BigTV English

Bigg Boss 8 Telugu Promo: హౌస్‌లో నువ్వైనా ఉండాలి, నేనైనా ఉండాలి, వాళ్లను అలా వాడుకుంటున్నావు.. మరోసారి నోరుపారేసుకున్న యష్మీ

Bigg Boss 8 Telugu Promo: హౌస్‌లో నువ్వైనా ఉండాలి, నేనైనా ఉండాలి, వాళ్లను అలా వాడుకుంటున్నావు.. మరోసారి నోరుపారేసుకున్న యష్మీ

Bigg Boss 8 Telugu Latest Promo: బిగ్ బాస్ సీజన్ 8.. 14 మంది కంటెస్టెంట్స్‌తో ప్రారంభమయ్యింది. ఇప్పటికీ మూడు వారాలు పూర్తవ్వడంతో ముగ్గురు కంటెస్టెంట్స్.. హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్లిపోయారు. దీంతో నాలుగో వారం నామినేషన్స్ మరింత ఇంట్రెస్టింగ్‌గా సాగనున్నాయి. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది. విడుదలయిన ప్రోమోలు చూస్తుంటే ఈసారి కంటెస్టెంట్స్ ఎక్కువగా తమ పర్సనల్ గొడవలను, మనస్పర్థలను మనసులో పెట్టుకొనే ఇతర కంటెస్టెంట్స్‌ను నామినేట్ చేస్తున్నారేమో అని ప్రేక్షకుల్లో అనుమానం మొదలయ్యింది. అలా పర్సనల్ విషయాలను మనసులో పెట్టుకొని ఒక కంటెస్టెంట్‌కు సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చింది యష్మీ.


ఎమోషన్స్‌తో ఆట

ముందుగా సీత వచ్చి ప్రేరణను నామినేట్ చేసింది. ‘‘గతవారం నువ్వు నన్ను ఒక పాయింట్ మీద నామినేట్ చేశావు. వేరేవాళ్లను బాధపెట్టే ఎమోషన్ రైట్ ఎలా అవుతుంది? నా ఎమోషన్‌తో స్ట్రాంగ్‌గా ఆడి గెలవడం ఎందుకు తప్పు అవుతుంది? నాకు ఇప్పుడు వివరిస్తే నేను గతవారం నువ్వు చేసిన నామినేషన్‌ను ఒప్పుకుంటాను’’ అని చెప్పుకొచ్చింది. ‘‘నా అభిప్రాయం తప్పని నువ్వు చెప్పలేవు’’ అంటూ సంబంధం లేకుండా మాట్లాడడం మొదలుపెట్టింది ప్రేరణ. ‘‘మరి నా ఎమోషన్ తప్పు అని నువ్వెలా చెప్తావు’’ అని సీత కౌంటర్ ఇచ్చింది. అలా ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. మధ్యలో ప్రేరణ సీరియస్ కూడా అయ్యింది.


Also Read: నామినేషన్ రచ్చ షురూ.. మళ్ళీ అదే పెంట..!

ఇద్దరి సపోర్ట్

ఆ తర్వాత పృథ్వి వచ్చి నబీల్‌ను నామినేట్ చేశాడు. ‘‘నువ్వు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకొని నిన్ను ఎగ్స్ టాస్క్‌లో సంచాలకుడిని చేయలేదు. సంచాలకుడిగా ఫెయిల్ అయ్యావు, పక్షపాతం చూపించావు’’ అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. కానీ పృథ్వి స్టేట్‌మెంట్ నబీల్ ఒప్పుకోలేదు. ఇక గతవారం జరిగిన నామినేషన్స్ ప్రభావం కూడా ఈ నామినేషన్స్‌పై ఉందని స్పష్టంగా అర్థమవుతోంది. గతవారం చీఫ్‌గా యష్మీ కరెక్ట్‌గా లేదంటూ తనను నామినేట్ చేసింది సోనియా. అప్పుడే వచ్చేవారం నామినేషన్స్‌లో సోనియాను నామినేట్ చేయాలని యష్మీ ఫిక్స్ అయ్యింది. అదే చేసింది. ‘‘ఇద్దరి సపోర్ట్ లేకుండా నువ్వు ఆడితే బాగుంటుందేమో అనిపిస్తుంది’’ అంటూ సోనియాను నామినేట్ చేయడానికి కారణం చెప్పింది.

వాళ్లను వాడుకుంటావు

‘‘నేను గేమ్‌లోకి దిగిన తర్వాత ఎవరిని కొడతానో నాకే తెలియదు. కానీ అలా కొట్టకుండా ఉండాలని అనుకున్నాను’’ అని చెప్పింది సోనియా. ‘‘వేరేవాళ్లను ఆయుధాలుగా వాడుకుంటావు కానీ నువ్వు మాత్రం ఆడడానికి ముందుకు రావు’’ అని స్టేట్‌మెంట్ ఇచ్చేసింది యష్మీ. ఆ తర్వాత నాగ మణికంఠను నామినేట్ చేస్తూ.. ‘‘హౌస్‌లోని మిగతావారితో పోలిస్తే నువ్వు శారీరికంగా బలహీనంగా ఉన్నావు’’ అని చెప్పింది. దానికి మణికంఠ ఒప్పుకోలేదు. తాను ఎమోషనల్‌గా వీక్ అయ్యింటే గేమ్‌లో నుండి తీసేసేవారని అన్నాడు. ‘‘గేమ్‌లో నుండి నిన్ను తీసేవరకు నేను నామినేట్ చేస్తూనే ఉంటాను’’ అని అరవడం మొదలుపెట్టింది. ‘‘నువ్వు ఎన్నిసార్లు నామినేట్ చేసినా నేను షోలో ఉంటాను’’ అని మణికంఠ నమ్మకంగా చెప్పగా.. ‘‘ఈ షోలో నువ్వైనా ఉండాలి, నేనైనా ఉండాలి’’ అంటూ వార్నింగ్ ఇచ్చింది యష్మీ.

Related News

Monal Gajjar : బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గుర్తుందా.? ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Big Stories

×