BigTV English

Bigg Boss 8 Telugu Promo: విష్ణుప్రియాకు శేఖర్ భాషా వార్నింగ్.. రెచ్చిపోయిన బేబక్క, ఆ జంతువులతో పోలిక

Bigg Boss 8 Telugu Promo: విష్ణుప్రియాకు శేఖర్ భాషా వార్నింగ్.. రెచ్చిపోయిన బేబక్క, ఆ జంతువులతో పోలిక

Bigg Boss 8 Telugu Latest Promo: బిగ్ బాస్ సీజన్ 8లో మొదటి వీకెండ్ ఎపిసోడ్స్‌లో ఒక ఎపిసోడ్ పూర్తయ్యింది. ఇక మొదటి సండే ఫన్‌డే ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోలు తాజాగా విడుదలయ్యాయి. శనివారం ప్రసారమయిన ఎపిసోడ్స్‌లో కంటెస్టెంట్స్‌ను వారిచేతే జడ్జిమెంట్ చేయించారు నాగార్జున. ఇక సండే మాత్రం పూర్తిగా ఫన్‌డేగా సాగిపోతుంది అనుకుంటే అలా జరగలేదు. ఆ విషయం ప్రోమోలు చూస్తే క్లారిటీ వస్తుంది. ముందుగా విడుదలయిన ప్రోమోలో హౌజ్‌లో అమ్మాయిలను, అబ్బాయిలను రెండు టీమ్స్‌గా విభజించి వారి మధ్య సరదా టాస్కులు పెట్టారు. ఆ తర్వాతే సీరియస్ కథ మొదలయ్యింది. తోటి కంటెస్టెంట్స్‌ను జంతువులతో పోలుస్తూ ఎందుకు పోల్చారో కూడా వివరణ ఇవ్వమన్నారు.


సరదా ఆటలు

ఆదివారం ఎపిసోడ్‌కు సంబంధించి విడుదలయిన మొదటి ప్రోమోలో బిగ్ బాస్ సీజన్ 8లో సండే అంటే ఫన్‌డే మాత్రమే కాదని పే డే కూడా అని నాగార్జున క్లారిటీ ఇచ్చారు. ‘‘అంటే ప్రైజ్ మనీ లేదు. ప్రతీ వారం మీ పర్ఫార్మెన్స్ బట్టి, మీరు ఆడే ఆట బట్టి మీ పే పెరుగుతూ ఉంటుంది’’ అని వివరించారు. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 8కు విన్నర్‌కు ఎంత ప్రైజ్ మనీ రావాలి అనేది కంటెస్టెంట్స్ చేతుల్లోనే ఉంటుంది అని, వారే టాస్కులు ఆడి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసుకొని ప్రైజ్ మనీ విలువను పెంచుకోవాలని బిగ్ బాస్ రివీల్ చేశారు. అదే విషయాన్ని మరోసారి కంటెస్టెంట్స్‌కు గుర్తుచేశారు నాగార్జున. ఆ తర్వాత అమ్మాయిలు, అబ్బాయిలను టీమ్స్‌గా విభజించి సరదా ఆటలు ఆడించారు.


Also Read: బిగ్ బాస్ హౌజ్‌లో సేఫ్ గేమ్.. ఆ ముగ్గురిని బయటికి పంపడం చాలా కష్టం!

మంచి స్ట్రాటజీ

చిరంజీవి, మహేశ్ బాబు సినిమాలను ఆపకుండా చెప్పే ఆటలో అమ్మాయిలనే విజయం సాధించారని ప్రోమో చూస్తే అర్థమవుతోంది. అలా మొదటి ప్రోమో అంత సరాదాగా సాగిపోయింది. కానీ రెండో ప్రోమో మాత్రం సీరియస్ టర్న్ తీసుకుంది. తోటి కంటెస్టెంట్స్‌ను జంతువులతో పోలుస్తూ, అలా ఎందుకు పోల్చారో వివరించమన్నారు నాగార్జున. ముందుగా నిఖిల్ వచ్చి శేఖర్ భాషాను దోమతో పోల్చాడు. తను జోకులు వేసినప్పుడు తలపై నుండి వెళ్లిపోతుందని అన్నాడు. మధ్యలో విష్ణుప్రియా జోక్యం చేసుకొని.. ‘‘నేను తనను నామినేట్ చేసినందుకు పిచ్చి జోక్స్ అన్నీ చెప్పి ఇంకొకసారి నామినేట్ చేస్తావా అని బెదిరిస్తున్నాడు’’ అని శేఖర్ భాషా గురించి నాగ్‌తో ఫిర్యాదు చేసింది.

బేబక్క సీరియస్

ప్రేరణ వచ్చి సీతను తేలుతో పోల్చింది. ‘‘జోక్‌గా తీసుకుంటుంది అన్నది చాలా పర్సనల్‌గా ఫీల్ అయిపోతుంది’’ అని వివరించింది. దీంతో చెత్తకుండి నుండి చెత్త బయటికి తీయడం గురించి మరోసారి ఇద్దరి మధ్య చర్చ మొదలయ్యింది. పృథ్వి వచ్చి ‘‘నిఖిల్‌ను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పారు కానీ తనను తాను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పడం లేదు’’ అని బేబక్క గురించి అన్నాడు. దీంతో బేబక్క మరోసారి రెచ్చిపోయింది. ‘‘ఒకరి బలం ఒకరోజే డిసైడ్ అవ్వదు. అలాంటప్పుడు బిగ్ బాస్ షో 100 రోజలు ఎందుకు? ఒకరోజులోనే చేయండి’’ అని సీరియస్‌గా మాట్లాడింది. తనను ఎవరు ఏమన్నా కూడా శేఖర్ భాషా మాత్రం జోకులు వేస్తూ గడిపేశాడు.

Related News

Bigg Boss 9 Telugu: డబుల్ హౌస్.. డబుల్ డోస్..బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్

Monal Gajjar : బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గుర్తుందా.? ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Big Stories

×