Bigg Boss 8 Telugu Latest Updates: బిగ్ బాస్ సీజన్ 8లో అభయ్ కొత్తగా చీఫ్ అయ్యాడు. నిఖిల్ ముందు నుండి చీఫ్‌గా ఉన్నాడు. వీరిద్దరి మధ్య రేషన్ కోసం గొడవ మొదలయ్యింది. రేషన్ కోసం ఇచ్చిన మొదటి టాస్కులో అభయ్ టీమ్ గెలవగా.. రెండో టాస్కులో నిఖిల్ టీమ్ గెలిచింది. మూడో టాస్కులో సోనియా సంచాలకురాలిగా వ్యవహరించి అందరిలో కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేసింది. దీంతో అభయ్ టీమ్ గెలవలేదనే కోపంతో నిఖిల్ టీమ్‌కు చెందిన వారికోసం ఎలాంటి పని చేయకూడదు అని ఫిక్స్ అయ్యింది. కిచెన్‌లో కూడా వారికి సాయం చేయకూడదని నిర్ణయం తీసుకుంది. దీంతో ఇరు టీమ్స్ మధ్య గొడవతో బుధవారం ఎపిసోడ్ స్టార్ట్ అయ్యింది.
Also Read: మా ఆవిడ అలా తిట్టింది, వచ్చేవారం కచ్చితంగా ఎలిమినేట్ అయ్యేది తనే.. శేఖర్ భాషా వ్యాఖ్యలు
కాంప్రమైజ్
అభయ్.. తన టీమ్ సభ్యులను ఇతర టీమ్‌కు ఎలాంటి సాయం చేయకూడదని చెప్పిన తర్వాత విష్ణుప్రియా వచ్చి మణికంఠను దోశ చేయమని, ఆకలేస్తుందని అడిగింది. అప్పుడే ప్రేరణ కిచెన్ దగ్గరకు వచ్చింది. దీంతో విష్ణుప్రియాకు దోశ చేసి ఇవ్వమని ప్రేరణకు చెప్పాడు మణి. కానీ ప్రేరణ ఇష్టం లేనట్టుగా విష్ణుప్రియా ప్లేట్‌లో దోశ వేసింది. అది నచ్చన విష్ణుప్రియా ఏడ్చింది. దీంతో అందరూ వచ్చి అసలు ఏమైంది అని మణిని అడగగా.. తను అంతా వివరించాడు. అలా చేయడం కరెక్ట్ కాదంటూ ప్రేరణను అన్నాడు. కానీ తెలిసో తెలియకో మణికంఠ వల్ల గొడవ పెద్దగా అయ్యింది. తర్వాత విష్ణుప్రియా, ప్రేరణ కాంప్రమైజ్ అయినా కూడా మణిపై మాత్రం సీరియస్ అయ్యింది.
వేస్ట్ ఫెలో
నీవల్లే ఇదంతా జరిగింది అంటూ మణికంఠ దగ్గరకు వచ్చి స్టేట్‌మెంట్ ఇచ్చింది ప్రేరణ. అది ఒప్పుకోని మణి తనతో గొడవపడడం మొదలుపెట్టాడు. పోరా, వేస్ట్ ఫెలో అంటూ నోటికొచ్చింది తిట్టింది. అలా మాట్లాడడం విన్న మిగతా హౌస్‌మేట్స్ కూడా షాకయ్యారు. అలా మణికంఠను ప్రేరణ టార్గెట్ చేసినట్టు కొందరు ప్రేక్షకులు ఫీలవుతున్నారు. కానీ మొదటి వారంలో ఉన్నట్టుగా మణికంఠ ఇప్పుడు లేడని, చాలా మార్పులు వచ్చాయని అనుకుంటున్నారు. మొత్తానికి నిఖిల్ టీమ్ రేషన్ టాస్క్ గెలిచి ఎక్కువ రేషన్‌ను సంపాదించుకుంది. అభయ్ టీమ్ కూడా వారిని వీలైనంత రేషన్‌ను దక్కించుకోగలిగింది. అంతే కాకుండా కిచెన్‌కు టైమ్ లిమిట్ ఇచ్చాడు బిగ్ బాస్. ఒకరోజులో కేవలం 14 గంటలు మాత్రమే కిచెన్‌ను ఉపయోగించే అవకాశం ఉంటుందని టైమర్‌ను పెట్టాడు.
ఆవేశంలో బూతులు
బుధవారం ప్రసారమయిన ఎపిసోడ్‌లో అభయ్, నిఖిల్ టీమ్స్ కలిసి స్పెషల్ టాస్క్ కూడా ఆడాయి. అందులో గార్డెన్ ఏరియాలో పెట్టిన కోడిపెట్ట బొమ్మలో నుండి సమయానుసారం గుడ్లు వస్తుంటాయి. అది హౌస్‌మేట్స్ తీసుకొని కాపాడుకోవాలి. ఆ సమయంలో ఇరు టీమ్స్ మధ్య చాలా గొడవలు జరిగాయి. ముఖ్యంగా పృథ్వి అయితే అవతలి టీమ్‌కు చెందిన సభ్యులపై దాడికి కూడా ఎగబడ్డాడు. ఆవేశంలో బూతులు కూడా మాట్లాడాడు. అదే ఆవేశంలో నిఖిల్ వల్ల మణికంఠ తలకు గాయమయ్యింది. దీంతో మణి గేమ్‌లో ఉండడానికి అభయ్ ఒప్పుకోలేదు. కానీ బిగ్ బాస్ గెలిస్తేనే తన పెళ్లాం, బిడ్డ తన దగ్గరకు వస్తారని మరోసారి ఎమోషనల్ అయ్యాడు మణికంఠ.