BigTV English

Anchor Jhansi: యాంకర్ ఝాన్సీ రెండో పెళ్లి.. కూతురు ముందే ఏం చెప్పిందంటే.. ?

Anchor Jhansi: యాంకర్ ఝాన్సీ రెండో పెళ్లి.. కూతురు ముందే ఏం చెప్పిందంటే.. ?

Anchor Jhansi : యాంకర్ ఝాన్సీ  గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు యాంకర్ అంటే టక్కున సుమ పేరు గుర్తొస్తుంది కానీ, అప్పట్లో స్టార్ యాంకర్స్ చాలా మంది ఉండేవారు. అందులో చెప్పుకోదగ్గవారిలో ఝాన్సీ ఒకరు. అప్పట్లో ఆమె చేసిన షోస్ అలాంటివి. ఇక నెమ్మదిగా ఝాన్సీ .. యాంకరింగ్ నుంచి సినిమాల్లోకి వచ్చింది. ప్రస్తుతం  సీనియర్ ఆర్టిస్ట్ గా మంచి స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తుంది.


ఇక ఝాన్సీ జీవితంలో ఎన్ని వివాదాలు ఉన్నా.. అందరికీ తెల్సిన వివాదం.. ఆమె వార్తకు విడాకులు ఇవ్వడం. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే నటుడు జోగి నాయుడును ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుంది. సహజీవనం చేసినప్పుడు బాగానే ఉన్నా.. పెళ్లి చేసుకున్నాకా ఏడాది కూడా  ఈ జంట  కలిసి ఉండలేదు. విభేదాల వలన విడిపోయే సమయానికి ఝాన్సీకి కూతురు ఉంది. దీంతో కూతురు కస్టడీ కోసం జోగి నాయుడు ఎంతో  ప్రయత్నించాడు.

Also Read :  సామాన్యుడిలా శబరిమలకు స్టార్ హీరో.. స్టార్లలో ఈ స్టార్ వేరయా..


కనీసం.. వారానికి ఒకసారి అయినా తన బిడ్డను చూపించాలని ఝాన్సీని ఎంతో  బతిమాలాడానని, దానికి ఆమె ససేమిరా ఒప్పుకోలేదని, తన బిడ్డ మీద బెంగతోనే తాను కృంగిపోయినట్లు జోగినాయుడు ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. ఆ తరువాత కొన్నేళ్లకు  జోగినాయుడు వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఝాన్సీ మాత్రం కూతురును పెంచుతూ వస్తుంది. ఇక ఇప్పుడు ఆ కూతురు పెరిగి పెద్దది అయ్యి హీరోయిన్ గా మారుతుంది.

ఝాన్సీ- జోగినాయుడు కూతురు పేరు ధన్య. ఆమె వయస్సు 22. ప్రస్తుతం చదువుకుంటున్న ధన్య.. ఇండస్ట్రీలో అడుగుపెట్టాలని చూస్తుంది. తాజాగా ఝాన్సీ.. తన కూతురు ధన్యతో కలిసి మొదటిసారి ఒక ఇంటాక్ షోకు వచ్చింది. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న కాకమ్మ కథలు అనే షోలో ఈ తల్లీకూతుళ్లు సందడి చేశారు. అల్లరిపిల్ల తేజస్వి మదివాడ.. వారిద్దరిని తనకు నచ్చిన ప్రశ్నలతో మరింత ఉక్కిరిబిక్కిరి చేసింది.

Also Read : అన్న అయ్యప్ప మాల.. తమ్ముడు హనుమాన్ మాల.. బావుందిగా

ఇక ఈ షోలో మొదటిసారి ధన్య.. తన మనసులోని మాటలను బయటపెట్టింది. తనకు 22 ఏళ్ళు అని, హిట్ 5’9 అని చెప్పింది. ఇండస్ట్రీలో పొడుగైన హీరోయిన్ గా మారతావని తేజూ అనగానే .. అవకాశాలు రావాలంటే అలా చెప్పకూడదని చెప్పి ధన్య షాక్ ఇచ్చింది. ఇక  తల్లితో తన అనుబంధం గురించి, చిన్నతనం నుంచి తను పెరిగిన విధానం గురించి చెప్పుకొచ్చింది.

ఇక తేజు షో అంటే  కాంట్రవర్సీ ప్రశ్నలు లేకుండా ఎందుకు ఉంటాయి. ఝాన్సీ ని కూడా ఆమె వదలలేదు. మీరు రెండో పెళ్లి ఎప్పుడు  చేసుకుంటున్నారు.. ? అని అడిగింది. దానికి ఝాన్సీ సీరియస్  ఎక్స్ ప్రెషన్ ఇచ్చి మాట్లాడినట్లు ఈ ప్రోమోలో చూపించారు. ఇక ఇలాంటి ప్రశ్నలు చాలానే అడిగింది. ఇక ధన్య.. మణిరత్నం సినిమాలో నటించాలని కోరిక అని చెప్పడంతో ఝాన్సీ కూడా షాక్ అయ్యింది. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. త్వరలోనే ధన్య కూడా ఇండస్ట్రీలో అడుగుపెట్టనుంది. మరి ఈ చిన్నదాన్ని టాలీవుడ్ కు పరిచయం చేసే డైరెక్టర్ ఎవరు అనేది తెలియాల్సి ఉంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×