Trolling Effect On Allu Arjun: ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న పాన్ ఇండియా హీరోస్ లో అల్లు అర్జున్ ఒకరు. గంగోత్రి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ ఆర్య సినిమాతో అద్భుతమైన గుర్తింపును సాధించుకున్నాడు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయం సాధించింది. ఒక ప్రేమ కథను ఇలా కూడా చెప్పొచ్చు అని సరికొత్తగా చూపించాడు సుకుమార్. ఇక వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా పుష్ప. ఈ సినిమాతోనే ఇద్దరికీ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు లభించింది. పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయింది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వల్ గా పుష్ప 2 రిలీజ్ కానుంది. డిసెంబర్ 5న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈవెంట్ కి సంబంధించి అల్లు అర్జున్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
వీటిలో కొన్ని ఫొటోల్లో అల్లు అర్జున్ నవ్వుతూ ఉన్నారు. నవ్వుతూ ఉండడం పెద్ద విశేషమా అనుకోవచ్చు. కానీ అల్లు అర్జున్ నవ్వుతున్న ప్రతిసారి తన ముఖానికి చేయి అడ్డం పెట్టుకొని నవ్వుతున్నారు. దీనికి కారణం లేకపోలేదు. వక్కంతం వంశీ దర్శకుడుగా పరిచయమైన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ నవ్విన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ సినిమాలో అల్లు అర్జున్ ఆర్మీ ఆఫీసర్ల కనిపిస్తుంటాడు. అయితే ఆ సినిమాకి సంబంధించి గెటప్ అంతగా బన్నీకి సెట్ కాలేదు. చాలామంది ఆ రోజుల్లోనే ట్రోల్ చేశారు. అయితే ఆ సినిమా ఈవెంట్ లో ఫోటోలు మాత్రం బీభత్సమైన వైరల్ గా మారాయి. అప్పట్నుంచి అల్లు అర్జున్ ఎప్పుడు నవ్వినా కూడా చేయి అడ్డుపెట్టుకుని నవ్వుతూ ఉంటారు.
Also Read : Anchor Jhansi: యాంకర్ ఝాన్సీ రెండో పెళ్లి.. కూతురు ముందే ఏం చెప్పిందంటే.. ?
ఇకపోతే అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా రాజమౌళి రికార్డ్స్ ను బ్రేక్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రీసెంట్ గా అల్లు అర్జున్ కూడా మాట్లాడుతూ బాహుబలి, ట్రిపుల్ ఆర్ వంటి సినిమాలతో ఈ సినిమాను పోల్చాడు. ఇకపోతే పుష్ప సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయన్నమాట వాస్తవమే. అని చాలామంది నిరుత్సాహపరుస్తున్న విషయం ఈ సినిమా టికెట్ రేట్లు. ముంబై వంటి ప్రదేశంలో ఈ సినిమాకి ఏకంగా మూడు వేల రూపాయల టికెట్ రేట్ ని పెట్టారు. బెంగళూరులో ఈ సినిమా టికెట్ రేటు 2000కు పైగా ఉంది. హైదరాబాదులో 1200 వరకు ఉంది. ఇదే విషయాన్ని ఆడియో లాంచ్ లో సామాన్య ప్రేక్షకులు అడిగినా కూడా ప్రొడ్యూసర్లు ఒక షోకే అంటూ ఆ మాటలను దాటేశారు.