Bigg Boss 8 Telugu Latest Promo: బిగ్ బాస్ సీజన్ 8లో మూడోవారం ముందుగా రేషన్ టాస్కులతో మొదలయ్యింది. కొత్తగా చీఫ్ అయిన అభయ్, పాత చీఫ్ అయిన నిఖిల్.. తమ టీమ్స్‌తో కలిసి రేషన్ కోసం టాస్కులు ఆడడం మొదలుపెట్టారు. మొత్తానికి ఈ రెండు టీమ్స్‌లో నిఖిల్ టీమే ఎక్కువ టాస్కులు విన్ అవ్వడంతో వారికి ఎక్కువ రేషన్ లభించింది. వారితో పోలిస్తే అభయ్ టీమ్‌కు కాస్త తక్కువ రేషన్ లభించింది. ఆ తర్వాత హౌస్‌లో కిచెన్ ఉపయోగించడం కోసం కొత్త రూల్స్‌ను ప్రవేశపెట్టాడు బిగ్ బాస్. రోజుకు కేవలం 14 గంటలు మాత్రమే కిచెన్‌ను ఉపయోగించుకోవచ్చని తెలిపాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేదానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది.
కిచెన్ రూల్స్
‘ఇంటి కిచెన్‌లో ఇప్పటినుండి ఒక కొత్త రూల్ వచ్చింది. కిచెన్‌లో ఒక సమయంలో ఒక టీమ్ సభ్యులు మాత్రమే వంట చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఒక టీమ్ వంట చేస్తున్న సమయంలో ఆ టీమ్ నుండి కేవలం ముగ్గురు సభ్యులు మాత్రమే కిచెన్‌లో ఉండాల్సి ఉంటుంది. కిచెన్ అందుబాటులో ఉన్న సమయంలో మీరు కూరగాయలు కోయడం కూడా పరిగణనలోకి తీసుకోబడుతుంది’ అంటూ బిగ్ బాస్ ఇచ్చిన ఆదేశాలను సీత చదవడంతో ప్రోమో మొదలవుతుంది. ఇప్పటికే కిచెన్ ఉపయోగించడం కోసం ఒక టైమ్ లిమిట్‌ను ఇచ్చాడు బిగ్ బాస్. ఇంతలోనే మళ్లీ ఇన్ని రూల్స్ పెట్టడంతో అభయ్‌కు నచ్చలేదు. దీంతో బిగ్ బాస్‌పై సీరియస్ అయ్యాడు.
Also Read: విష్ణుప్రియాతో ప్రేరణ ‘దోశ’ గొడవ.. మణికంఠ తలకు గాయం
తినాలా? వద్దా?
‘‘ఈ రూల్స్ రాసేవారు మనిషి పుట్టుక పుట్టారా లేదా నాకు అర్థం కావడం లేదు. అంతమందికి ముగ్గురే ఎలా వండుతారు? మైండ్ లేదు. తినడానికి టాస్కులు పెడుతున్నాడా? తినకుండా ఉండడానికి టాస్కులు పెడుతున్నాడా?’’ అంటూ కోపంగా అక్కడి నుండి లేచి వెళ్లిపోయాడు. ఇక ఇటీవల ప్రసారమయిన ఎపిసోడ్‌లో ఇరు టీమ్ సభ్యులు ఎగ్స్ టాస్క్ ఆడారు. సమయానుసారం హౌస్‌లోకి ఎగ్స్ వస్తుండగా వాటిని దక్కించుకొని కాపాడుకోవాలి. ఆ సమయంలో నిఖిల్ టీమ్ విచక్షణ లేకుండా ఆడి తాము గాయాలు చేసుకోవడమే కాకుండా ఇతర టీమ్ సభ్యులకు కూడా గాయాలు అయ్యేలా చేసింది. ఇప్పుడు వారి దగ్గర ఉన్న గుడ్ల సంఖ్య పెంచుకోవడం కోసం బిగ్ బాస్ మరొక అవకాశం ఇచ్చారు.
ఎర్ర గుడ్డు
‘మీ ఇరు టీమ్స్‌కు గుడ్ల సంఖ్య పెంచుకోవడానికి బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ మూవింగ్ ప్లాట్‌ఫార్మ్’ అంటూ ప్రోమోలో టాస్క్ గురించి వివరించారు బిగ్ బాస్. ‘ప్లాట్‌ఫార్మ్‌లో ఉన్న బాల్స్‌ను బ్యాలెన్స్ చేసుకుంటూ చాకచక్యంగా పోల్స్‌లో వేయాల్సి ఉంటుంది’ అని తెలిపారు. ఇక ఈ టాస్క్‌ను ఆడడం కోసం చీఫ్ అభయ్ రంగంలోకి దిగగా.. తనకు పోటీగా నిఖిల్ టీమ్ నుండి నైనికా ముందుకొచ్చింది. ఈ టాస్క్‌కు పృథ్వి సంచాలకుడిగా వ్యవహరించాడు. మొత్తానికి నైనికానే ఈ టాస్క్‌లో ఎక్కువ సంఖ్యలో గుడ్లను గెలుచుకున్నట్టు ప్రోమో చూస్తే తెలుస్తోంది. ఇక ఈ ప్రోమో చివర్లో ఒక ఎర్ర గుడ్డు గార్డెన్ ఏరియాలో పడింది కానీ దానిని ఎవరూ గమనించలేదు.