Pushpa 2 Bookings : ఎన్ని ట్రోల్స్ వచ్చినా.. ఇంకా ఏం జరుగుతున్నా… అందరి చూపు మాత్రం పుష్ప 2 పైనే ఉన్నాయి. సినిమా ఎలా ఉండబోతుందని నార్మల్ ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. అల్లు అర్జున్ ఆర్మీ మాత్రం ఎన్ని రికార్డులు క్రియేట్ చేయబోతుందని చూస్తుంది. ఇదంత పక్కన పెడితే… అసలు నైజాంలో ఇప్పటి వరకు ఒక్క థియేటర్‌తో కూడా నిర్మాతలు అగ్రిమెంట్ చేసుకోలేదట. ఇది ఇప్పుడు అల్లు అర్జున్ ఆర్మీతో పాటు ఇండస్ట్రీ జనాలను కలవరపెడుతుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా.. ఇంకా ఎందుకు థియేటర్లతో అగ్రిమెంట్ చేసుకోలేదు? అసలు నైజాం ఏరియాలో అసలేం జరుగుతుంది అనేది ఇప్పుడు చూద్ధాం…
ఇండస్ట్రీలో… నిర్మాతలు కోట్ల రూపాయలు ఖర్చు చేసి సినిమాను నిర్మిస్తారు. దాన్ని డిస్ట్రిబ్యూటర్స్‌కు అమ్ముతారు. అలా… థియేటర్స్ వరకు సినిమా వస్తుంది. సినిమా థియేటర్స్ వరకు వచ్చిన తర్వాత ఆడియన్స్ నుంచి టికెట్ల రూపంలో వచ్చిన డబ్బును ఎగ్జిబ్యూటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ల నుంచి నిర్మాతల వరకు వెళ్తుంది. ఇక్కడ చూడాల్సిందేంటంటే… సినిమా రిలీజ్ అయ్యాకా.. టికెట్ల రూపంలో వచ్చిన డబ్బును నిర్మాతల వరకు చేర్చుతారు.
కానీ, ఇప్పుడు పుష్ప2 మూవీకి థియేటర్ల నుంచి ముందే డబ్బులు అడుగుతున్నారట నిర్మాతలు.పెద్ద సినిమా, భారీ బడ్జెట్, ఫైనాన్స్ ఇబ్బందులు ఉంటాయి.. థియేటర్స్ నుంచి ముందే డబ్బు అడిగితే తప్పు ఏంటి అని అనుకోవచ్చు. కానీ, ఇక్కడ థియేటర్లను నిర్మాతలు ముందు డబ్బులు అడగడమే కాదు… చాలా ఎక్కువ మొత్తంలో అడుగుతున్నారాట. నిర్మాతలు అడిగినంత ఇస్తేనే మీ థియేటర్స్‌తో అగ్రిమెంట్ చేసుకుంటామని చెబుతున్నారట.
థియేటర్లు ఇస్తా అని చెబుతున్న కంటే మూడు రేట్లు ఎక్కువ డబ్బులు అడుగుతున్నారట నిర్మాతలు. దీంతో థియేటర్లు పుష్ప 2 సినిమాతో అగ్రిమెంట్ చేసుకోవడానికి ముందుకు రావడం లేదు.
నిజానికి థియేటర్స్ నుంచి ఒక వేళ ముందే డబ్బులు తీసుకుంటే… శుక్ర, శని, ఆదివారం.. ఈ మూడు రోజుల్లో టికెట్ల రూపంలో వచ్చే డబ్బులను బట్టి, ఓ అంచనా వేసి అడుగుతారు. కానీ, ఇప్పుడు పుష్ప2 నిర్మాతలు అడుగుతున్న డబ్బులు థియేటర్స్ వాళ్లకు రిటర్న్ రావాలంటే.. కనీసం వారం రోజుల టైం అయిన పట్టే ఛాన్స్ ఉందట.
దీంతో థియేటర్స్ ఓనర్లు పుష్ప 2 మేకర్స్‌తో ఒప్పందం చేసుకోవడానికి సిద్ధంగా లేరని తెలుస్తుంది. ఒక వేళ నిర్మాతలు ఈ విషయంలో తగ్గకపోతే… డిసెంబర్ 4న నైజం ఏరియాలో ఒక్క థియేటర్‌లో కూడా పుష్ప 2 మూవీ రాకపోవచ్చు.
సాధరణంగా పెద్ద సినిమాలకు టికెట్ బుకింగ్స్ కనీసం వారం ముందుగానే ఓపెన్ చేస్తారు. ఇటీవల వచ్చిన దేవర సినిమాకు కూడా 5 రోజుల ముందు అలా టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. కానీ, పుష్ప2 రిలీజ్ కి ఇంకా 7 రోజులే ఉంది. కానీ, ఇప్పటి వరకు ఒక్క థియేటర్‌తో కూడా ఒప్పందం జరగలేదు.
పుష్ప 2 మూవీని డిసెంబర్ 5న రిలీజ్ చేబోతున్నారు. అయితే నైజాం ఏరియాలో యూఎస్ కంసాిటే ముందుగానే రిలీజ్ అయ్యేలా… డిసెంబర్ 4వ తేదీన రాత్రి 8 గంటలు లేదా 10 గంటలకే థియేటర్లకు తీసుకోరావాలని చూస్తున్నారు నిర్మాతలు. అలా చేస్తే.. డిసెంబర్ 4వ తేదీ రాత్రి నుంచి 5వ తేదీ 8 గంటల వరకు పడేవి కార్పొరేట్ షోలే. ఈ కార్పొరేట్ షోల వల్ల థియేటర్ల ఎక్కువ డబ్బులు వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటికే డిసెంబర్ 4వ తేదీ రాత్రి, డిసెంబర్ 5వ తేదీ మార్నింగ్ టైంలలో షోల బుకింగ్స్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇక ఇప్పటి వరకు అయితే డిసెంబర్ 4న షోలకు, టికెట్ ధరలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పర్మిషన్ అయితే రాలేదు. ప్రభుత్వాన్ని నిర్మాతలు పర్మిషన్ కోసం లేటర్ రాసినట్టు తెలుస్తుంది. కానీ, ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ రాలేదు. అయితే, డిసెంబర్ 4న షోలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువే ఉంది. అలాగే టికెట్ ధర దాదాపు రూ. 630 వరకు ఉండాలని నిర్మాతలు ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం కూడా టికెట్ ధర రూ. 630 వరకు పర్మిషన్ ఇవ్వొచ్చు. పది రోజుల పాటు పుష్ప 2 టికెట్ ధర అంతే ఉండే ఛాన్స్ ఉంది.