BigTV English
Advertisement

Bigg Boss 8 Telugu Promo: విష్ణుప్రియాకు వరుడు కావలెను.. ప్రైజ్ మనీ విషయంలో బిగ్ బాస్ దిమ్మదిరిగే ట్విస్ట్

Bigg Boss 8 Telugu Promo: విష్ణుప్రియాకు వరుడు కావలెను.. ప్రైజ్ మనీ విషయంలో బిగ్ బాస్ దిమ్మదిరిగే ట్విస్ట్

Bigg Boss 8 Telugu Latest Promo: బిగ్ బాస్ సీజన్ 8లోకి రాయల్స్ అంటూ ఎనిమిది మంది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎంటర్ అయ్యారు. ఇక ఎంటర్ అయినప్పటి నుండే వారితో పోటీ ఉంటుందని మర్చిపోయి కొందరు ఓజీ టీమ్ సభ్యులు వారితో ఫ్రెండ్‌షిప్ చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత జరిగిన నామినేషన్స్‌తో అసలు రాయల్స్.. ఓజీ సభ్యుల గురించి ఏమనుకుంటుంది అనే విషయంపై క్లారిటీ వచ్చింది. ఇక రాయల్స్ ఎంటర్ అవ్వగానే ఓజీలతో టాస్క్ ఆడి ఓడిపోయి.. రేషన్ కంట్రోల్‌ను వారి చేతిలో పెట్టారు. ఇప్పటికీ రేషన్ కంట్రోల్ వారి చేతిలోనే ఉన్నా బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్‌తో కంటెస్టెంట్స్ అందరి మైండ్ బ్లాక్ అయ్యింది.


సున్నుండలాగా ఉన్నావు

గొడవలు లేనంతసేపు ఓజీ, రాయల్స్ అందరూ కలిసి సరదాగానే ఉంటున్నారు. ముఖ్యంగా ఈ యంగ్ కంటెస్టెంట్స్ అంతా గంగవ్వ చుట్టూ చేరి ఫన్ క్రియేట్ చేయడం మొదలుపెట్టారు. ముందుగా విష్ణుప్రియా.. ‘‘మా నాన్నమ్మ నాకోసం ఎన్ని పూజలు చేస్తుందో’’ అని ఫీల్ అయ్యింది. అందుకే త్వరగా పెళ్లి చేసుకోమని, వయసు అయిపోతుందని తనకు గుర్తుచేసింది గంగవ్వ. ‘‘నాకు తగ్గ వీరుడు, శూరుడు, ధీరుడు దిగాలి కదా’’ అని సమాధానమిచ్చింది విష్ణుప్రియా. అది విన్న టేస్టీ తేజ.. నేను శూరుడు, ధీరుడు లాగా లేనా అని అడగగా.. సున్నుండలాగా ఉన్నావంటూ కౌంటర్ ఇచ్చింది విష్ణుప్రియా.


Also Read: మహేశ్‌, నమ్రతతో విభేదాలు… అందుకే మహేష్ మరదలు నుంచి ఆ కామెంట్స్

సూపర్ మార్కెట్ ఓపెన్

విష్ణుప్రియాను ఇంప్రెస్ చేయడం కోసం పుష్ అప్స్ చేశాడు టేస్టీ తేజ. కానీ తన వల్ల కాలేదు. అందుకే మోహబూబ్ వచ్చి సాయం చేశాడు. అది చూసి అందరూ నవ్వుకున్నారు. ఆ తర్వాత కంటెస్టెంట్స్‌కు బిగ్ బాస్ ఒక లేఖ పంపించారు. ఓజీ టీమ్ దగ్గర ఉన్న రేషన్ అంతా స్టోర్ రూమ్‌లో పెట్టేయమని ఆదేశించారు. ఆపై వారితో బీబీ సూపర్ మార్కెట్ ఆటను ఆడించారు. రేషన్ కంట్రోల్ అంతా ఓజీ చేతుల్లోనే ఉండడంతో ఆ టీమ్ నుండే నబీల్, నిఖిల్.. బీబీ సూపర్ మార్కెట్‌లోకి వెళ్లారు. వారికి తోచినంత రేషన్‌ను తీసుకొని వచ్చారు. కానీ బయటికి వచ్చిన తర్వాతే వారు ఒక విషయాన్ని గ్రహించారు.

చికెన్ వద్దు

నబీల్, నిఖిల్ రేషన్ తీసుకొచ్చిన తర్వాత ఎవరెవరికి ఏ వస్తువులు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అనే నిర్ణయాన్ని వారినే తీసుకోమన్నారు. అప్పుడే తను ఉప్పు ప్యాకెట్ తీసుకురాలేదని నబీల్ గ్రహించాడు. వెంటనే ‘‘ఒక్క రిక్వెస్ట్ బిగ్ బాస్. ఒక్క ఉప్పు ప్యాకెట్ కావాలి. ప్లీజ్ బిగ్ బాస్. మీకు పుణ్యం ఉంటుంది’’ అని తను రిక్వెస్ట్ చేయడంతో పాటు ఇతర కంటెస్టెంట్స్‌తో కూడా రిక్వెస్ట్ చేయించాడు. అంతే కాకుండా చికెన్ కూడా త్యాగం చేయడానికి సిద్ధమని చెప్పాడు. అప్పుడే బిగ్ బాస్ దిమ్మదిరిగే ట్విస్ట్ ఇచ్చారు. ‘‘ఉప్పును పొందడానికి మీకొక అవకాశం ఇస్తున్నారు. ఒక్కొక్క ఉప్పు ప్యాకెట్ ధర రూ.50 వేలు’’ అని అన్నారు బిగ్ బాస్. ఆ డబ్బును విన్నర్స్ ప్రైజ్ మనీ నుండి కట్ అవుతాయని తెలిపారు. ప్రస్తుతం కంటెస్టెంట్స్ ప్రైజ్ మనీ ఖాతాలో రూ.37,50,000 ఉండగా కంటెస్టెంట్స్ అంతా ఆలోచనలో పడ్డారు.

Related News

Bigg Boss 9: ఏడుపుగొట్టు చెత్తను బయటకు తోసేయండి, లైవ్ చూడలేకపోతున్నాం

Bigg Boss 9: ఇన్ సెక్యూరిటీ లోకి పోయి గేమ్ పాడు చేసుకుంటున్నా ఇమ్మానియేల్

Bigg Boss 9 Telugu Day 61 : రీతూ బంగారంరా… తనూజాపై అంత కక్షగట్టేశావ్ ఏంటి దివ్య? నక్కతోక తొక్కిన ఇమ్మూ

Bigg Boss 9 Telugu : ఇమ్మూనా మజాకా? బిగ్ బాస్ చరిత్రలోనే బిగ్గెస్ట్ రికార్డ్… కానీ ఆ బుర్ర తక్కువ పనే మైనస్ మావా

Bigg Boss 9: చివరిలో చేజారిన తనూజ కెప్టెన్సీ.. అతడే కొత్త కెప్టెన్!

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ లో ఉండటం ఆ కంటెస్టెంట్ కు ఇష్టం లేదా..? ఈ వారం ఇతనే ఎలిమినేట్..?

Bigg Boss 9 Promo: రీతూ Vs దివ్య.. చిచ్చుపెట్టిన సాయి!

Bigg Boss 9 Telugu : గౌరవ్ కు గట్టిదెబ్బ… ఇదేందయ్యా ఇదీ… కట్టప్ప కన్నా తనూజా – ఇమ్మాన్యుయేల్ వెన్నుపోటే దారుణం

Big Stories

×