Suriya: పేరుకి తమిళ నటుడు అయినా కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది సూర్యకి. సూర్య చేసిన ఎన్నో సినిమాలు తెలుగులో మంచి ఆదరణను పొందాయి. గజిని, సూర్య సన్నాఫ్ కృష్ణన్, శివ పుత్రుడు, నువ్వు నేను ప్రేమ, వీడొక్కడే, ఆకాశం నీ హద్దురా అంటే ఎన్నో సినిమాలను తెలుగు ప్రేక్షకులు విపరీతంగా ఆదరించారు. ఇక ప్రస్తుతం కంగువ సినిమాతో తెలుగు ప్రేక్షకులు ముందుకు రానున్నాడు సూర్య. నవంబర్ 14న కంగువ సినిమా విడుదల కానుంది. ఈ తరుణంలో ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులో నిర్వహించారు. ఈ ఈవెంట్ కి దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి,బోయపాటి శ్రీను (Boyapati Srinu) లతో పాటు యంగ్ హీరోస్ సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్సేన్ హాజరయ్యారు.
ఎస్ ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలామంది దర్శకులుగా ఎంట్రీ ఇచ్చి తమ ప్రతిభను చూపించారు. కానీ తెలుగు సినిమాకి ఒక గౌరవాన్ని తీసుకొచ్చి తెలుగు సినిమాని శిఖరం మీద కూర్చుని పెట్టిన ఘనత మాత్రం ఎస్ఎస్ రాజమౌళికి చెందుతుంది. రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి సినిమాతో తెలుగు సినిమా సత్తా ఏంటి అని చాలామందికి తెలిసి వచ్చింది. ఇక ట్రిపుల్ ఆర్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడో ఉన్న ఆస్కార్ అవార్డు కూడా సొంతం చేసుకున్న ఘనత ఆర్ఆర్ఆర్ సినిమాకి ఉంది. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో పనిచేయాలని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. అయితే రాజమౌళి అవకాశం ఇస్తే నో చెప్పిన హీరో కూడా ఉన్నారు అతను మరి ఎవరో కాదు సూర్య.
Also Read : Vishwak Sen at Kanguva Movie Pre-release Event: గజిని సినిమా చూసి గుండు కొట్టించుకున్నా
ఎస్ ఎస్ రాజమౌళి (SS rajamouli) దర్శకత్వంలో వచ్చిన మగధీర (magadheera) సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాతో రామ్ చరణ్ ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ రికార్డు క్రియేట్ చేశాడు. చరణ్ కెరీర్ కి ఈ సినిమా బిగ్గెస్ట్ ప్లస్ అయింది. అయితే ఈ సినిమాను మొదట సూర్యతో చేద్దామని అనుకున్నారు రాజమౌళి. ఆ టైంలో సూర్యకి కూడా చెప్పారు కానీ కొన్ని కారణాల వలన సూర్య ఈ సినిమా చేయలేకపోయారు. అయితే ఇదే విషయాన్ని రామ్ చరణ్ కూడా ఒక వేడుకలో అసలైన మగధీర నేను కాదు అది సూర్య చేయాల్సిన సినిమా అంటూ చెప్పాడు. రీసెంట్ గా సూర్య కూడా ఈ సినిమా గురించి ఓపెన్ అయ్యాడు. రాజమౌళితో కంగువ ఈవెంట్ మాట్లాడుతూ.. సార్ నేను సిగ్గు లేకుండా చెబుతున్నాను, మన జర్నీ ఎప్పుడో స్టార్ట్ అవ్వాల్సి ఉంది. కానీ నేను ట్రైన్ మిస్ అయ్యాను. కానీ నేను ఇప్పటికీ అదే ప్లాట్ఫారం మీద వెయిట్ చేస్తున్నాను ఏదో ఒక రోజు నేను పొందుకుంటాను అంటూ చెప్పాడు. ఇక సూర్య మిస్ అయిన సినిమా ఏంటి అని అందరూ ఆరాలు తీయడం మొదలుపెట్టారు. అయితే ఇది మగధీర సినిమాని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.