Bigg Boss 8 Telugu Latest Episode Highlights: బిగ్ బాస్ 8లో ఈవారం ప్రారంభం అయినప్పటి నుండి కంటెస్టెంట్స్.. ప్రేక్షకులకు ఓటు అప్పీల్ చేసుకుంటున్నారు. ఈ ఓటు అప్పీల్ కోసం ప్రతీరోజు రెండు టాస్కులు జరుగుతున్నాయి. ఆ రెండు టాస్కుల్లో గెలిచిన కంటెస్టెంట్స్ కలిసి మూడో టాస్క్ ఆడిన తర్వాత ఎవరు గెలిస్తే వారు ఓటు అప్పీల్ చేసుకునే అవకాశం లభిస్తుంది. అలా తాజాగా ప్రసారమయిన ఎపిసోడ్‌లో మొదటి టాస్క్‌లో రోహిణి గెలిచింది. అది కూడా అవినాష్ చేసిన త్యాగం వల్ల గెలిచింది. తనే సంచాలకురాలిగా రెండో టాస్క్ మొదలయ్యింది. కానీ తన కన్ఫ్యూజన్ వల్లే పలువురు కంటెస్టెంట్స్‌కు అన్యాయం కూడా జరిగింది. సంచాలకురాలిగా రోహిణి టాస్క్ రూల్స్ అర్థం చేసుకోలేకపోయింది.
డౌట్ మొదలు
సెకండ్ టాస్క్‌లో ప్రతీ కంటెస్టెంట్.. ఒక రాడ్‌పై కొన్ని ప్లాంక్స్ పేర్చి చివర్లో ఒక కంటెస్టెంట్ ఫోటో పెట్టి ఆ ప్లాంక్స్‌తో పాటు ఫోటోను కింద పడేయాల్సి ఉంటుంది. ముందుగా ఈ టాస్క్‌ను అవినాష్ పూర్తిచేశాడు. అలా ఒకరి తర్వాత ఒకరుగా ఈ టాస్క్‌ను పూర్తిచేశారు. కానీ నబీల్ ఫోటో మాత్రమే కింద పడకుండా ఉంది. దీంతో నబీల్‌ను విన్నర్ అని ప్రకటించింది రోహిణి. అయినా కూడా అందరూ రూల్స్ ప్రకారమే గేమ్ ఆడారని అనుకుంటున్నారా అంటూ రోహిణిని ప్రశ్నించారు బిగ్ బాస్. దీంతో రోహిణికి డౌట్ వచ్చింది. రూల్స్‌ను మరోసారి చదివి చూసినప్పుడు నబీల్ కూడా విన్నర్ కాదని, అసలు కంటెస్టెంట్స్ ఎవరూ సరిగా ఆడలేదని అర్థమయ్యింది. దీంతో కన్ఫ్యూజన్ మొదలయ్యింది.
Also Read: బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే ఎప్పుడు? గెస్టులు ఎవరంటే?
విన్నర్ ఎవరంటే?
రూల్స్ ప్రకారం చూస్తే విష్ణుప్రియా, ప్రేరణ మాత్రమే కరెక్ట్‌గా ఆడారని రోహిణికి అర్థమయ్యింది. అందుకే ముందుగా ప్రేరణను విన్నర్‌గా ప్రకటించాలని అనుకుంది. కానీ అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాత విష్ణుప్రియా విన్నర్ అని ప్రకటించింది. అయితే టాస్క్ సరిగ్గా ఆడలేదు, అయినా విన్నర్ అవ్వాలనుకున్నాడంటూ నబీల్ గురించి నెగిటివ్‌గా మాట్లాడడం మొదలుపెట్టింది ప్రేరణ. సంచాలకురాలు కూడా తన ఆటతీరు తప్పు అని చెప్పలేదని, చెప్తే అప్పుడే సరి చేసుకునేవాడిని అన్నాడు నబీల్. అలా ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. అనవసరంగా నబీల్‌ను రెచ్చగొట్టి తనకు కోపం తెప్పించాలనుకుంది ప్రేరణ. దీంతో ప్రేరణకు దండం పెట్టి గొడవకు ఫుల్ స్టాప్ పెట్టాడు నబీల్.
సపోర్ట్‌తో గెలిచింది
చివరికి రోహిణి, విష్ణుప్రియా ఓటు అప్పీల్‌కు మరో అడుగు దూరంలో ఉన్నారు. కంటెస్టెంట్స్‌లో ఎవరికి అయితే ఎక్కువ మద్దతు లభిస్తుందో వారే ఓటు అప్పీల్ చేసే అవకాశం పొందుతారని బిగ్ బాస్ తెలిపారు. దీంతో తనకు సపోర్ట్ చేయమని కోరుతూ.. సంచాలకురాలిగా రోహిణి చేసిన తప్పును అందరికీ గుర్తుచేసింది విష్ణుప్రియా. తను చెప్పిన విషయాన్ని పక్కన పెడితే అవినాష్ తప్పా మిగతా అందరూ విష్ణుప్రియాకే సపోర్ట్ చేశారు. సంచాలకురాలిగా తప్పు చేశాననే విషయం ప్రస్తావించకపోతే బాగుండేది అని రోహిణి ఫీలయ్యింది. దానికి విష్ణు సారీ కూడా చెప్పింది. మొత్తానికి ప్రేక్షకులకు ఓటు అప్పీల్ చేసుకున్న విష్ణుప్రియా.. బిగ్ బాస్ తెలుగు హిస్టరీలోనే విన్ అయిన మొదటి ఫీమేల్ కంటెస్టెంట్ అవ్వాలని ఉందని కోరికను బయటపెట్టింది.