌ను ప్రభావితం చేసేలా మాట్లాడతాడని, ఇంకా చాలా కారణాలు ఉన్నాయని అన్నాడు. యష్మీ వచ్చి కూడా రోహిణి పేరే చెప్పింది.


కంటెస్టెంట్స్‌పై కంప్లైంట్స్

అవినాష్ వచ్చి అనూహ్యంగా హరితేజను వరస్ట్ ప్లేయర్ అన్నాడు. రోహిణి వచ్చి యష్మీ పేరు చెప్పింది. ఆమె మాటల విషయంలోనే స్ట్రాంగ్‌గా ఉందని, ఆటల విషయంలో చాలా వీక్ అని స్టేట్‌మెంట్ ఇచ్చింది. ప్రేరణ వచ్చి విష్ణుప్రియా పేరు చెప్పింది. మొహం మీద కొట్టినట్టు మాట్లాడుతుందని తనపై కంప్లైంట్ చేసింది. తనలో నచ్చని లక్షణాల గురించి పెద్ద లిస్టే చెప్పింది. టేస్టీ తేజ వచ్చి పృథ్వి పేరు చెప్పాడు. టాస్కుల విషయంలో మాత్రమే తను ముందుంటాడని, మిగతా విషయాల్లో తను అంత యాక్టివ్ కాదని అన్నాడు. గంగవ్వ వచ్చి కూడా యష్మీ పేరే చెప్పింది. టాస్కుల సమయంలో యష్మీ ప్రవర్తన అస్సలు కరెక్ట్ కాదని తనపై సీరియస్ అయ్యింది.

తేజ కన్నీళ్లు

వరస్ట్ ప్లేయర్ గురించి చెప్పమనగా నిఖిల్, విష్ణుప్రియా, పృథ్వి.. టేస్టీ తేజ పేరే చెప్పారు. అలా టేస్టీ తేజకు వరస్ట్ ప్లేయర్‌గా మెజారిటీ ఓట్లు పడ్డాయి. అయితే తనకు ఎవరు ఓట్లు వేశారో చెప్పకుండా టేస్టీ తేజకు పనిష్మెంట్ ఇచ్చారు నాగార్జున. ఈసారి జరిగే ఫ్యామిలీ వీక్‌లో తన ఫ్యామిలీ బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ లేదన్నారు. దీంతో తేజకు వెంటనే కళ్లల్లో నుండి నీళ్లు వచ్చాయి. అది వినగానే రోహిణి కూడా ఫీలయ్యింది. తన ఫ్యామిలీ రాకపోయినా తేజ ఫ్యామిలీ వచ్చేలా చూడండి అని నాగ్‌ను రిక్వెస్ట్ చేస్తాను అంది. అయినా తేజ ఒప్పుకోలేదు. ఇక ఎవిక్షన్ షీల్డ్ టాస్కును సరిగ్గా పూర్తి చేయనందుకు వచ్చేవారం తను మెగా చీఫ్ కంటెండర్ అయ్యే ఛాన్స్ లేదని కూడా నాగార్జున ప్రకటించారు.

Related News

Monal Gajjar : బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గుర్తుందా.? ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Big Stories

×