BigTV English

Bigg Boss 8 Telugu Promo: బిగ్ బాస్ హౌస్‌లోకి శేఖర్ మాస్టర్.. కంటెస్టెంట్స్‌తో కలిసి పాటల సందడి

Bigg Boss 8 Telugu Promo: బిగ్ బాస్ హౌస్‌లోకి శేఖర్ మాస్టర్.. కంటెస్టెంట్స్‌తో కలిసి పాటల సందడి

Bigg Boss 8 Telugu Latest Promo: బిగ్ బాస్ సీజన్ 8 ఫైనల్స్‌కు దగ్గర పడుతుండడంతో హౌస్‌లోకి కొందరు సెలబ్రిటీలు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా తమ సినిమాలను ప్రమోట్ చేయడం కోసం తరచచుగా కొందరు సెలబ్రిటీలు హౌస్‌లోకి వస్తూనే ఉంటారు. ఇక తాజాగా ‘పుష్ప 2’లో శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫీ చేసిన పీలింగ్స్ పాట బయటికి వచ్చింది. ఆ పాట విడుదలయిన కాసేపటిలోనే తెగ వైరల్ అయిపోయింది. అయినా కూడా దానిని ప్రమోట్ చేయడం కోసం బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టాడు శేఖర్ మాస్టర్. కంటెస్టెంట్స్‌తో పాటలు పాడించి, ఆటలు ఆడించి సందడి చేశారు. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది.


వచ్చుండాయ్ పీలింగ్సు

బిగ్ బాస్ హౌస్‌లో శేఖర్ మాస్టర్‌ను చూసి తెగ ఎగ్జైట్ అయిపోయారు కంటెస్టెంట్స్. ఆయన రాగానే వెంటనే ఆయన చుట్టూ చేరారు. ఆయన రాకముందే కంటెస్టెంట్స్‌కు పీలింగ్స్ పాటను చూపించారు. దీంతో ఆయన రాగానే పాట బాగుందంటూ పాడి వినిపించింది రోహిణి. అవినాష్ అయితే శేఖర్ మాస్టర్ మ్యానరిజంలోనే పాట సూపర్, సూపర్ అని చెప్పాడు. అది చూసి మాస్టర్ నవ్వారు. పాటలో నిజంగానే కాలుతో స్టెప్ వేశారా అని వింత డౌట్ అడిగింది రోహిణి. ‘‘నిజం కాకపోతే మరి ఇంకేంటి? ఇప్పుడు నువ్వు ఆ స్టెప్ వేయాలి’’ అని తనను భయపెట్టారు మాస్టర్. ఆ తర్వాత కంటెస్టెంట్స్ అందరితో కలిసి సామి సామి పాటకు స్టెప్పులేశారు శేఖర్ మాస్టర్.


Also Read: నబీల్‌పై అవినాష్, రోహిణి ప్రతాపం.. మొదటిగా ప్రేక్షకులకు ఓటు అప్పీల్ చేసుకునేది ఎవరు?

సింక్‌లో లేని నబీల్

కంటెస్టెంట్స్‌తో ఒక ఫన్నీ టాస్క్ ఆడించారు శేఖర్ మాస్టర్. ఒక పాట రివర్స్‌లో ప్లే అయితే అదేంటో గెస్ చేసి చెప్పాలి అన్నారు. ఈ టాస్క్ కోసం కంటెస్టెంట్స్ అంతా రెండు టీమ్స్‌గా విడిపోయారు. ఒక టీమ్‌లో రోహిణి, ప్రేరణ, అవినాష్ ఉండగా.. మరొక టీమ్‌లో గౌతమ్, నబీల్, విష్ణుప్రియా, నిఖిల్ ఉన్నారు. ముందుగా విష్ణుప్రియా ఆ పాటను గెస్ చేసింది. ‘అల వైకుంఠపురంలో’ నుండి రాములో రాముల పాట అని కరెక్ట్‌గా చెప్పింది. ఆ పాటకు సంబంధం లేకుండా బుట్టబొమ్మ స్టెప్ వేశాడు నబీల్. అది చూసిన శేఖర్ మాస్టర్.. రోహిణితో చెప్పుకొని నవ్వుకున్నాడు. కంటెస్టెంట్స్ అందరితో కలిసి రాములో రాములకు కూడా స్టెప్పులేశాడు మాస్టర్.

ఆశ్చర్యపోయిన మాస్టర్

కంటెస్టెంట్స్ అంతా పాటలను కరెక్ట్‌గా గెస్ చేస్తుండడంతో అసలు ఎలా కనిపెడుతున్నారు మీరు అంటూ ఆశ్చర్యపోయాడు శేఖర్ మాస్టర్. ‘‘బీట్ తెలిసిపోతుంది’’ అంటూ కాన్ఫిడెంట్‌గా సమాధానమిచ్చింది విష్ణుప్రియా. కానీ తర్వాత ప్లే అయిన పాటను తన టీమ్ సైతం కనిపెట్టలేకపోయింది. అయినా కూడా నబీల్ వెళ్లి బెల్ కొట్టాడు. మెల్లగా కనిపెట్టొచ్చులే అనుకునేలోపు టైమ్ అయిపోయింది. అలా శేఖర్ మాస్టర్ బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చి కాసేపటి వరకు కంటెస్టెంట్స్‌తో కలిసి సరదాగా ఎంజాయ్ చేసి వెళ్లారు. ప్రస్తుతం బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అంతా ఫైనల్స్, ఓటు అప్పీల్ టెన్షన్‌లో ఉండడంతో మాస్టర్ రాక వారికి కాస్త రిలీఫ్‌ను ఇచ్చినట్టు తెలుస్తోంది.

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×