Thefts in Hyderabad: హైదరాబాద్ లో దొంగలు రెచ్చిపోతున్నారు. ఓ వైపు జన సంచారం తక్కువగా ఉన్న ఇండ్లలో రాత్రిల్లు దొంగలు పడుతూ ఉన్నదంతా దోచుకుని పోతుండగా మరోవైపు చెడ్డీ గ్యాంగులు సైతం నగరంలో కలకలం రేపుతున్నాయి. అంతే కాకుండా జేబు దొంగలు, చైన్ స్నాచర్ లు సైతం నగరంలో సంచరిస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. పోలీసులు నిఘా పెట్టి అరెస్టులు చేసి కేసులు పెడుతున్నా దొంగల తీరు మాత్రం మారడం లేదు. తాజాగా హైదరాబాద్ లో రెండు చోట్ల దొంగలు రెచ్చిపోవడం ఆందోళన కలిగిస్తోంది.
Also read: రాజకీయాలకు అనిల్ గుడ్ బై.. కారణం ఇదేనా..?
వరుస ఘటనలు చోటు చేసుకోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఐమాక్స్ వద్ద న్యాయవాదిపై ఇద్దరు మైనర్ లు దాడి చేశారు. ఐమాక్స్ వద్ద ఉన్న న్యాయవాది కళ్యాణ్ పై దాడి చేసి అతడి చేతిలో ఉన్న ఫోన్ ను ఎత్తుకుని పోయారు. ఆ దొంగలే మొదట అబిడ్స్ వద్ద వాచ్ మెన్ ను కత్తితో బెదిరించి మెబైల్ ఫోన్ ఎత్తుకెళ్లడం ఆశ్చర్యకరం. రెండు ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా నింధితులను అదుపులోకి తీసుకున్నారు.
రెండు చోట్లా సీసీ టీవీలో దృష్యాలు రికార్డు అవ్వడంతో నింధితులను గుర్తించగలిగారు. దొంగలు ఇద్దరూ మైనర్లు కావడం ఆందోళన కలిగిస్తోంది. చిన్న వయసులోనే నేరవృత్తిని ఎంచుకోవడంతో భవిష్యత్తులో ఇంకెలాంటి నేరాలు చేస్తారో అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఈ మధ్య లగ్జరీ లైఫ్ కోసం కూడా దొంగతనాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. జల్సాలకు అలవాటు పడి అప్పులు చేస్తూ, అవి కట్టలేక కాలేజీ విద్యార్థులు సైతం చైన్ స్నాచర్లుగా మారుతున్నారు. దీంతో వారికి సరైన కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంతే కాకుండా తల్లి దండ్రులు కూడా వారి పిల్లలపై దృష్టి పెట్టాలి.