SatyaSri : బుల్లితెర టాప్ కామెడీ షో జబర్దస్త్ ద్వారా ఎంతో మంది టాలెంట్ కమెడియన్ లు పాపులారిటిని సొంతం చేసుకున్నారు.. కొందరు వరుస సినిమా ఆఫర్స్ ను అందుకుంటే మరికొందరు మాత్రం ఏకంగా సినిమాలను తెరకేక్కిస్తూ బిజీ అవుతున్నారు. ఏది ఏమైన జబర్దస్త్ షో అందరికి అన్నం పెట్టింది. ఈ షో తర్వాత చాలా మంది ఆస్తులను వెనకేసుకుంటున్నారు. తాజాగా మరో జబర్దస్త్ బ్యూటీ సొంతింటి కలను నెర వేర్చుకుంది.. ఆ బ్యూటీనే సత్య శ్రీ.. ఈమె కొత్తింటిలో గృహప్రవేశం చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
జబర్దస్త్ కమెడియన్ సత్య శ్రీ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. చమ్మక్ చంద్ర టీమ్ లో లేడి కంటెస్టెంట్ గా చేసింది. చంద్రతో పోటీగా స్కిట్ లు చేసి పాపులర్ అయ్యింది. జబర్దస్త్ తో మంచి గుర్తింపు పొందిన సత్యశ్రీ మనందరికీ సుపరిచితమే. జబర్దస్త్ స్కిట్స్ లో నటించి పలు ఈవెంట్స్, సినిమాలు కూడా చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది.. ఆ క్రేజీతోనే ఇప్పుడు, ఓ వైపు టీవీ షోలు, ఇంకో వైపు సినిమాలు చేసుకుంటూ ఫుల్ బిజీగా ఉంది సత్యశ్రీ. తాజాగా, సత్యశ్రీ ఒక కొత్త ఇల్లు గృహ ప్రవేశం చేసింది.. ఆ ఇంటి ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తన ఇంటి గృహ ప్రవేశం ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ విషయాన్ని చెబుతూ ” ఇది ఇల్లు కాదు నా కల. కొత్త ఇల్లు, కొత్త ప్రారంభం, కొత్త జ్ఞాపకాలు. సొంతూరు తణుకులో నేను కట్టించుకున్న సొంత ఇల్లు ” అంటూ పోస్ట్ చేసింది. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు, బుల్లితెర ప్రేక్షకులు సత్యశ్రీ కు విషెస్ తెలుపుతున్నారు. ఆమెతో నటించిన కమెడీయన్స్ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ఈ ఫోటోలు వైరల్ అవ్వడంతో వాటిని చూసిన నెటిజన్లు మాత్రం రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. చమ్మక్ చంద్ర లాంటి వాళ్ళే కొత్త ఇల్లు కట్టుకునే డబ్బులు లేవని చెప్తుంటారు. మరి ఈమెకు అంత డబ్బులు ఎలా వచ్చాయబ్బా అని కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి కామెంట్స్ వినపడటం కామన్.. కొందరు స్పందిస్తారు. మరికొందరు లైట్ తీసుకుంటారు. ఇక సత్య ఈ కామెంట్స్ పై ఎలా రియాక్ట్ అవుతుందేమో చూడాలి..