OTT Movie : మలయాళం ఇండస్ట్రీ నుంచి ఎన్నో సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటిలో చాలావరకు సక్సెస్ అవుతున్నాయి కూడా. కథని సింపుల్ గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడంలో మలయాళం దర్శకులు సక్సెస్ అవుతున్నారు. వీటిలో ఒక కుటుంబ కధా చిత్రం థియేటర్లలో మంచి విజయం సాధించి ప్రస్తుతం ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ పేరేమిటో? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.
మనోరమ మ్యాక్స్ (Manorama Max)
ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ పేరు “నాదన్న సంభవం” (Nadanna Sambhavam). ఒక కుటుంబం కొత్తగా ఒక కాలనీకి వచ్చిన తరువాత ఆ ఇంటిలోని వ్యక్తికి అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువ అవటంతో, అతని మీద కక్ష కట్టిన ఆ కాలనీవాసులు ఏం చేశారనే దాని చుట్టూ కథ నడుస్తుంది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ “మనోరమ మ్యాక్స్” (Manorama Max) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే
అజిత్, ధన్య భార్య భర్తలు ఒక కాలనీలో నివాసం ఉంటారు. ఒకరోజు అజిత్ పుట్టినరోజు కావడంతో ఫంక్షన్ ఏర్పాటు చేస్తారు. ఆ ఫంక్షన్ లో అజిత్ భార్య దన్య చాలా డల్ గా ఉంటుంది. ఆమె భర్త తనని సరిగ్గా చూ సుకోకపోవడం వల్ల ఆమె డిప్రెషన్ లో ఉంటుంది. ఆ తరువాత అదే కాలనీకి ఉన్ని, రోసి అనే భార్యాభర్తలు కొత్తగా వస్తారు. వీరి ఇంటి ఎదురుగానే అజిత్ వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది. ఉన్ని ఒక సబ్ మైరన్ షిప్ లో జాబ్ చేస్తూ, ఆరు నెలలు ఇంటిదగ్గర ఆరు నెలలు డ్యూటీలో ఉంటాడు. ఉన్ని భార్య రోసి కాలేజీ లెక్చరర్ గా డ్యూటీ కి వెళ్ళిపోతూ ఉంటుంది. మిగతా ఖాళీ టైమ్ అంతా ఇంటి దగ్గరే ఉంటాడు. అతడు హ్యాండ్సమ్ గా ఉండటంతో అమ్మాయిలు ఎక్కువగా అతనితో మాట్లాడుతూ ఉంటారు. ఈ విషయం ఆ కాలనీలో అజిత్ తో సహా కొంతమందికి నచ్చదు. ఒకసారి అజిత్ భార్య ఉన్నితో మాట్లాడుతుండగా ఒక వ్యక్తి వీడియో తీసి దాన్ని అజిత్ కి చూపిస్తాడు.
అతనిని ఎలాగైనా కాలనీ నుంచి వెళ్ళగొట్టాలని అజిత్ తో సహా కొంతమంది కాలనీవాసులు అనుకుంటారు. ఇదే క్రమంలో ఆ ఇంటికి ఒక అమ్మాయి బుక్స్ అమ్ముకుంటూ వచ్చి వాష్ రూమ్ యూస్ చేసుకుంటానని ఉన్నిని అడుగుతుంది. ఉన్ని ఆమె బాధను అర్థం చేసుకొని ఇంటిలోని వాష్ రూమ్ ని యూస్ చేసుకోమంటాడు. ఇదే మంచి సమయమని ఆమెతో సంభంధం అంటగట్టి అతనిని ఆ కాలనీలో కొంతమంది కొడతారు. ఈ విషయం మీద అతను పోలీసులకు కంప్లైంట్ చేస్తాడు. పోలీసుల విచారణలో కొన్ని విషయాలు బయటపడతాయి. పోలీసులు బయటపెట్టిన విషయాలు ఏంటి? హీరో నిజంగానే తప్పు చేశాడా? అజిత్ భార్య డిప్రెషన్ లో నుండి బయటకు వస్తుందా? ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే మనోరమ మ్యాక్స్ (Manorama Max) లో స్ట్రీమింగ్ అవుతున్న “నాదన్న సంభవం” (Nadanna Sambhavam) ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీని తప్పకుండా చూడండి.