BigTV English

Deepika Padukone: గారాల పట్టికి దీపికా ఫస్ట్ గిఫ్ట్… ఏం కొనిపెట్టిందో తెలుసా?

Deepika Padukone: గారాల పట్టికి దీపికా ఫస్ట్ గిఫ్ట్… ఏం కొనిపెట్టిందో తెలుసా?

Deepika Padukone : బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొణె – రణ్‌వీర్ సింగ్ ఇటీవలే తమ మొదటి బిడ్డకు తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. ఈ ఆనందంలో దీపికా తన పాపకు ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చింది. అది ఏదో టాయ్ అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే. ఏకంగా ఒక లగ్జరీ ఇంటినే తన కూతురి కోసం కొనేసింది దీపికా. మరి ఆ ఇంటికి సంబంధించిన విశేషాలు ఏంటో ఒక లుక్కేద్దాం పదండి.


కోట్ల విలువైన అపార్ట్మెంట్ గిఫ్ట్ గా.. 

గత కొన్నేళ్ళ నుంచి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న దీపికా పడుకొనే ఆ రేసుకు ఫుల్ స్టాప్ పెట్టి తాజాగా తన జీవితంలో ఒక సంతోషకరమైన కొత్త అధ్యాయాన్ని మొదలు పెట్టింది. ఈ జంట తమ మొదటి బిడ్డను 2024 సెప్టెంబర్ 8న ముంబైలోని హెచ్‌ఎన్ రిలయన్స్ హాస్పిటల్‌లో స్వాగతించారు. ఇక తల్లికూతురు ఇద్దరూ ఆరోగ్యంగా ఇంటికి కూడా తిరిగొచ్చారు. అయితే కరెక్ట్ గా కూతురుని తీసుకుని ఇంటికొచ్చిన వారం రోజుల లోపే దీపికా ఒక లగ్జరీ అపార్ట్మెంట్ ను కొనుగోలు చేసినట్టు సమాచారం.  దీపికా పదుకొణె యొక్క కంపెనీ కేఏ ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్పి ముంబైలోని పాష్ ఏరియా బాంద్రాలో ₹17.8 కోట్లతో విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ను ఇటీవల కొనుగోలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. తన కూతురితో కలిసి సంతోషంగా ఉండడానికే ఆమె ఈ స్పెషియస్ అపార్ట్మెంట్ ను కొనుగోలు చేసిందని చెబుతున్నారు.


Deepika Padukone's pic holding her 'newborn babygirl' in hospital goes viral, here's the real story

రియల్ ఎస్టేట్ పెట్టుబడుల్లో ముందున్న బీ టౌన్

అయితే దీపికా ఈ వ్యూహాత్మక పెట్టుబడి బాలీవుడ్ ప్రముఖులు హై ఎండ్ రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తిని చూపిస్తున్నారు అనడానికి నిదర్శనం. కొంతకాలం క్రితం అమితాబ్, ఆయన తనయుడు కూడా భారీగా రియల్ ఎస్టేట్ లఓ పెట్టుబడులు పెట్టారు. కాగా ప్రస్తుతం దీపికా కొన్న అపార్ట్‌మెంట్ సాగర్ రేషమ్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో ఉంది. ఐకానిక్ బ్యాండ్‌స్టాండ్ సమీపంలో ప్రీమియం సౌకర్యాలు ఉన్న సెలబ్రిటీల ఏరియా. సుమారు 1,846 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ కొత్త అపార్ట్‌మెంట్ విశాలమైన స్పేస్ తో పాటు పార్కింగ్ స్పాట్‌తో వస్తుంది. ఈ డీల్‌కు దాదాపు ₹1.07 కోట్ల స్టాంప్ డ్యూటీ, ₹30,000 రిజిస్ట్రేషన్ ఫీజులతో సహా అదనపు ఖర్చులు పెట్టారట దీపికా దంపతులు. ఇక దీపికా కుటుంబం రీసెంట్ గా మరో అపార్ట్మెంట్ ను కూడా కొన్నారు. దీపిక అత్తగారు అంజు భవ్నానీ కూడా అదే రోజున ₹19.13 కోట్లకు పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌ని కొనుగోలు చేశారు. ఈ అపార్ట్మెంట్ 1,822.45 చదరపు అడుగుల విస్తీర్ణంలో, అన్ని సౌకర్యాలను కలిగి ఉంది,

కాగా దీపికా ప్రస్తుతం సినిమాలను పక్కన పెట్టేసి పూర్తిగా  కూతురితో టైమ్ స్పెండ్ చేయాలని ఆలోచిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఆమె ఆయా లేకుండానే స్వయంగా తన కూతురిని పెంచబోతున్నట్టు టాక్ నడుస్తోంది. కాగా చివరగా దీపికా కల్కి 2898 ఏడీ మూవీలో కన్పించింది. త్వరలోనే దీపికా నటించిన సింగం అగైన్ కూడా రిలీజ్ కానుంది.

Related News

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big TV Kissik Talks : ఆ హీరోయిన్ కారుతో గుద్దింది, నేను చాలా పోగొట్టుకున్నాను 

Big TV Kissik Talks: తిండి లేకుండా బస్టాండ్ లో పడుకున్నాం – జబర్దస్త్ సౌమ్య రావు

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Big Stories

×