Bigg Boss 8 Telugu Latest Promo: బిగ్ బాస్ 8లో ఫ్యామిలీ వీక్ చాలా ఎమోషనల్‌గా మొదలయ్యింది. ముందుగా నబీల్, రోహిణి మధర్ హౌస్‌లోకి వచ్చారు. కంటెస్టెంట్స్ అందరితో కాసేపు సరదాగా గడిపి వెళ్లారు. యష్మీ తండ్రి కూడా బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటర్ అయినట్టుగా ప్రోమో బయటికొచ్చింది. ఇక తాజాగా విడుదలయిన మరో ప్రోమోలో నిఖిల్ తల్లి కూడా బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చినట్టుగా చూపించారు. కంటెస్టెంట్స్ అందరినీ నవ్వుతూ పలకరిస్తూనే కప్ తీసుకొనే బయటికి రావాలని నిఖిల్‌ను మోటివేట్ చేశారు. తల్లి రాకతో ఒక్కసారిగా చాలా ఎమోషనల్ అయిపోయాడు నిఖిల్. కన్నీళ్లు పెట్టుకున్నాడు. చివరికి నిఖిల్ కోసం తన తల్లి ఒక టాస్క్ ఆడి కంటెస్టెంట్స్ అందరికీ గిఫ్ట్ ఇచ్చి వెళ్లారు.
నిఖిల్ మధర్‌కు వెల్‌కమ్
కంటెస్టెంట్స్ అంతా ఫ్రీజ్ అయిన సమయంలో నిఖిల్‌ను తన తల్లి ముద్దుపేరుతో పిలిచారు. తరువాత వస్తుంది నిఖిల్ మధరే అని కంటెస్టెంట్స్‌కు అర్థమయ్యింది. అదే విషయంపై యష్మీ, అవినాష్ కూడా ఎగ్జైట్ అయ్యారు. తన తల్లి గొంతు వినగానే నిఖిల్ కళ్లల్లో నుండి నీళ్లు వచ్చాయి. తన తల్లి రావడాన్ని నిఖిల్ గమనించలేకపోయాడు. కంటెస్టెంట్స్ అంతా ఆమెకు వెల్‌కమ్ చెప్పారు. లోపలికి రాగానే వెంటనే వెళ్లి తన కొడుకును హగ్ చేసుకున్నారు. దీంతో నిఖిల్ కన్నీళ్లు ఆగలేదు. అందరు కంటెస్టెంట్స్ ఫ్రీజ్ అయ్యి ఉండడం వల్ల నిఖిల్ మధరే అందరి దగ్గరకు ప్రత్యేకంగా వెళ్లి హగ్ చేసుకున్నారు. నిఖిల్ తల్లి రావడం చూసిన తేజ ఏడవడం మొదలుపెట్టాడు.
Also Read: యష్మి పై హైప్.. ఆడియన్స్ నాడీ పట్టుకున్న ఫాదర్..!
కంటెస్టెంట్స్‌కు గిఫ్ట్
టేస్టీ తేజ ఏడవడం గమనించిన నిఖిల్ మధర్.. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు. తను తన తల్లిని మిస్ అవుతున్నాడని కంటెస్టెంట్స్ చెప్పగానే నేను కూడా నీ తల్లినే కదా అంటూ తనను ఓదార్చారు. ఆ తర్వాత నిఖిల్‌తో ఒంటరిగా కూర్చొని మాట్లాడారు. ‘‘నీకోసం అందరూ ఎదురుచూస్తున్నారు. నీ ట్రోఫీ తీసుకొనే బయటికి రావాలి’’ అంటూ తనను మోటివేట్ చేశారు. ‘‘మీరు బయటికి వెళ్లే ముందు మీ అబ్బాయి కోసం ఒక ఆట ఆడాల్సి ఉంటుంది’’ అంటూ నిఖిల్ మధర్‌ను ఆదేశించారు బిగ్ బాస్. తను ఆడిన ఆటలో గెలిచి అందరికీ మటన్ ఇవ్వగలిగారు నిఖిల్ మధర్. దీంతో కంటెస్టెంట్స్ అంతా హ్యాపీగా ఫీలయ్యారు.
నో గొడవలు
వెళ్లిపోయి ముందు నిఖిల్, పృథ్విలతో కలిసి డ్యాన్స్ చేశారు. అలా నిఖిల్ తల్లి బిగ్ బాస్ హౌస్‌ను వదిలి వెళ్లే సమయం వచ్చేసింది. తన తల్లికి ఎమోషనల్‌గా సెండ్ ఆఫ్ ఇచ్చేసి చాలా ఫీలయ్యాడు నిఖిల్. అలా ఈ వారమంతా కంటెస్టెంట్స్ మధ్య ఎలాంటి గొడవలు లేకుండా ఫ్యామిలీ వీక్‌తోనే గడిచిపోయేలా ఉంది. కానీ ఎవరి ఫ్యామిలీ వచ్చినా కూడా టేస్టీ తేజ మాత్రం తన తల్లి బిగ్ బాస్ హౌస్‌లోకి రాలేకపోతుందని ఎమోషనల్ అవుతూనే ఉన్నాడు. చివరికి తేజకు కూడా ఏదో ఒక సర్‌ప్రైజ్ ఉంటుందేమో అని ప్రేక్షకులు భావిస్తున్నారు.