Bigg Boss 8 Telugu Latest Promo: బిగ్ బాస్ సీజన్ 8లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలాగా వచ్చాడు. ఆల్రెడీ సీజన్ 7లో కంటెస్టెంట్‌గా తానేంటో నిరూపించుకున్నాడు గౌతమ్. ఇప్పుడు మరోసారి విన్నర్ అవ్వాలనే ఆశతో బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టాడు. తను హౌస్‌లోకి వచ్చే సమయానికి నిఖిల్.. చాలామంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు. అలా మెల్లగా ఇద్దరి మధ్య పోటీ మొదలయ్యింది. ఆ పోటీ మధ్యలో గొడవలు పెరిగాయి. నిఖిల్‌కు కంటెస్టెంట్స్ అందరి సపోర్ట్ ఉందని తనకు మాత్రం లేదని పదేపదే అంటుంటాడు గౌతమ్. నాగార్జునతో కూడా ఇదే విషయంపై వాదించాడు కూడా. తాజాగా మరోసారి నిఖిల్, గౌతమ్ గొడవపై సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు నాగార్జున.
నామినేషన్స్‌లో గొడవ
‘‘ఈవారం నీ ఆటలో ఏ రిగ్రెట్ లేదా?’’ అంటూ గౌతమ్‌ను అడిగారు నాగార్జున. ‘‘నిఖిల్‌తో నాకు గొడవయ్యింది. తను హర్ట్ అయ్యాడని అందరి ముందు సారీ కూడా చెప్పాను’’ అన్నాడు గౌతమ్. ‘‘నేనైతే తప్పు చేస్తే సారీ చెప్తాను’’ అన్నారు నాగ్. ‘‘అతను అన్నాడు. నేను అన్నాను. ముందు ఫ్రెండ్స్ అంటావు. తర్వాత ఏదైనా సందర్భంలో వాళ్లు నిన్ను ఏదైనా అంటే వాళ్ల గురించి చెడుగా చూపించడానికి ప్రయత్నిస్తావు అన్నాడు అలా అనగానే నా క్యారెక్టర్ మీద బ్యాడ్ మార్క్ పెడుతున్నట్టుగా నాకు అనిపించింది’’ అని వివరించాడు గౌతమ్. దీంతో అసలు ఏమైందో చూద్దామంటూ నామినేషన్స్ వీడియో ప్లే చేశారు నాగార్జున. అక్కడ నిఖిల్, గౌతమ్‌కు మధ్య జరిగిన గొడవను మరోసారి అందరూ చూశారు.
Also Read: కంటెస్టెంట్స్‌కు షాకిచ్చిన నాగార్జున.. ఈవారం కూడా డబుల్ ఎలిమినేషన్ తప్పదా?
గౌతమ్‌పై సీరియస్
నామినేషన్స్ సమయంలో యష్మీని వాడుకున్నావంటూ గౌతమ్ ఇచ్చిన స్టేట్‌మెంట్ తప్పు అని నాగార్జున సైతం ఫీలయ్యారు. ‘‘మూసుకొని కూర్చో అంటే తప్పు కాదు. వాడుకున్నావు అంటే తప్పు కాదు’’ అంటూ గౌతమ్ చేసిన తప్పులపై సీరియస్ అయ్యారు. ఆ తర్వాత ఇదే విషయంపై నిఖిల్‌తో డిస్కషన్ పెట్టారు. ‘‘ఆటలో నిన్ను గౌతమ్ కావాలని కొట్టాడని నువ్వు అనుకున్నావా?’’ అని నిఖిల్‌ను అడిగారు. ‘‘కొడుతున్నావని చెప్పాను తప్పా కావాలని కొడుతున్నావు అన్నట్టు నేను చెప్పలేదు’’ అని క్లారిటీ ఇచ్చాడు నిఖిల్. ‘‘మైండ్‌లో నీకు ముందు నుండే ఒక సమస్య ఉంది. నువ్వు మాత్రం ఆ దెబ్బ విషయంలోనే కావాలని బే అన్నావు కదా’’ అని గుర్తుచేశారు నాగార్జున.
రోహిణి అభిప్రాయం
‘‘బే అని కోపంలో వచ్చేసిందని నేను కూడా ఒప్పుకుంటాను’’ అని నిఖిల్ తన తప్పును ఒప్పుకున్నాడు. ‘‘కోపంలోనే వచ్చేసింది. కోపంలోనే అతనికి కూడా వచ్చింది’’ అని గౌతమ్ తరపున మాట్లాడారు నాగార్జున. ‘‘నిఖిల్ మనస్ఫూర్తిగా సారీ చెప్పినట్టు అనిపించిందా నీకు’’ అని అడిగారు. ‘‘ఫీల్ అయితే సారీ అని గౌతమ్ ఎలా చెప్పాడో. నిఖిల్ కూడా ఫీల్ అయితే సారీ అనే చెప్పాడు’’ అని రోహిణి చెప్పింది. ‘‘రోహిణికి కూడా అదే అనిపించింది. నువ్వు చాలా సేఫ్ ఆడతావని హౌస్‌మేట్స్ అందరి అభిప్రాయం’’ అని సీరియస్ అయ్యారు నాగార్జున. చివరిగా శనివారం ఒక ఎలిమినేషన్ తప్పదని ప్రోమోతోనే క్లారిటీ వచ్చేసింది.