Indian Top Honeymoon Destinations: కొత్త పెళ్లైన వాళ్లు ఏకాంతంగా గడిపేందుకు హనీమూన్ ప్లాన్ చేసుకుంటారు. ఈ రోజుల్లో హనీమూన్ అనేది కామన్ అయ్యింది. పెళ్లి కాగానే చాలా మంది హ్యాపీగా జాలీగా గడిపేందుకు హనీమూన్ కు వెళ్లిపోతున్నారు. కాస్త డబ్బు ఉన్నవాళ్లు విదేశాల్లో హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటారు. మధ్య తరగతి ప్రజలు ఇండియాలోనే హనీమూన్ కు ఏర్పాట్లు చేసుకుంటారు. మన దేశంలో మీడియం బడ్జెట్ బెస్ట్ హనీమూన్ డెస్టినేషన్స్ ఎక్కడ ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
ఇండియాలో బెస్ట్ హనీమూన్ ప్లేసెస్
❂ ఊటీ: ఇండియాలో బెస్ట్ హనీమూన్ డెస్టినేషన్స్ లో ఊటీ ఒకటి. చుట్టూ అందమైన పర్వతాలు, ఎటు చూసినా తేయాకు పంటలతో ఎంతో అందంగా కనిపిస్తుంది. నూతన దంపతులు ఇక్కడికి హనీమూన్ కు వెళ్తే చక్కగా ఎంజాయ్ చేసే అవకాశం ఉంది.
❂ కొడైకెనాల్: భారత్ లోని అత్యంత అందమైన ప్రదేశాల్లో కొడైకెనాల్ టాప్ లో ఉంటుంది. చక్కటి ప్రకృతి సౌందర్యం, ఆహ్లాదకరమైన వాతావరణం కొత్త జంటలో నూతన ఉత్తేజాన్ని నింపుతుంది. కొడైకెనాల్ సరస్సులో బోటు ప్రయాణం, కోకర్స్ వాక్ సరికొత్త అనుభూతిని కల్పిస్తాయి.
❂ మున్నార్: ఎటు చూసినా పర్వతాలు, లోయలు, నదులతో ఎంతో అందంగా ఉంటుంది. ఇండియాలో హనీమూన్ జరుపుకోవాలి అనుకునే వారికి మున్నార్ బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. కొత్త జంటలు ఇక్కడికి వెళ్తే ఎంతో సంతోషంగా గడిపే అవకాశం ఉంటుంది.
❂ డార్జిలింగ్: ప్రకృతి అందాలకు నెలవైన డార్జిలింగ్ కూడా బెస్ట్ హనీమూన్ డెస్టినేషన్ గా చెప్పుకోవచ్చు. తక్కువ ఖర్చులో మంచి ట్రిప్ కావాలనుకుంటే డార్జిలింగ్ ను ఎంచుకోవచ్చు. చుట్టూ తేయాకు తోటలు, టైగర్ హిట్ సన్ రైజ్, యునెస్కో గుర్తింపు పొందిన టాయ్ ట్రైన్ జర్నీ కొత్త జంటలకు సరికొత్త అనుభూతిని అందిస్తాయి.
❂ కూర్గ్: ప్రకృతి సౌందర్యానికి కేరాఫ్ అనగానే కూర్గ్ గుర్తొస్తుంది. ఈ ప్రాంతాన్ని స్కాట్లాండ్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. అద్భుతమైన జలపాతాలు, కాఫీ తోటలు, అందమైన కొండలు ఆహ్లాదకరంగా ఆకట్టుకుంటాయి. ఇక్కడి కాఫీ రుచి చూసి నూతన దంపతులు కొత్త అనుభూతిని పొందుతారు.
❂ రిషికేష్: భారత్ లో తక్కువ ఖర్చుతో బెస్ట్ హనీమూన్ డెస్టినేషన్ లో రిషికేష్ ఒకటి. ట్రెక్కింగ్ సహా ప్రకృతి అందాలకు నెలవైన ఈ ప్రాంతం ఆధ్యాత్మిక శోభను కలిగి ఉంటుంది. ఇక్కడ ఉన్న పురాతన ఆలయాలను సందర్శించుకుని ఆశీస్సులు పొందుతారు.
❂ డల్హౌసీ: హిమాలయాలలో ఉన్న అద్భుతమైన హనీమూన్ స్పాట్ డల్హౌసీ. ఈ ప్రాంతం మినీ స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ ప్రదేశంలో అద్భుతమైన లోయలు, పైన్ అడవులు, మంచు శిఖరాలు కొత్త జంటలకు కొత్త అనుభూతిని కల్పిస్తాయి.
❂ గోవా: ఇండియాలో బెస్ట్ హనీమూన్ డెస్టినేషన్స్ లో గోవా టాప్ ప్లేస్ లో ఉంటుంది. ఆహ్లాదకరమైన బీచ్‌లతో అత్యంత సుందరంగా కనిపిస్తుంది. బెస్ట్ బడ్జెట్ లో అన్ లిమిటెడ్ సంతోషాన్ని పొందాలంటే గోవాకు వెళ్లాల్సిందే.
Read Also: ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం