BigTV English

Bigg Boss 8 Telugu Promo: మళ్లీ అదే గేమ్, అదే స్ట్రాటజీ.. ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు నిఖిల్?

Bigg Boss 8 Telugu Promo: మళ్లీ అదే గేమ్, అదే స్ట్రాటజీ.. ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు నిఖిల్?

Bigg Boss 8 Telugu Latest Promo: బిగ్ బాస్ రియాలిటీ షో ఒక సీజన్‌లో జరిగిన టాస్కులే దాదాపుగా మరొక సీజన్‌లో కూడా రిపీట్ అవుతుంటాయి. అయితే ఇప్పటివరకు బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చిన కంటెస్టెంట్స్‌కు ఆ టాస్కులు కొత్త కాబట్టి వారి స్టైల్‌లో దానిని ఆడేవారు. కానీ బిగ్ బాస్ 8లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా వచ్చిన ఎనిమిది మంది పాత కంటెస్టెంట్సే. అంటే మునుపటి సీజన్స్‌లో వారంతా ఈ టాస్కులనే ఆడే ఉంటారు. అదే ఇప్పుడు వారికి పెద్ద ప్లస్ కాబోతోంది. తాజాగా ఓవర్ స్మార్ట్ ఫోన్స్ వర్సెస్ సూపర్ ఛార్జర్స్ అనే టాస్క్ జరిగింది. ఈ టాస్క్‌ను ఆల్రెడీ మునుపటి సీజన్‌లో ఆడిన ఎక్స్‌పీరియన్స్‌తో రంగంలోకి దిగారు అవినాష్, మెహబూబ్. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది.


భలే గుర్తుందే

‘‘ఇది 2050. ఇప్పుడు ప్రపంచమంతా ఓవర్ స్మార్ట్‌గా మారిపోయింది. ఇంతకు ముందు ఆస్తుల కోసం, భూముల కోసం గొడవలు జరిగేవి. ఈ 2025లో ఒకరితో మరొకరు ఛార్జ్ అయ్యేవరకు గొడవ పడడమే ఈ ఓవర్ స్మార్ట్ లోకం నైజం. ఇంటిని ఆధీనంలోకి తీసుకున్న ఓవర్ స్మార్ట్ ఫోన్స్‌గా రాయల్స్ టీమ్. గార్డెన్ ఏరియాను తమ ఆధీనంలోకి తీసుకున్న ఓవర్ స్మార్ట్ ఛార్జర్స్‌గా ఓజీ టీమ్ ఉంటారు. ఓవర్ స్మార్ట్ ఫోన్స్ ఛార్జింగ్ సమయానుసారం తగ్గుతూ వస్తుంది’’ అని టాస్క్ గురించి బిగ్ బాస్ వివరించడంతో ప్రోమో మొదలవుతుంది. అప్పుడే మెహబూబ్, అవినాష్.. మునుపటి సీజన్స్‌లో ఈ టాస్క్ ఆడాలనే విషయం నిఖిల్‌కు గుర్తొచ్చింది. ‘‘అప్పుడు వాళ్లు ఏం చేశారంటే డోర్ లాక్ చేసి ఒక అమ్మాయితో అందరూ ఛార్జింగ్ పెట్టుకొని గేమ్ గెలిచారు’’ అని అందరికీ వివరించాడు.


Also Read: ఎంటర్టైన్మెంట్ హౌస్ ని కాస్త కమ్యూనిటీ హౌస్ గా మార్చేశారు కదరా..!

మంచి డీల్

బిగ్ బాస్ హౌస్ మొత్తం రాయల్స్ టీమ్ ఆధీనంలో ఉంటుంది కాబట్టి ముందే ఓజీ టీమ్‌కు ఫుడ్ ఉండదు అని చెప్పేద్దామని మెహబూబ్.. తన స్ట్రాటజీని వివరిస్తాడు. ఆ తర్వాత విష్ణుప్రియా దగ్గరకు వచ్చిన హరితేజ.. ఇద్దరం డీల్ చేసుకుందాం అంటూ బేరం మొదలుపెట్టింది. బాత్రూమ్ కావాలా, ఫుడ్ కావాలా అంటూ విష్ణుకు ఆఫర్లు ఇచ్చింది. రాయల్స్ టీమ్‌కు ఎప్పటికప్పుడు ఛార్జింగ్ తగ్గిపోతుంది ఉంటుంది కాబట్టి వారిని ఛార్జ్ చేసుకోవడం కోసం ఎవరి ప్లాన్స్ వారు అమలు చేయడం మొదలుపెట్టారు. ఇక అవినాష్ అయితే మునుపటి సీజన్‌లో ఏ స్ట్రాటజీ అయితే ఉపయోగించాడో మళ్లీ అదే స్ట్రాటజీ ఉపయోగించి ఛార్జింగ్ పెట్టుకున్నాడు.

అదే ప్లాన్

గార్డెన్ ఏరియాలో కూర్చున్న నబీల్ వెనక్కి వెళ్లి తనకు తెలియకుండానే ఛార్జింగ్ పెట్టుకున్నాడు అవినాష్. కాసేపటి వరకు అలా ఛార్జ్ అవుతూనే ఉన్నాడు. అప్పుడు నిఖిల్ చూసి నబీల్‌కు చెప్పగా తను అలర్ట్ అయ్యాడు. అయితే బిగ్ బాస్ 4లో ఇదే టాస్క్ వచ్చినప్పుడు అమ్మాయిని లాక్ చేసి ఛార్జింగ్ పెట్టుకున్నారని నిఖిల్‌కు గుర్తుంది కానీ అవినాష్.. దొంగతనంగా ఛార్జింగ్ ఎలా పెట్టుకున్నాడో గుర్తులేదా అని ప్రేక్షకులు అనుకుంటున్నారు. అది కూడా గుర్తుండి ఉంటే అందరినీ అలర్ట్ చేయాలి కదా అని ఫీలవుతున్నారు. మొత్తానికి నిఖిల్ ఒక చిన్న లాజిక్ మిస్ అవ్వడం వల్ల నబీల్ దొరికిపోయాడు. ఇక ఈ టాస్క్‌లో ఇరు టీమ్స్ మధ్య గొడవలు కూడా జరిగాయని ప్రోమో చూస్తే అర్థమవుతోంది.

Related News

Bigg Boss 9 : బిగ్ బాస్ 9 అగ్నిపరీక్షలో అభిజీత్ రచ్చ రచ్చ.. వామ్మో, ఇంత జరుగుతోందా?

Big Boss: బిగ్ బాస్ హౌస్‌లోకి పహల్గాం ఉగ్రదాడి బాధితులు!

Bigg Boss 9 Telugu: డబుల్ హౌస్.. డబుల్ డోస్..బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్

Monal Gajjar : బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గుర్తుందా.? ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Big Stories

×